• search
  • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఎపి టెక్నాలజీపై...సైబర్‌ అటాక్స్‌ జరిగే ప్రమాదం: మంత్రి లోకేష్‌

By Suvarnaraju
|

విశాఖపట్టణం:ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పెద్ద ఎత్తున టెక్నాలజీ ఉపయోగిస్తున్ననేపథ్యంలో సైబర్‌ అటాక్స్‌ జరిగే ప్రమాదం ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ అన్నారు. అయితే ఈ దాడుల నిరోధానికి ముందస్తుగానే సైబర్ సెక్యూరిటీ చర్యలు చేపట్టామని లోకేష్ వెల్లడించారు. శుక్రవారం విశాఖలో జరిగిన సైబర్‌ సెక్యూరిటీ సమ్మిట్‌లో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్బంగా సైబర్ సెక్యూరిటీ సంస్థ మాస్టర్ కార్డ్ తో ఎపి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అనంతరం మంత్రి లోకేష్‌ మాట్లాడుతూ సైబర్ సెక్యూరిటీ అంశాలతో పాటు రైతులకు క్రెడిట్‌ రేటింగ్‌ ఇచ్చే అంశంపై మాట్లాడారు.

విశాఖలో..నారా లోకేష్

విశాఖలో..నారా లోకేష్

ఎపి ఐటి మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో సైబర్ సెక్యూరిటీ సమ్మిట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగామాస్టర్ కార్డ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రవిఅరోరా, ఇతర ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ సమావేశం సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సైబర్ సెక్యూరిటీ కల్పించడంతో సహా వివిధ ప్రాజెక్టులకు టెక్నికల్ సపోర్ట్ ఇచ్చేందుకు మాస్టర్ కార్డ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు.ఫార్మర్ మార్కెట్ ప్లేస్ సొల్యూషన్స్, స్మార్ట్ ట్రాన్సిట్ అండ్ స్మార్ట్ సిటీస్,శిక్షణ,నైపుణ్య అభివృద్ధి అంశాతకు సంబంధించి మాస్టర్ కార్డ్ తో ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది.

మాస్టర్ కార్డ్...సేవలు

మాస్టర్ కార్డ్...సేవలు

చిన్న రైతులు పండించే పంటలు, డ్వాక్రా మహిళలు తయారు చేసే వివిధ ఉత్పత్తుల సత్వర విక్రయాల కోసం అమ్మకందారులను-కొనుగోలుదారులను ఒకే వేదిక పైకి తీసుకొచ్చి ఫైనాన్సియల్ సర్వీసెస్ అందించడం

విషయాల్లో మాస్టర్ కార్డ్ సేవలు భేష్ అన్నారు మంత్రి లోకేష్.

ఒప్పందంలో భాగంగా ఐఐడిటి తో కలసి సైబర్ సెక్యూరిటీ లో ఎపికి శిక్షణ ఇవ్వడానికి మాస్టర్ కార్డ్ అంగీకరించింది. అలాగే

స్మార్ట్ సిటీస్ లను లెస్ క్యాష్ సిటీస్ గా మార్చడం వంటి విషయాల్లోనూ, ముఖ్యంగా రైతుల క్రెడిట్ రేటింగ్ అంశాల్లోనూ మాస్టర్ కార్డ్ ఎపికి సేవలు అందించనుంది.

రైతులకు...క్రెడిట్ రేటింగ్ అంటే అయితే

రైతులకు...క్రెడిట్ రేటింగ్ అంటే అయితే

రైతులకు క్రెడిట్ రేటింగ్ ఇచ్చే అంశం పై కూడా మాస్టర్ కార్డ్ సహకరించాలని మంత్రి లోకేష్ కోరారు.సరైన సమాచారం లేక రైతులకు అప్పు ఇవ్వడానికి బ్యాంకులు నిరాకరిస్తున్నాయని,బ్యాంకుల నుండి అప్పు తీసుకోవడం రైతులకు ఇబ్బందికర ప్రక్రియగా మారిందని లోకేష్ వివరాంచారు.ప్రభుత్వం దగ్గర భూమి వివరాలు,వేసిన పంట వివరాలు ఇలా ఎంతో సమాచారం ఉంది.దీనిని వినియోగించుకొని రైతులకు క్రెడిట్ రేటింగ్ ఇవ్వగలిగేతే రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అప్పుడుబ్యాంకులు త్వరితగతిన రైతులకు అప్పు ఇచ్చే పరిస్థితి వస్తుందని లోకేష్ చెప్పారు.

సైబర్ సెక్యూరిటీ కోసం...చర్యలు

సైబర్ సెక్యూరిటీ కోసం...చర్యలు

త్వరితగతి అభివృద్ది కోసం పాలనలో ఎపి టెక్నాలజీని విరివిగా వినియోగించడం అందులో భాగంగా ఐఓటి పరికరాలను వినియోగించడం జరుగుతోందని మంత్రి లోకేష్ తెలిపారు. అయితే వీటిపై సైబర్ అటాక్స్ జరిగే ప్రమాదం కూడా ఉందన్నారు.

అందుకే సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ కూడా ఏర్పాటు చేసామని లోకేష్ చెప్పారు. ప్రత్యేకించి

తిరుపతిలోని ఐఐడిటి ద్వారా బ్లాక్ చైన్,సైబర్ సెక్యూరిటీ లాంటి అధునాతన టెక్నాలజీల పై శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతోందన్నారు.

ఎపి భేష్...రవి అరోరా

ఎపి భేష్...రవి అరోరా

టెక్నాలజీ వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందరికంటే ముందుందని మాస్టర్ కార్డ్ వైస్ ప్రెసిడెంట్ రవి అరోరా ప్రశంసించారు. ఈ విషయంలో ఎపి దేశానికే ఆదర్శంగా ఉన్నారు కాబట్టే ఎపి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని కలిసి పని చెయ్యాలి అనుకుంటున్నామని ఆయన తెలిపారు. తమ సంస్థ

సైబర్ సెక్యూరిటీ లో మంచి నైపుణ్యం సాధించిందని, ఆ దిశలో మీకు పూర్తి సహకారం అందిస్తామని మంత్రి లోకేష్ ను ఉద్దేశించి చెప్పారు.

రైతులకు క్రెడిట్ రేటింగ్ ఇచ్చే అంశం పై ఒక విధానం రూపొందించి త్వరలోనే మీ ముందుకు వస్తామని మాస్టర్ కార్డ్ వైస్ ప్రెసిడెంట్ రవి అరోరా వివరించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Visakhapatnam: Global digital payments major Mastercard entered into an agreement with the Andhra Pradesh government to enable safe and secure digital solutions to be adopted at the state level. The partnership would help the state government to enable more robust digital payments solutions for the government's Fintech Valley initiative.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more