విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హత్యకు దారి తీసిన అక్రమ సంబంధం: ఆమెతో మద్యం తాగించి, మెడ కోసి...

By Pratap
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలోని డౌనూరు జీడి మామిడి తోటల్లో గుర్తు తెలియని వివాహిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఓ అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారంతో పాటు ఫోన్ కాల్‌ ఆధారంతో కేసు మిస్టరీ వీడింది.

పీక కోసి మహిళ హత్య, ముఖం కాల్చివేత: రేప్ చేసి హత్య?పీక కోసి మహిళ హత్య, ముఖం కాల్చివేత: రేప్ చేసి హత్య?

హంతకులను పోలీసులు పట్టుకున్నారు. వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తే ఆమెను హతమార్చినట్లు తేలింది. కొయ్యూరు సిఐ ఉదయ్ కుమార్, ఎస్ఐ రుక్మాంగద రావు ఆ వివరాలను గురువారం మీడియాకు వెల్లడించారు.

 వారిద్దరికి ఇలా పరిచయం

వారిద్దరికి ఇలా పరిచయం

కొయ్యూరు మండలం కోటవురట్లకు చెందిన జనవేది రాంబాబు హైదరాబాదులో తాపీమేస్త్రిగా పనిచేస్తున్నాడు. హైదరాబాదు పటాన్‌చెరు సమీపంలో టీ దుకాణం నిర్వహిస్తున్న మైసపు శివమ్మతో అతనికి పరిచయం ఏర్పడింది. అక్కడే రోజూ టీ తాగి, భోజనం చేసేవాడు. అది క్రమంగా వివాహేతర సంబంధానికి దారి తీసింది.

అతనికి భార్యాపిల్లలు..

అతనికి భార్యాపిల్లలు..

వివాహమైనప్పటికీ శివమ్మకు భర్త లేడు. రాంబాబుకు భార్య,, కుమారుడు ఉన్నారు. తనతో పాటు ఉండిపోవాలని శివమ్మ అతనిపై ఒత్తిడి పెడుతూ వచ్చింది. కొడుకును ఇక్కడికే తీసుకుని వచ్చి తనతో ఉండిపోవాలని ఆమె పట్టుబడుతూ వచ్చంది. భార్య వద్దకు వెళ్లవద్దని చెబుతూ వచ్చది.

 ఇలా అక్కడికి వెళ్లారు...

ఇలా అక్కడికి వెళ్లారు...

సంక్రాంతి సందర్భంగా రాంబాబు, శివమ్మ కలిసి కోటరవుట్లకు వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా భార్యను వదిలేసి కొడుకుతో తనతో ఉండిపోవాలని శివమ్మ అతనిపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చింది. శివమ్మ దగ్గర అతను అంతకు ముందు రెండు లక్షల రూపాయల వరకు తీసుకున్నాడు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని లేదా కొడుకుని తీసుకుని తనతో రావాలని గొడవ చేసింది. ఈ విషయం గ్రామంలో కూడా తెలిసింది.

భార్యకు తెలిస్తే ప్రమాదమని..

భార్యకు తెలిస్తే ప్రమాదమని..

శివమ్మతో ఉంటే భార్యతో ప్రమాదం వస్తుందని రాంబాబు భావించి, మిత్రుడు కర్రి నరేశ్‌తో కలిసి హత్యకు పథకం వేశాడు. జనవరి 22వ తేదీన శివమ్మను పర్యాటక ప్రాంతమైన చింతపల్లి మండలం తాజంగికి తీసుకుని వచ్చాడు. అక్కడ ముగ్గురు సాయంత్రం వరకు ఉన్నారు. అయితే ప్రజలు ఉండడంతో ఆమెను చంపడానికి కుదరలేదు.

 చివరగా ఇలా చేశారు...

చివరగా ఇలా చేశారు...

తమ పథకం అమలు చేయడానికి రాంబాబు, నరేశ్ డౌనూరు సమీపంలోని జీడిమామిడి తోటను ఎంచుకున్నారు. చికటి పడిన తర్వాత శివమ్మ, రాంబాబు, నరేశ్ జీడిమామిడి తోటలోకి వెళ్లారు. ముందుగా ముగ్గురు కలిసి మద్యం సేవించారు. ఈ సమయంలో రాంబాబుకు, శివమ్మకు మధ్య గొడవ జరిగింది.

 రాంబాబు ఇలా చేశాడు..

రాంబాబు ఇలా చేశాడు..

మద్యం మత్తులో ఉన్న శివమ్మ మెడను రాంబాబు బ్లేడుతో కోశాడు. దానికి నరేశ్ సహకరించాడు. తర్వాత ఏమీ తెలియనట్లు ఇద్దరు గ్రామానికి వెళ్లారు. వెళ్లేటప్పుడు ముగ్గురు వెళ్లి, వచ్చేటప్పుడు ఇద్దరు రావడంతో కొంత మందికి అనుమానం వచ్చింది. 24వ తేదీన పోలీసులకు గుర్తు తెలియని మహిళ శవం అంటూ జీడిమామిడి తోటలో కనిపించింది. దాంతో కొయ్యూరు పోలీసుల దర్యాప్తు ప్రారంభించారు.

 ఇలా కేసు మిస్టరీ వీడింది..

ఇలా కేసు మిస్టరీ వీడింది..

25వ తేదీన ఆ విషయం పత్రికల్లో వార్తగా వచ్చింది. దీంతో కోటరవుట్లకు చెందిన కొండరు సిఐకి సమాచారం ఇచ్చారు. దాని ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిచారు. రాంబాబు ఫోన్‌ను ట్రాప్ చేశారు. చివరకు అతనితో పాట నరేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

English summary
An extra marital relation lead to the married womn murder at Koyyuru in Visakhapatnam district of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X