వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూలిగే నక్క మీద తాటికాయ .. భారీగా పెరిగిన సిమెంట్ ధరలు .. నిర్మాణ రంగం కోలుకుంటుందా ?

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా నిర్మాణ రంగం కుదేలైంది. ముఖ్యంగా ఏపీలో ఇసుక కొరతతో నిర్మాణ రంగ కార్మికులు రోడ్డున పడ్డారు. ఇసుక సమస్య పరిష్కారం కోసం ప్రతిపక్ష పార్టీలు ఆందోళన బాట పట్టాయి. ఇక ఇదిలా ఉంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా సిమెంట్ ధరలు భారీగా పెరిగాయి. దీంతో ఒక్క తెలుగురాష్ట్రాల్లోనే కాక, దేశ వ్యాప్తంగా నిర్మాణ రంగం మరింత కుదేలవుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది.

సిమెంట్ ఇటుకల లారీలో గంజాయి అక్రమ రవాణా ... ఒక కోటి డెబ్బై లక్షల గంజాయి పట్టుకున్న డీఆర్ఐ అధికారులు సిమెంట్ ఇటుకల లారీలో గంజాయి అక్రమ రవాణా ... ఒక కోటి డెబ్బై లక్షల గంజాయి పట్టుకున్న డీఆర్ఐ అధికారులు

 ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు నిర్మాణ రంగానికి చేయూత ఇస్తామన్న కేంద్రం

ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు నిర్మాణ రంగానికి చేయూత ఇస్తామన్న కేంద్రం

దేశవ్యాప్తంగా నెమ్మదించిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం కోసం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గృహ నిర్మాణాలకు చేయూతనిస్తున్నట్టుగా ప్రకటన జారీ చేశారు.ల అందుబాటు ధరలలో గృహ నిర్మాణ రంగానికి రుణాలు పొందేందుకు వెసులుబాటు కల్పిస్తామని ప్రకటించారు. ఇక అర్హులైన వారికి ఇళ్లు కొనుగోలు చేయడానికి ఆర్థిక సహాయం అందించడానికి చేయూతను ఇస్తామని పేర్కొన్నారు. నిర్మాణ రంగాన్ని ఆదుకోవటానికి కేంద్రం దృష్టి సారించింది అని భావించిన కొద్దిరోజుల్లోనే నిర్మాణరంగం కోలుకుంటుంది అన్న ఆశ హుష్ కాకి అయింది.

నిర్మాణ రంగానికి షాకింగ్ న్యూస్ చెప్పిన సిమెంట్ కంపెనీలు

నిర్మాణ రంగానికి షాకింగ్ న్యూస్ చెప్పిన సిమెంట్ కంపెనీలు

ఇక ఏపీ విషయానికి వస్తే ఇప్పటికే ఐదు నెలలుగా నిర్మాణ రంగం అంపశయ్య మీద ఉంది. నిర్మాణ రంగ కార్మికులు పనులు లేక, పస్తులు ఉండలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇసుక కొరత తీవ్రంగా ఏపీలో నిర్మాణరంగాన్ని వేధిస్తుంది. ఇక ఇదే సమయంలో నిర్మాణ రంగంలో ఉన్న వారికి, గృహనిర్మాణాలు చేపట్టాలకుంటున్న వారికి షాకింగ్ షాకింగ్ న్యూస్ చెప్పాయి సిమెంట్ కంపెనీలు.

విపరీతంగా సిమెంట్ ధరలు ... ఇసుక కొరత , సిమెంట్ ధరలతో సంక్షోభంలో నిర్మాణ రంగం

విపరీతంగా సిమెంట్ ధరలు ... ఇసుక కొరత , సిమెంట్ ధరలతో సంక్షోభంలో నిర్మాణ రంగం

బ్రాండ్, గ్రేడ్‌ని బట్టి బస్తా సిమెంట్ ధర ఏకంగా రూ.70 నుంచి రూ.100 మధ్య పెంచేశాయి. దీంతో బ్రాండ్ వ్యాల్యూ వున్న సిమెంట్ ధరలు బస్తాకు రూ.300 పై చిలుకే ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం విపరీతంగా పెరిగిన సిమెంటు ధరలతో నిర్మాణ అంచనా వ్యయం బాగా పెరుగుతుందని నిర్మాణాలు చేస్తున్న వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకపక్క ఇసుక కొరత, మరోపక్క పెరిగిన సిమెంట్ ధరలతో నిర్మాణ రంగం తీవ్ర సంక్షోభంలో పడుతుందని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.

 గత ఏడాదితో పోలిస్తే భారీగా పడిపోయిన సిమెంట్ విక్రయాలు

గత ఏడాదితో పోలిస్తే భారీగా పడిపోయిన సిమెంట్ విక్రయాలు

గత సంవత్సరం సెప్టెంబరు నెలలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో 25.21 లక్షల టన్నుల సిమెంట్‌ అమ్మకాలు నమోదు అయ్యాయి. ఇక ఈ సంవత్సరం సెప్టెంబరులో అది ఏకంగా సగానికి సగం తగ్గి 12.5 లక్షల టన్నులకు సిమెంట్ విక్రయాలు పడిపోవడంతో సిమెంట్ ఉత్పత్తి చేస్తున్న కంపెనీలు ఉత్పత్తిని తగ్గిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక సిమెంట్ ధరలను పెంచిన తయారీదారులు ప్రస్తుతం నిర్మాణ రంగం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఉత్పత్తిని కూడా తగ్గించినట్టు తెలుస్తోంది.

నిర్మాణ రంగం కోలుకోకుండా దెబ్బ మీద దెబ్బ

నిర్మాణ రంగం కోలుకోకుండా దెబ్బ మీద దెబ్బ

దీంతో మార్కెట్‌లో వున్న సిమెంట్‌పైనే ఆధారపడక తప్పదని వినియోగదారులు భావిస్తున్నారు. ఇసుక కొరత, ఆర్థిక మాంద్యం భయాలతో ఈ ఏడాది జూన్‌ నుంచే తెలుగు రాష్ట్రాల్లో సిమెంట్‌ విక్రయాలు విపరీతంగా తగ్గాయి. సెప్టెంబరులో అమ్మకాలు ఏకంగా 50 శాతం మేర పడిపోవటంతో సిమెంట్‌ కంపెనీలు సైతం కుదేలవుతున్నాయి. అందుకే ధరలు పెంచి, ఉత్పత్తిని తగ్గించి నష్టాల నుండి గట్టెక్కే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే సిమెంట్ కంపెనీలు తీసుకున్న ఈ నిర్ణయంతో నిర్మాణ రంగం మరింత పతనావస్థకు చేరుకుంటుందని, ఇప్పట్లో కోలుకునే పరిస్థితి ఉండదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

English summary
For those in the construction industry and those looking to build homes, the shocking news told the cement companies. Depending on the brand and grade, the price of bag cement has gone up from Rs 70 to Rs 100. This means that the brand value of cement prices is around Rs 300 per bag. Construction builders are concerned that the cost of construction is rising with the currently high cement prices.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X