వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మావోలకు భారీ దెబ్బ: పది రోజుల ప్లాన్, మృతులు వీరే...

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అనూహ్యమైన రీతిలో మల్కాన్‌గిరి అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు తిరుగులేని ఎదురు దెబ్బ తగిలింది. ఎవోబీ ఎన్‌కౌంటర్‌లో 24 మంది మావోయిస్టులు మరణించారు. వారిలో 17 మంది పురుషులు కాగా, ఏడుగురు మహిళలు ఉన్నారు. పది రోజుల పాటు వేసిన పక్కా ప్రణాళికతోనే బలగాలు మావోయిస్టులను మట్టుబెట్టినట్లు తెలుస్తోంది.

పక్కా సమాచారం అందుకున్న పోలీసు పెద్దలు ప్రణాళిక రచించి మావోస్టుల ప్లీనరీపై దాడి చేసినట్లు చెబుతున్నారు. ఈ మేరకు సోమవారం మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ మీడియా కథనాల ప్రకారం - వారం రోజుల క్రితం విశాఖపట్నం విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్ డిజిపి సాంబశివరావుకు, సిఆర్‌పిఎఫ్ డిజి దుర్గా ప్రసాద్ మధ్య రహస్య భేటీ జరిగినట్లు తెలుస్తోంది.

Maoists encounter

వారు వేసిన పథకాన్ని ముగ్గురు కీలకమైన అధికారులు అమలు చేసినట్లు ఆ మీడియా కథనాల సారాంశం. మావోయిస్టుల ప్లీనరీకి సంబంధించిన పక్కా సమాచారం అందిన తర్వాత బలగాలు గాలింపు చర్యలను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది.

ఏడాదిన్నరగా పోలీసులు పక్కా ఇన్‌ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని సమాచారాన్ని రాబట్టినట్లు చెబుతున్నారు. మావోయిస్టులు సమావేశమయ్యే ప్రాంతానికి బలగాలు నిశబ్దంగా ప్రవేశించినట్లు చెబుతున్నారు. మధ్య రాత్రి మెరుపుదాడి చేసినట్లు సమాచారం. ఈ మెరుపుదాడితో దిగ్భ్రాంతికి గురైన మావోయిస్టులు నామమాత్రం ప్రతిఘటన మాత్రమే ఇచ్చారని చెబుతున్నారు.

బలగాలు చేరుకుంటున్న సమాచారం మావోయిస్టులకు అందకుండా కమ్యూనికేషన్ వ్యవస్థను స్తంభింపజేసినట్లు చెబుతున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు కీలకమైన నేతలను కోల్పోయారు. మృతుల్లో ఆర్కె కుమారుడు మున్నా ఉన్నాడా, లేదా అనేది నిర్ధారించాల్సి ఉందని ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ చెప్పారు. ఇంకా గాలింపు చర్యలు సాగుతున్నాయని అన్నారు. ఎన్‌కౌంటర్‌లో 50 మంది మావోయిస్టులు పాల్గొన్నట్లు తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పార్టీల వివరాలు వెల్లడించలేమని అన్నారు.

మృతులు వీరే...

1. ఐనపర్తి దాసు అలియాస్‌ టెక్‌ మధు పశ్చిమ గోదావరి జిల్లా
2. గెమ్మలి కేశవరావు అలియాస్‌ బిర్సు, డీసీఎస్‌, మొదటి సీఆర్‌సీ, తాళ్లపాలెం, విశాఖ జిల్లా.
3. లత అలియాస్‌ పద్మ (మహేందర్‌ భార్య), డీసీఎం, ఎస్‌జెడ్‌సీఎం, హైదరాబాద్‌.
4. రాజేశ్ అలియాస్‌ బిమల్‌, డీసీఎం, మొదటి సీఆర్‌సీ, తూర్పు గోదావరి జిల్లా.
5. బొడ్డు కుందనాలు అలియాస్‌ మమత (సురేశ భార్య), డీసీఎం, ఎస్‌జెడ్‌సీఎం, శ్రీకాకుళం జిల్లా.
6. యామలపల్లి సింహాచలం అలియాస్‌ మురళి/హరి, డీసీఎం, విజయనగరం.
7. స్వరూప అలియాస్‌ రిక్కి, డీసీఎం, మాజీ ఆర్టీసీ కండక్టర్‌. తూర్పు గోదావరి జిల్లా.
8. బాకూరు వెంకట్‌ అలియాస్‌ ప్రసాద్‌, ఎస్‌జెడ్‌సీఎం, ఈస్ట్‌ విశాఖ, బాకూరు, విశాఖ జిల్లా.
9. చామెళ్ల కృష్ణ అలియాస్‌ దయ, ఎస్‌జెడ్‌సీఎం, శ్రీకాకుళం డివిజన, సెక్రటరీ.
10. శ్వేత, ఏసీఎం, పెదబయలు ఏరియా, విశాఖ జిల్లా
11. బుద్రి, ఏసీఎం, ఆర్‌కే రక్షణ దళం.
12. మున్నా, అగ్రనేత ఆర్కె కుమారుడు
13. గాజర్ల రవి అలియాస్ ఉదయ్
14. బెంగాల్ సురేశ్
15. చలపతి
16. అరుణ

English summary
24 moaists have been encountered with pecca plan. Moaist party loses key leaders like gajarla Ravi, Daya, Chalapathi and others.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X