వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు సర్కార్‌ను రద్దు చేసి.. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించండి: కట్జూ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనైతిక చర్యలను ఖండిస్తూ.. రాజ్యాంగంలోని ఆర్టికల్-356 కింద రాష్ట్రంలో రాష్ట్రపతి విధించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సర్కార్ ను తక్షణం రద్దు చేసి, ముందస్తు ఎన్నికలు జరిపేలా ఆదేశా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సోషల్ మీడియాపై ఏపీ ప్రభుత్వ నియంతృత్వ ధోరణిని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మార్కండేయ కట్జూ తీవ్రంగా ఖండించారు. పొలిటికల్ పంచ్ కార్టూనిస్ట్ రవికిరణ్ ఇంటూరిని పోలీసులు అరెస్టు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. సోషల్ మీడియాలో కార్టూన్ల ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తపరచడం ఆర్టికల్ నం.19(1) ప్రకారం భావప్రకటనా స్వేచ్చ కిందకు వస్తుందని గుర్తుచేశారు.

ప్రభుత్వం నా భర్తపై కక్ష సాధిస్తోంది: పొలిటికల్ పంచ్ అడ్మిన్ రవికిరణ్ భార్య.. ప్రభుత్వం నా భర్తపై కక్ష సాధిస్తోంది: పొలిటికల్ పంచ్ అడ్మిన్ రవికిరణ్ భార్య..

బాబు సర్కార్‌ను రద్దు చేయాలి:

ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజలే ప్రభువులని, ప్రభుత్వాలను విమర్శించే హక్కు వారికి ఉంటుందని కట్జూ తేల్చి చెప్పారు. ఈ మేరకు రాష్ట్రపతి, ప్రధానిలకు ఆయన లేఖలు రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనైతిక చర్యలను ఖండిస్తూ.. రాజ్యాంగంలోని ఆర్టికల్-356 కింద రాష్ట్రంలో రాష్ట్రపతి విధించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సర్కార్ ను తక్షణం రద్దు చేసి, ముందస్తు ఎన్నికలు జరిపేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు.

కక్షపూరితంగా వ్యవహరిస్తోన్న ప్రభుత్వం:

కక్షపూరితంగా వ్యవహరిస్తోన్న ప్రభుత్వం:

ప్రభుత్వం కావాలనే తన భర్తపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని రవికిరణ్ భార్య ఇటీవల ఆరోపించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విశాఖ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న రవికిరణ్ ను ఇటీవల ఆమె కలిసిన సందర్భంగా ఈ ఆరోపణలు చేశారు. కాగా, టీడీపీ ఎమ్మెల్యే అనిత ఫిర్యాదు మేరకు ఏపీ పోలీసులు రవికిరణ్ పై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడంతో.. రిమాండ్ నిమిత్తం ఆయన్ను జైలుకు తరలించారు.

తొలి అరెస్టు.. అర్థరాత్రి:

తొలి అరెస్టు.. అర్థరాత్రి:

ఏప్రిల్21 అర్థరాత్రి రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని స్వగృహంలో పోలీసులు అర్ధరాత్రి దాటిన తర్వాత రవికిరణ్ ను పోలీసులు తొలిసారి అరెస్టు చేశారు. అక్కడి నుంచి ఏపీకి తీసుకెళ్లి, మూడు గంటల పాటు సీఎం క్యాంప్ ఆఫీసు చుట్టూ తిప్పి, అనంతరం ఓ ప్రైవేటు గెస్ట్ హౌజ్ కు తీసుకెళ్లి విచారించారు. అదే రోజు రవికిరణ్ ను విడుదల చేసిన పోలీసులు.. మరోసారి విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించారు.

వైసీపీ కార్యాలయంపై దాడులు:

వైసీపీ కార్యాలయంపై దాడులు:

రవికిరణ్ కు వైసీపీతో లింకు ఉందన్న అనుమానంతో ఆ పార్టీ కార్యాలయంలోను పోలీసులు తనిఖీలు నిర్వహించారు. దీంతో ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు. పోలీసులు మాత్రం సాక్షి నుంచే వీరికి వేతనాలు అందుతున్నట్లు అనుమానిస్తూ వస్తున్నారు. అదే క్రమంలో మే9న విచారణకు హాజరైన రవికిరణ్ ను పోలీసులు మరోసారి అరెస్టు చేశారు.

English summary
Supreme court former judge Markandey Katju Ap govt act of arresting political punch admin Ravikiran. He demands to dissolve CBN govt and impose president rule in the state
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X