వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంచలనం:కూంబింగ్ లో పోలీసులకు పట్టుబడ్డ మావోయిస్టు దళాలు

|
Google Oneindia TeluguNews

అమరావతి:అరకు ఎమ్మెల్యే,మాజీ ఎమ్మెల్యేల హత్యల తరువాత ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న పోలీసులు తొలిసారిగా మావోయిస్టులపై పైచేయి సాధించారు. ఒడిశా కోరాపుట్‌లోని అటవీప్రాంతంలో పోలీస్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టు దళాలు పోలీసులకు పట్టుబడినట్లు సమాచారం.

పట్టుబడిన దళాల్లో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యలో పాల్గొన్న మావోయిస్టులు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారని తెలిసింది. అయితే కూంబింగ్ సమయంలో మరికొంతమంది మావోలు పోలీసులకు దొరక్కుండా పారిపోయారని...వారికోసం కూడా పోలీసులు జల్లెడ పడుతున్నట్లు సమాచారం. ఈ జాయింట్ ఆపరేషన్ లో గ్రేహౌండ్స్‌, యాంటీ నక్సల్స్ స్క్వార్డ్, ఒడిశా బలగాలు పాల్గొన్నారు.

మావోయిస్టుల కోసం ప్రస్తుతం ఒడిషా బలగాలతో కలసి ఎపి పోలీసులు గాలింపు జరుపుతున్నారు. పట్టుబడిన మావోయిస్టుల్లో యాక్షన్‌ టీం కూడా ఉందని పోలీసులు హెడ్‌క్వార్టర్స్‌కు సమాచారం అందించినట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు ఆపరేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించి బలగాలకు ఎప్పటికప్పుడు సూచనలు అందచేస్తున్నారని సమాచారం.

Maoists caught by Police in AOB

పారిపోయిన మావోయిస్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దని...వెంటాడాలని...ఎంత కష్టమైనా భరించాలని ఉన్నతాధికారులు ఆదేశించారట. మరోవైపు మావోయిస్టులు పట్టుబడ్డారన్న సమాచారంతో అప్రమప్తమైన పారిపోయిన మిగతా మావోయిస్టుల అన్వేషణ కోసం అవసరమైతే హెలికాప్టర్లు పంపేందుకు సంసిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఈ జాయింట్ ఆపరేషన్ లో గ్రేహౌండ్స్‌, యాంటీ నక్సల్స్ స్క్వార్డ్, ఒడిశా బలగాలు పాల్గొన్నారు.

అమరావతి:అరకు ఎమ్మెల్యే,మాజీ ఎమ్మెల్యేల హత్యల తరువాత ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న పోలీసులు తొలిసారిగా మావోయిస్టులపై పైచేయి సాధించారు. ఒడిశా కోరాపుట్‌లోని అటవీప్రాంతంలో పోలీస్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టు దళాలు పోలీసులకు పట్టుబడినట్లు సమాచారం. పట్టుబడిన దళాల్లో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యలో పాల్గొన్న మావోయిస్టులు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారని తెలిసింది. అయితే కూంబింగ్ సమయంలో మరికొంతమంది మావోలు పోలీసులకు దొరక్కుండా పారిపోయారని...వారికోసం కూడా పోలీసులు జల్లెడ పడుతున్నట్లు సమాచారం. ఈ జాయింట్ ఆపరేషన్ లో గ్రేహౌండ్స్‌, యాంటీ నక్సల్స్ స్క్వార్డ్, ఒడిశా బలగాలు పాల్గొన్నారు.

English summary
Have Maoists been nabbed by the Police after the Lipitiputtu Attack?...The AP polices soruces claims so.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X