వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో మావోల అలజడి ...ఆంధ్రా- ఒడిశా సరిహద్దులో మందుపాతర పేల్చిన మావోయిస్టులు

|
Google Oneindia TeluguNews

మావోయిస్టులు చాపకింద నీరులా విస్తరిస్తున్నారన్న సమాచారంతో పాటు, పెద్ద ఎత్తున మిలిటరీ దాడులు చేస్తారన్న సమాచారంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టుల ఏరివేతకు రంగంలోకి దిగాయి. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీ కంచుకోట అయిన దండకారణ్యంపై దండయాత్రకు సిద్ధమైంది. కేంద్ర సాయుధ బలగాలతో దాడులకు సిద్ధం అయిన నేపధ్యంలో మావోయిస్టులు ప్రతిదాడులకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఎక్కడికక్కడ మావోలను ఎన్కౌంటర్ లు చేస్తున్నారు .ఐదు రాష్ట్రాల్లోకి విస్తరించి ఉన్న దండకారణ్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దాడులకు ప్రతిగా మావోలు ఎదురు దాడులకు దిగుతున్నారు .

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మావోయిస్ట్ యాక్షన్ టీమ్స్... విస్తృతంగా పోలీసుల తనిఖీలుఉమ్మడి వరంగల్ జిల్లాలో మావోయిస్ట్ యాక్షన్ టీమ్స్... విస్తృతంగా పోలీసుల తనిఖీలు

ఎపీలోనూ మావోయిస్ట్ ల అలజడి కనిపిస్తుంది. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల్లో ఆపరేషన్ ప్రహార్ పేరుతో నవంబర్ నుండి నక్సల్ ఏరివేత మొదలుపెట్టింది . చత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ,ఒడిశా రాష్ట్రాలలో ఇప్పటివరకు మావోయిస్టుల ప్రభావం ఉంది. దీంతో ఈ ఐదు రాష్ట్రాల పై దృష్టి సారిస్తున్న నేపధ్యంలో మావోయిస్టులు దాడులకు దిగుతున్నారు. తాజాగా ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు దాడులకు తెగబడ్డారు.

 Maoists detonate landmines on Andhra-Odisha border

పోలీసుల లక్ష్యంగా మందుపాతర పేల్చారు. పెద్దబయలు సమీపంలోని ఇంజరీ అటవీ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటన లో భద్రతా బలగాలు త్రుటిలో ప్రమాదం నుండి తప్పించుకున్నాయి . రెండు నెలల వ్యవధి కాలంలో మావోయిస్టులు వరుసగా మందుపాతరల పెల్చివేతలకు పాల్పడుతూనే ఉన్నారు. మరోవైపు అటు ఏవోబీ లోనూ పోలీసులు కూంబింగ్ కొనసాగుతోంది . తాజా పరిణామాల నేపథ్యంలో విశాఖ ఏజెన్సీలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

English summary
The Maoists are planned for attacks . Maoists detonate landmines on Andhra-Odisha border targeting the police . The incident took place in the nearby injari forest area and the security forces managed to escape from the attack.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X