• search
  • Live TV
అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

విద్యార్థినికి లెక్చరర్ ప్రేమ పాఠాలు.. రెండో పెళ్లి.. మొదటి భార్య సీన్లోకి వచ్చి..!

|

అనంతపురం : విద్యాబుద్దులు నేర్పాల్సిన గురువులు అడ్డదారులు తొక్కుతున్నారు. విద్యార్థులను సక్రమ మార్గంలో నడిపించాల్సింది పోయి వారే దారి తప్పుతున్నారు. ప్రేమ పేరుతో ముగ్గులోకి దించుతూ కొందరు.. అసభ్యంగా ప్రవర్తిస్తూ మరికొందరు విద్యా వ్యవస్థకు మచ్చ తెస్తున్నారు. రోజుకో చోట ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తూ సభ్యసమాజం తలదించుకునేలా చేస్తున్నాయి. అదే కోవలో అనంతపురం జిల్లాలో బయటపడ్డ గురువు బాగోతం చర్చానీయాంశమైంది. ప్రేమ పేరుతో విద్యార్థినిని పెళ్లి చేసుకున్న లెక్చరర్ లీలలు వెలుగుచూడటం హాట్ టాపికైంది.

 దారి తప్పిన గురువు.. విద్యార్థినికి ప్రేమ పాఠాలు..!

దారి తప్పిన గురువు.. విద్యార్థినికి ప్రేమ పాఠాలు..!

అనంతపురం జిల్లా కదిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్‌గా పనిచేస్తున్న ప్రవీణ్ కుమార్ దారి తప్పాడు. విద్యాబుద్దులు నేర్పాల్సిన గురువు స్థానంలో ఉండి నీచబుద్ది బయట పెట్టాడు. విద్యా వ్యవస్థకు కళంకం తెచ్చేలా.. ఉపాధ్యాయ వృత్తికి చెడ్డపేరు వచ్చేలా ప్రవర్తించిన తీరు వివాదస్పదమైంది. గురువుగా సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాల్సింది పోయి విద్యార్థినితో ప్రేమాయణం నడిపి అప్రతిష్ట పాలయ్యాడు.

ఇంగ్లీష్ సబ్జెక్టు బోధించాల్సిన సదరు లెక్చరర్ ప్రవీణ్ కుమార్ ఓ విద్యార్థినిని ప్రేమ పేరుతో ముగ్గులోకి దించాడు. గురువు స్థానంలో ఉండి ఒక తండ్రిగా మెలగాల్సింది పోయి ఆ విద్యార్థినిని వంకర చూపుతో చూశాడు. చివరకు ఆ లవ్ ఎపిసోడ్ కాస్తా పెళ్లికి దారి తీసింది.

ర్యాగింగ్ రాక్షసత్వం.. 150 మంది వైద్య విద్యార్థులకు గుండు కొట్టించి..! (వీడియో)

 గురువు వక్రబుద్ధి.. మొదటి పెళ్లి దాచిపెట్టి..!

గురువు వక్రబుద్ధి.. మొదటి పెళ్లి దాచిపెట్టి..!

ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. అంతవరకు సరే పోనీలే అనుకున్నా.. ఇక్కడ మరో తిరకాసు ఉంది. అంతేకాదు ప్రవీణ్ కుమార్ వక్రబుద్ధి, కన్నింగ్ నేచర్ అన్నీ బయటపడ్డాయి. విద్యార్థినిని ప్రేమ పేరుతో ముగ్గులోకి దించడమే గాకుండా పెళ్లి చేసుకోవడం మరో వివాదానికి కారణమైంది. సదరు విద్యార్థినిని రెండో పెళ్లి చేసుకోవడమే ఆయన చేసిన పెద్ద తప్పు. అది కాస్తా బయటపడటంతో గురువు గారి బాగోతం వెలుగుచూసింది.

అప్పటికే పెళ్లైన ప్రవీణ్ కుమార్ అసలు విషయం దాచిపెట్టి విద్యార్థినిని పెళ్లాడటం స్థానికంగా దుమారం రేపింది. వివాహితుడైనప్పటికీ.. అదేమీ చెప్పకుండా సదరు విద్యార్థినితో ప్రేమాయణం నడిపించడమేంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

 మొదటి పెళ్లి కూడా ప్రేమ వ్యవహారమే..!

మొదటి పెళ్లి కూడా ప్రేమ వ్యవహారమే..!

లెక్చరర్ ప్రవీణ్ కుమార్ తప్పటడుగుపై స్థానికులు మండిపడుతున్నారు. అదలావుంటే విద్యార్థినిని ప్రేమించి పెళ్లి చేసుకోకముందే తనను వివాహం చేసుకున్నారంటూ త్రివేణి అనే యువతి తెరపైకి రావడం కలకలం రేపింది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆమెను కూడా ప్రేమించి పెళ్లి చేసుకోవడం గమనార్హం. ఇలా ప్రేమ పేరుతో వంచిస్తూ యువతుల జీవితాలతో ఆడుకుంటున్న ప్రవీణ్ కుమార్‌పై మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Teachers behaviour cause to controvorsy. Some of the trio in the name of love .. Some behave indecently and others are scarring the education system. One lecturer loved his student and married even he already got married, incident took place in anantapur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more