వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్‌కౌంటర్ కు నిరసన: 5రాష్ట్రాల బంద్‌కు మావోల పిలుపు

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దులో సోమవారం(అక్టోబర్ 24) జరిగిన ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోయిస్టు నేతలు నవంబర్ 3న బంద్ ప్రకటించారు. ఐదు రాష్ట్రాల్లో నవంబర్ 3న బంద్‌కు పిలుపునిస్తూ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఓ లేఖ విడుదల చేసింది.

Maoists calls 5states for bandh

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బంద్ పాటించాలని మావోయిస్టు పార్టీ నిర్ణయించింది. 40ఏళ్ల తమ పార్టీ చరిత్రలో సోమవారం నాటి ఎన్‌కౌంటర్ వల్ల భారీ నష్టం వాటిల్లిందని మావోయిస్టు నేత ప్రతాప్ పేర్కొన్నారు.

ఏఓబీ ఎన్‌కౌంటర్ పూర్తిగా కోవర్ట్ ఆపరేషన్ అని ఆయన ఆరోపించారు. ఏఓబీలో అక్టోబర్ 24న జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 30మంది మావోయిస్టులు మృతి చెందారు. వారి వద్ద నుంచి భారీ మొత్తంలో ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

English summary
Maoists calls 5states for bandh on November 3rd.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X