విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కలకలం:హిట్ లిస్ట్ లేదు..అవి పోలీసుల సృష్టే ,వారిపై కోపంతోనే గిరిజనుల దాడి;మావోయిస్టుల నుంచి మరో లేఖ

|
Google Oneindia TeluguNews

విశాఖపట్టణం:అరకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్యలపై మావోయిస్టుల నుంచి వరుసగా విడుదల అవుతున్న లేఖలు కలకలం రేపుతున్నాయి. ఈ విషయమై మావోల పేరుతో ఇప్పటికే మూడు లేఖలు విడుదల కాగా తాజాగా మరో లేఖ విడుదల చేశారు.

మావోయిస్టు నేత జగబంధు పేరిట విడుదలైన ఈ లేఖలో అరకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల కాల్చివేతతో పాటు పోలీసులపై గిరిజనుల దాడి, హిట్ లిస్ట్ తదిదర అంశాల గురించి కూడా స్పష్టత ఇచ్చారు. తమ అరకు దాడి అనంతరం పోలీసు స్టేషన్లపై గిరిజనుల దాడికి కారణం స్థానిక పోలీసులపై గిరిజనుల వ్యతిరేకతేనని పేర్కొన్నారు. మావోయిస్టుల హిట్ లిస్ట్ అనేది అబద్దమని తేల్చేశారు.

మావోయిస్టులు...మరో లేఖ

మావోయిస్టులు...మరో లేఖ

సెప్టెంబరు 23న అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలపై లివిటిపుట్టు దాడి, కాల్చివేతల నేపథ్యంలో ఆ దాడి, తదనంతర పరిణామాలను వివరిస్తూ మావోయిస్టు పార్టీ ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రత్యేక జోనల్‌ కమిటీ అధికార ప్రతినిధి జగబంధు తాజాగా మరో లేఖను విడుదల చేశారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను మావోయిస్టులు హతమార్చిన అనంతరం పోలీస్‌స్టేషన్లపై గిరిజనులు పెద్దఎత్తున దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే.

ఆ ప్రచారం...అబద్దం

ఆ ప్రచారం...అబద్దం

అయితే ఆదివాసీలు పోలీసులపై చేసిన ఆ దాడిని మావోయిస్టులపై వ్యతిరేకతతో చేసినట్లు పాలకపక్షాలు, పోలీసులు ప్రచారం చేశారని...కానీ నిజానికి డుంబ్రిగుడ ఎస్‌ఐపై స్థానిక ప్రజలకున్న ఆగ్రహాన్నే వారు ప్రదర్శించారని జగబంధు పేర్కొన్నారు. డుంబ్రిగుడ ఎస్‌ఐ అమ్మన్నరావు గంజాయి మాఫీయాగా తయారై అరకులోయ సర్కిల్‌ పరిధిలోని ఆదివాసులను అన్ని విధాలా హింసిస్తున్నారని ఆరోపించారు. దీంతో మావోల దాడి అదనుగా ఎస్‌ఐపై తమకున్న ఆగ్రహంతో ఆదివాసులు పోలీస్‌స్టేషన్లపై దాడి చేశారన్నారు. ఈ ఘటనతో పోలీసు అధికారులు ఎస్‌ఐని సస్పెండ్ చేసినా సైలెంట్ గానే ఉన్నారన్నారు.

ఆ ఎస్ దారుణాలు...వారికీ తెలుసు

ఆ ఎస్ దారుణాలు...వారికీ తెలుసు

నిజానికి ఎస్‌ఐ అమ్మన్నరావు చేస్తున్న దారుణాలు ఇన్నాళ్లు ఉన్నతాధికారులకు తెలియకుండా లేవని, ఆయన గురించి అరకులోయ సర్కిల్‌ పరిధిలో చిన్నపిల్లాడు నుంచి ముసలివ్యక్తి వరకు ఎవరిని అడిగినా చెబుతారని జగబంధు పేర్కొన్నారు. ఇప్పటికైనా ఎస్‌ఐ అమ్మన్నరావు తన తీరు మార్చుకోవాలని లేకుంటే ప్రజల ఆగ్రహానికి గురవక తప్పదని హెచ్చరించారు. అలాగే స్థానిక గిరిజన నేతలైన గణేష్, రవి బతికి ఉంటే, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్యలు జరిగేవికాదనే వాదన కూడా అబద్దమన్నారు.

హిట్ లిస్ట్ లేదు...పోలీసుల సృష్టి

హిట్ లిస్ట్ లేదు...పోలీసుల సృష్టి

ఇక మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతున్నట్లుగా తమకు ఎటువంటి హిట్‌లిస్ట్‌ ఉండదని, అలాంటి వాటిని పోలీసులే తయారు చేసి ప్రజల్ని హింసిస్తారని జగబంధు ఈ లేఖలో స్పష్టం చేశారు. మావోయిస్టు పార్టీ ఎప్పుడు ఆదివాసుల పక్షానే ఉంటుందని ఆయన పేరిట మీడియాకు విడుదలైన లేఖలో స్పష్టం చేశారు.
మావోయిస్టు పార్టీకి కుల, మత, వ్యక్తిగత, ప్రాంతీయ ప్రాధాన్యతలుండవని, ప్రజలను పీడిస్తున్న ఎవరినైనా పార్టీ శిక్షిస్తుందన్నారు. అలాగే మావోయిస్టు పార్టీలో ఆదివాసీలు, ఆదివాసీయేతరుల మధ్య ఎటువంటి వైరుధ్యాలు లేవని, ఏసీఎం స్థాయి నుంచి కేంద్ర కమిటీ వరకు ఆదివాసీ నాయకత్వం ఉందని ఆయన స్పష్టం చేశారు.

అతడి వ్యవహారం...అలా

అతడి వ్యవహారం...అలా

ఇక అరకులోయ ఎంపీపీ అరుణ భర్త శెట్టి అప్పాలు వ్యవహారం గుమ్మడికాయల దొంగ అంటే, భుజాలు తడుముకున్నట్టుగా ఉందన్నారు. ప్రజా వ్యతిరేకులుగా ప్రవర్తించేవారిని మాత్రమే తాము శిక్షిస్తామని స్పష్టం చేశారు. ఉనికి కోసమే మావోయిస్టులు హత్యలు చేస్తున్నారనే పోలీసుల ప్రచారం కూడా అవాస్తవమని తేల్చేశారు. అలాగే చర్చల కోసం పిలిచి ఎమ్మెల్యే కిడారి, సోమలను హతమార్చరనేది కూడ అబద్దమేనన్నారు. చర్చల కోసం పిలిస్తే హతమార్చడం ఉండదని, ఇలాంటి విషయాల్లో పార్టీ పక్కాగా నిబంధనలు పాటిస్తుందని, లేకుంటే పార్టీపై ప్రజల్లో ఉన్న విశ్వాసం దెబ్బతింటుందని వివరించారు. ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ ప్రజలను పీడిస్తున్నారనే రెండు నెలలుగా పథకం వేసి హతమార్చడం జరిగిందన్నారు.

మద్దతు ఇవ్వండి...జగబంధు పిలుపు

మద్దతు ఇవ్వండి...జగబంధు పిలుపు

ఇక ఇటువంటి సంఘటనలు జరగగానే...మేము సవాల్‌గా తీసుకుంటున్నాం...ప్రతీకారం తీర్చుకుంటాం...దోషులను వదలం అంటూ పోలీస్‌బాస్‌లు తమ నిగ్రహం కోల్పోయి ప్రకటనలు చేయడం సహజమేనంటూ ఎద్దేవా చేశారు. అలాగే డుంబ్రిగుడ మండల కేంద్రంలో పోలీస్‌స్టేషన్‌ ఉంటే ఈ దాడి జరిగేది కాదనే వాదన కూడా సరికాదన్నారు. తమ టార్గెట్‌లో అంటూ ఉంటే ఎన్ని బలగాలు, రక్షణ కవచాలు ఉన్నా తమ గెరిల్లా సైన్యం విజయం సాధించడం ఖాయమన్నారు. అనేక సందర్భాల్లో అది నిరూపించామని చెప్పుకొచ్చారు. ప్రజలను పీడించేవారిని మావోయిస్టు పార్టీ శిక్షిస్తుందని, ఆదివాసుల పక్షాన, సహజ సంపదల దోపిడీకి వ్యతిరేకంగా ప్రజా పోరాటానికి అందరూ మద్దతుగా నిలవాలని జగబంధు ఈ లేఖలో పిలుపునిచ్చారు.

English summary
Visakhapatanm:Araku MLA Kidari Sarveswara Rao and Former MLA Siveri Soma were gunned down by Maoists in the Visakha agency on September 23rd this year. Maoists released another letter in the name of Jagabandhu to the media explaining the reasons behind the these MLA, Ex mla assassinations, Tribals attack and Hit list.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X