వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్కే మా వద్ద లేడు: ఎపి పోలీసులు

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ తమ అదుపులో లేడని ఆంద్రప్రదేశ్ పోలీసులు స్పష్టం చేశారు. ఈ మేరకు ఏపి పోలీసులు హైకోర్టుకు తెలిపారు.
మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ ఆచూకీని తెలపాలని కోరుతూ ఆయన భార్య శిరీష హైకోర్టును ఆశ్రయించారు.ఈ మేరకు గురువారం నాడు ఎపి పోలీసులు ఆర్ కె ఆచూకీపై హైకోర్టుకు సమాధానం తెలిపారు. రామకృష్ణ తమ అదుపులో లేడని పోలీసులు కోర్టుకు తెలిపారు.

ఏఓబిలో జరిగిన ఎన్ కౌంటర్ సమయం నుండి మావో అగ్రనేత రామకృష్ణ , గాజర్ల రవి, చలపతిల ఆచూకీ లేదు. ఇప్పటివరకు వారి సమాచారం గురించి పార్టీ వర్గాలకు సమాచారం చేరలేదు.దీంతో పోలీసుల అదుపులోనే మావో అగ్రనేతలు ఉన్నారని రామకృష్ణ కుటుంబసభ్యులు , ప్రజాసంఘాలు, హాక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను పోలీసులు ఖండిస్తున్నారు.రామకృష్ణ ఆచూకీ కోసం ఆయన సతీమణి రెండు రోజుల క్రితం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

maoist top leader ramakrishna not our custody :ap police

ఆర్ కె ఎక్కడ
అటు పోలీసుల వద్ద లేకుండా....పార్టీకి అందుబాటులోకి రాకుండా ఎన్ కౌంటర్ ప్రాంతం నుండి తప్పించుకొన్న మావో అగ్రనేత రామకృష్ణ ఎక్కడ ఉన్నాడనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.ఎన్ కౌంటర్ జరిగిన రోజున మావో అగ్రనేతలు కూడ ఎన్ కౌంటర్ లో ఉండి ఉంటారని పోలీసులు అనుమానించారు. కాని, ఆర్ కె, రవి లు ఎన్ కౌంటర్ నుండి తప్పించుకొన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో దొరికిన కిట్ బ్యాగులు, ఆయుధాల ఆదారంగా 50 కి పైగా మావోయిస్టులు సమావేశంలో ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.అయితే ఎన్ కౌంటర్ లో 32 మంది మరణించారు. మిగిలినవారు ఏమయ్యారనేది ఇంకా అంతుబట్టడం లేదు..ఎన్ కౌంటర్ నుండి తప్పించుకొన్న మావోలు తమ సమాచారాన్ని పార్టీకి రహాస్య మార్గాల ద్వారా చేరవేస్తుంటారు. కాని, ఇంత వరకు రామకృష్ణ సహా అగ్రనేతల జాడ పార్టీకి అందలేదు. దీంతో పోలీసు అదుపులోనే అగ్రనేతలు ఉన్నారని ప్రజాసంఘాలు, హక్కుల సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి.అయితే హైకోర్టుకు తమ అదుపులో ఆర్ కె లేడని ఎపి పోలీసులు చెప్పడంతో ...ఆయన ఎక్కడ ఉన్నాడు...ఎలా ఉన్నాడనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.

English summary
maoist top leader ramakrishna not our custody said ap police to highcourt on thursday.after aob an encounter ramakrishna missing till today. rk wife shirisha pray to thhe high court about ramakrishna information.thursday ap police answer to the high court .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X