అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు మోసం చేసారు: టీడీపీ నేతలు 9వేల ఎకరాలు కొన్నారు: రాజధాని రైతుల ఆగ్రహం..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Amaravati Farmers Slams Chandrababu Naidu || Oneindia Telugu

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పైన రాజధాని ప్రాంతంలోని కొందరు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 28న చంద్రబాబు రాజధాని ప్రాంతంలో పర్యటించాలని నిర్ణయించారు. దీంతో..కొందరు రైతులకు ఆయనకు వ్యతిరేకంగా మీడియా ముందుకొచ్చారు. తాము రాజధాని కోసం భూములను త్యాగం చేస్తే..టీడీపీ నేతలు మోసం చేసారంటూ మండిపడ్డారు. రాజధాని అంటూ గ్రాఫిక్స్ పేరుతో తమను మోసం చేసారని మండిపడ్డారు. తమకు ఇస్తామని చెప్పిన స్థలాలు ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదని నిలదీసారు. టీడీపీ నేతలు తొమ్మిది వేల ఎకరాలు కొన్నారని ఆరోపించారు. చంద్రబాబు రాజధాని ప్రాంతంలో పర్యటించాలంటే ముందుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు.

 వైసీపీ నేతలు కోరితే బాబు అపాయింట్మెంట్.. చంద్రబాబు కడప పర్యటన తో పొలిటికల్ హీట్ వైసీపీ నేతలు కోరితే బాబు అపాయింట్మెంట్.. చంద్రబాబు కడప పర్యటన తో పొలిటికల్ హీట్

రాజధానిలో చంద్రబాబుకు వ్యతిరేకంగా..

రాజధానిలో చంద్రబాబుకు వ్యతిరేకంగా..

ఏపీ రాజధాని అమరావతి రైతుల్లో చంద్రబాబు వ్యతిరేక వర్గం తెర మీదకు వచ్చింది. తన పిలుపుతో దాదాపు 33 వేల ఎకరాల భూమిని రైతులు స్వచ్చందన భూ సమీకరణ ద్వారా ప్రభుత్వానికి ఇచ్చారంటూ చంద్రబాబు పదే పదే చెప్పేవారు. ఇదే సమయంలో ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగాలే అమరావతి పనులను నిలిపివేసారు. తాజాగా రాజధానితో పాటుగా అధికార వికేంద్రీకరణ అధ్యయనం కోసం ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీని కలిసిన రాజధాని రైతులు తాము రాజధాని కోసం భూములు ఇచ్చామని..అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని అభ్యర్దించారు. ఇక, ఇప్పుడు అమరావతిలో తొలి సారిగా చంద్రబాబు వ్యతిరేక రైతులు మీడియా ముందుకొచ్చారు. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని కోరుతూనే..తమను చంద్రబాబు మోసం చేసారంటే ఆరోపణలు చేస్తున్నారు.

రైతులను మోసం చేసారు..

రైతులను మోసం చేసారు..

రాజధాని కోసం రైతులు భూములిస్తే..టీడీపీ నేతలెవరూ భూములు ఇవ్వలేదని చంద్రబాబు వ్యతిరేక రైతు వర్గం ఆరోపిస్తోంది. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు 9 వేల ఎకరాలు కొన్నారని రైతులు ఆరోపించారు. తమకు ఇచ్చిన ప్లాట్ల మధ్యలో 25 లక్షల గజాలు ఎందుకు హోల్డ్‌లో పెట్టారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేసారు.. మూడేళ్లలో ప్లాట్లను అభివృద్ధి చేస్తామన్నారు.. ఎందుకు చేయలేదంటూ నిలదీసారు. అసైన్డ్ భూములకు ఎందుకు తక్కువ ప్యాకేజీ ఇచ్చారని ప్రశ్నిస్తూనే... రాజధాని ఇక్కడే ఉండాలనేది తమ కోరిక అంటూ స్పష్టం చేసారు. అయితే, వీరు వైసీపీకి మద్దతుగా నిలిచే రైతులుగా టీడీపీ అనుమానం వ్యక్తం చేస్తోంది. తాము ఇచ్చిన హామీల మేరకు రైతులకు న్యాయం చేసేందుకు ప్రయత్నించామని..రైతులకు నష్టం చేయలేదని టీడీపీ నేతలు వాదిస్తున్నారు.

గ్రాఫిక్స్ లో మాయ చేసారు.

గ్రాఫిక్స్ లో మాయ చేసారు.

రైతులకు రాజధాని ఇలా ఉంటుందంటూ గ్రాఫిక్స్ చూపించి టీడీపీ నేతలు మాయ చేసారని రైతులు మండిపడ్డారు. చంద్రబాబు ఈ నెల 28న రాజధాని ప్రాంతంలో పర్యటించాలంటే ముందుగా ఆ ప్రాంతంలోని
దళితులకు క్షమాపణ చెప్పాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు..లోకేశ్.. మాజీ మంత్రి నారాయణ నాడు రాజధాని పేరుతో కమిషన్లకు కక్కుర్తి పడ్డారని రైతులు ఆరోపించారు. ఇదే సమయంలో దళిత రైతులు కొందరు తమను మాట్లాడనీయకపోవటం పైన మీడియా సమావేశం కొనసాగుతుండగానే ఇతర రైతులను నిలదీసారు. దీని ద్వారా ఇప్పుడు రాజధాని లో రైతుల పేరుతో కొత్త రాజకీయం మొదలైనట్లుగా కనిపిస్తోంది. అయితే, ఇప్పడు రైతులు చేస్తున్న ఆరోపణలు..డిమాండ్ల పైన టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

English summary
amaravati farmers serious allegations against CBN. They saying that TDP leaders cheated them and purchased nearly 9000 acres land in capital region.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X