• search
  • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మావోయిస్టుల వ్యూహాలు మారాయి...లేటెస్ట్ టెక్నాలజీ వాడారు!:భావజాలంలోనూ మార్పులు

|

విశాఖపట్టణం:ఆదివారం జరిగిన మావోయిస్టుల దాడిపై పోలీసులు విచారణ జరిపే కొద్దీ విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నట్లు తెలిసింది. నక్సలైట్లు గతంలో జరిపిన దాడులకు...తాజాగా జరిపిన ఈ ఎటాక్ కు చాలా తేడా ఉన్నట్లు పోలీసు వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

మావోయిస్టులు జరిపిన ఈ దాడిని అనలైజ్ చేస్తే వారి భావజాలాల్లో, వ్యూహాల్లో, టెక్నాలజీ వాడకంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని పోలీసులు అంటున్నారు. మావోయిస్టుల్లో కనిపిస్తున్న ఈ మార్పులు మరింత ప్రమాదకరంగా భావించవచ్చని...అందువల్ల ప్రభుత్వం మావోయిస్టుల నిర్మూలన విషయంలో ప్రత్యేక శ్రద్ద కనబర్చకపోతే ముందు ముందు పెనుముప్పు తప్పదని వారు అభిప్రాయపడుతున్నారు.

మావోయిస్టుల దాడి...మార్పులు

మావోయిస్టుల దాడి...మార్పులు

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమలపై డుంబ్రిగూడ మండలంలోని లిప్పిట్టిపుట్టులో మావోయిస్టుల దాడి ఘటనను పోలీసులు వివిధ కోణాల్లో విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలో వెలుగులోకి వస్తున్న అనేక విషయాలు పోలీసుల్లో ఆందోళన పెంచుతున్నాయి. నక్సల్స్ తాజా దాడి వెనుక ఆరు నెలల వ్యూహం ఉండి ఉండొచ్చని పోలీసుల అంచనా. ఇక ఈ దాడి మావోయిస్టుల వ్యూహాల్లో, భావజాలాల్లో, సాంకేతికత వినియోగంలో వచ్చిన మార్పులను పట్టి చూపడంతో పాటు మరోవైపు పోలీసుల వైఫల్యాలను ఎత్తిచూపుతోందని విశ్లేషిస్తున్నారు.

మార్పు 1...టార్గెట్ పై ఎటాక్

మార్పు 1...టార్గెట్ పై ఎటాక్

సాధారణంగా మావోయిస్టులు తమ పని పూర్తి చేయడానికి యాక్షన్ టీమ్ ద్వారానో లేదా మందుపాతరలను ఉపయోగించడం చేస్తుంటారు. కాని అరకు ఘటనలో వారు పూర్తి భిన్నమైన వ్యూహాన్ని...అదీ అత్యంత పకడ్బందీగా అమలు చేసి టార్గెట్ పూర్తిచేశారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను చంపేందుకు ఏకంగా అరవైమంది మావోయిస్టులు ఒకేసారి...నిర్భయంగా జనావాసాల్లోకి రావడం విభిన్నమైన వ్యూహాన్ని...వారి భావజాలాల్లో మార్పును రెండింటినీ సూచిస్తోంది. అంతమంది సమూహంగా రావడం ద్వారా పోలీసులు చెబుతున్నట్లుగా తాము అతి తక్కువ సంఖ్యలో ఉన్నామనేది నిజం కాదని,అలాగే దొంగచాటు దాడులే చెయ్యాల్సిన అగత్యం లేదని స్పష్టం చెయ్యదల్చుకున్నట్లు అర్థమవుతోంది. అలాగే సానుభూతిపరులకు ఒక భరోసా ఇవ్వాలనే సంకల్పమూ కనిపిస్తోంది.

మార్పు 2...టార్గెట్ రీచ్

మార్పు 2...టార్గెట్ రీచ్

అలావచ్చిన మావోయిస్టులు ఖచ్చితంగా టార్గెట్ రీచ్ అయ్యారు. ఇందుకోసం వారు టెక్నాలజీని వినియోగించినట్లు ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారాన్ని బట్టి తెలిసింది. ఎమ్మెల్యేల వాహనాలను అడ్డుకొని వారు కిందికి దిగిన తరువాత తాము అదుపులోకి తీసుకున్న ఎమ్మెల్యే గన్ మ్యాన్ వివరాలు తెలుసుకొని వాటిని తమ వద్ద ఉన్న ట్యాబ్ లో సరిచూశారు. ఆ తరువాత ఎమ్మెల్యే వెంట రెగ్యులర్ గా వచ్చే గన్ మ్యాన్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. దీన్నిబట్టి పోలీసుల వివరాలు సైతం క్షుణ్ణంగా తెలుసుకునే లేటెస్ట్ టెక్నాలజీని వారు వాడుతున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఆ క్రమంలో వారు ఎమ్మెల్యే వాహనాలను ఐడెంటిఫై చేసేందుకు, టార్గెట్ రీచ్ అయ్యేందుకు కూడా టెక్నాలజీ వాడే ఉంటారని భావించవచ్చు.

మార్పు 3...మహిళా మావోలే ఎక్కువ

మార్పు 3...మహిళా మావోలే ఎక్కువ

సుదీర్ఘవిరామం తరువాత జరిగిన ఈ దాడిలో గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో మహిళా మావోయిస్టులు పాల్గొనడం...పైగా ఈ దాడికి నేతృత్వం వహించింది కూడా ఒక మహిళా మావోయిస్టేనని తెలియడం పోలీసులకు ఆశ్చర్యం కలిగించింది. గతంలో అనేక దాడుల్లో మహిళలు సహకారులుగా వ్యవహరించిన సందర్భాలే తప్ప వారే లీడ్ చేసిన సందర్భాలు అరుదు.పైగా ఈ దాడి ఆద్యంతం చూస్తే మహిళా మావోయిస్టులే మొత్తం ప్రధాన పాత్ర పోషించినట్లు వెల్లడవుతోంది.

ఒకే దాడిలో వారు అంతపెద్ద సంఖ్యలో పాల్గొనడం వెనుక కూడా సందేశం ఉందనే చెప్పుకోవచ్చు.

మార్పు 4...ఐడియాలజీ ఛేంజ్

మార్పు 4...ఐడియాలజీ ఛేంజ్

ప్రజాపతినిధులను పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చిచంపిన తరువాత చంపిన తరువాత ఎమ్మెల్యే గన్ మ్యాన్ ల దగ్గర వచ్చిన మావోయిస్టు అరుణ, పోలీసు కుక్కల్లారా మీ భార్యా పిల్లల మొఖం చూసి వదిలిపెడుతున్నాం...అనేసి వెళ్లడం మావోయిస్టుల ఐడియాలజీలో వచ్చిన మార్పును సూచిస్తోందనుకోవచ్చు. గతంలో ప్రభుత్వ ఉద్యోగులు...ముఖ్యంగా పోలీసులు...వారు పోలీస్ కానిస్టేబుల్ అయినా సరే దొరికితే వారిని ముందూవెనుక చూడకుండా చంపే భావజాలం మావోయిస్టుల్లో ఉండేది. కానీ తాజా దాడి సందర్భంలో వ్యాఖ్యలను బట్టి తమ టార్గెట్ కేవలం పోలీసులు కాదని...ప్రజాప్రతినిధులు లేదా ప్రజలకు ప్రత్యక్షంగా నష్టదాయకంగా పరిణమిస్తున్నవారు అనే సందేశం మావోయిస్టులు ఇచ్చారని అంటున్నారు.లే మా టార్గెట్ పోలీసులు కాని, ప్రజలు మాటార్గె కాదంటూ మెసెజ్ పంపడం మావోల ఉద్దేశ్యం. అలాగే యాక్షన్ టీమ్ తో ఇష్టానుసారం కాల్పుల ద్వారా వేరే వ్యక్తులు గాయపడటం, మందుపాతరల వంటి వాటి ద్వారా సామాన్య ప్రజలకు నష్టం కలిగించదల్చుకోలేదని ఈ వ్యూహంతో తెలియచెప్పారనుకోవచ్చు.

మార్పు 5...జనాల్లో;పోలీసుల్లో

మార్పు 5...జనాల్లో;పోలీసుల్లో

ఈ మార్పు మావోయిస్టులకు సంబంధించి కాకుండా జనాల్లో పోలీసుల్లో వచ్చిన ఛేంజ్ ని విశదీకరిస్తోంది. 60 మంది మావోయిస్టులు రెండురోజులు ముందే గ్రామంలో ఎంటరై బస చేస్తే పోలీసులకు ఎందుకు ఎవరి నుంచి సమాచారం రాలేదు?...కమ్యూనిటీ పోలీసింగ్ ఏమైంది...చీమ చిటుక్కుమంటే సమాచారం వచ్చే ఇంటలిజెన్స్ వింగ్ కి 150 మంది ఉన్న ఆ గ్రామంలో 60 మంది మావోయిస్టులు మకాం వేసినా ఎందుకు సమాచారం అందలేదు...పైగా దాడి చేశాక కూడా ఈ మావోయిస్టులు వచ్చిన దారినే కుండ్రం గ్రామం నుండి పడువా మీదుగా పొట్టంగి చేరుకున్నా ఎవరూ పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు?...అంటే దీన్ని బట్టి మూడు విషయాలు అర్థం చేసుకోవచ్చు...ఆయా గ్రామాల్లో పోలీసు పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందనేది...రెండు పోలీసులు సమాచారం కోసం గతంలోలాగా వీరితో సంబంధబాంధవ్యాలు కొనసాగించడం లేదనేది...మూడు ఇంటలిజెన్స్ వైఫల్యం, నిర్లక్ష్యంగా అర్థంచేసుకోవచ్చు. ఇప్పటికైనా పోలీసులు ఓవర్ కాన్ఫిడెన్స్ పక్కనపెట్టి మావోయిస్టులపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

English summary
Visakhapatnam:The Police have been analysing in different angles over Maoists' Sunday attack. Many new things come to light in this order.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X