వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీకి మారిషస్ నోటీసులు: విషప్రచారం, వైఎస్ జగన్ వాదన ఇదీ..

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

Sakshi vs Andhrajyothy Counters Over Mauritius Legal Notice

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కేసులో మారిషస్ ప్రభుత్వం ప్రధాని మోడీకి నోటీసు జారీ చేసిందంటూ వచ్చిన వార్తలపై సాక్షి మీడియా భగ్గుమంది. జగన్‌కు ఏం సంబంధమంటూ ప్రశ్నించింది.

అందుకు సంబంధించిన వివరణ కూడా ఇచ్చింది. దాన్ని జగన్ వాదనగా చెప్పవచ్చు. ఇందూ టెక్ కంపెనీకి, మారిషస్ కంపెనీకి మధ్య తలెత్తిన వివాదంలో భారత ప్రభుత్వానికి నోటీసులు రావడాన్ని జగన్‌కు ఆపాదిస్తూ విషపూరిత ప్రచారానికి దిగారని దుయ్యబట్టింది. సాక్షి మీడియా వివరణ ఇలా ఉంది.

దానివల్ల అలా అయింది...

దానివల్ల అలా అయింది...

మారిషస్‌కు చెందిన కరిస్సా ఇన్వెస్ట్‌మెంట్స్ ఎల్ఎల్‌సి అనే కంపెనీ ఇందుటెక్‌లో పెట్టుబడులు పెట్టింది. ఇందూకు కేటాయించిన భూమిని సిబిఐ కేసు సందర్భంగా ఈడి అటాచ్ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆ కేటాయింపును రద్దు చేసింది. ఆ ప్రాజెక్టు ముందుకు సాగకపోవడంతో తనకు నష్టం వచ్చిందని మారిషస్ కంపెనీ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

ఆ వ్యవహారంలో భారత ప్రభుత్వానికి నోటీసులు

ఆ వ్యవహారంలో భారత ప్రభుత్వానికి నోటీసులు

ఆ వ్యవహారంలో భారత ప్రభుత్వానికి నోటీసులు అందాయి. ఈ రెండు కంపెనీల వ్యవహారానికి జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం? మారిషస్ కంపెనీకి, ఇందూ టెక్ కంపెనీకి మధ్య కుదిరిన ఒప్పందంలో జగన్ ఎక్కడున్నారు? ఇందూటెక్‌లో మారిషస్ కంపెనీ పెట్టుబడులకు జగన్ బాధ్యత వహించాలా? ఆ రెండు కంపెనీల్లో దేనిలోనూ జగన్ భాగస్వామి కానప్పుడు ఆ రెండు కంపెనీల మధ్య సమస్య తలెత్తితే జగన్ ఏం చేయాలి?

మోకాలికి, బోడిగుండుకు ముడి పెట్టడం

మోకాలికి, బోడిగుండుకు ముడి పెట్టడం

సంబంధం లేని రెండు కంపెనీల వివాదాన్ని జగన్‌కు ఆపాదించడమంటే మోకాలికి, బోడి గుండుకు ముడిపెట్టడం కాదూ.... జగన్‌పై మోపిన అక్రమ కేసుల్లో ఇందూ టెక్ ఉంది కాబట్టి.. ఆ ఇందూ టెక్‌పై ఏదో కేసు వచ్చింది కాబట్టి దానికి కాస్త మసాలా జోడించి జగన్ ఖాతాలో వేసేందుకు ఎల్లో మీడియా పన్నాగం పన్నింది.

కాంగ్రెసు, టిడిపి కలసి రాజకీయ దురుద్దేశంతో...

కాంగ్రెసు, టిడిపి కలసి రాజకీయ దురుద్దేశంతో...

కాంగ్రెసు నుంచి బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెసు, టిడిపి కలసి రాజకీయ దురుద్దేశంతో, కక్ష సాధింపుతో జగన్‌పై పెట్టిన కేసులు న్యాయస్థానంలో విచారణలో ఉన్నాయి. అవి కక్ష సాధింపుతో పెట్టిన కేసులనే విషయం ఇప్పటికే రుజువవుతూ ఉంది. ఒక్కో నిరాధారమైన ఆరోపణ తేలిపోతూ ఉంది. వైఎస్ హయంలో ఇందూ టెక్‌కు హైదరాబాదు నగరానికి దూరంగా రంగారెడ్డి జి్లలాలో మారుమూల.. అదీ బహిరంగ వేలంలో భూమి కేటాయించారు. అక్కడ ఇంకా అనేక కంపెనీలకూ భూములు కేటాయించారు. అందులో ఇంద టెక్ భూముల కేటాయింపు మాత్రమే రద్దు చేశారు.

ఇదీ సాక్షి లాజిక్...

ఇదీ సాక్షి లాజిక్...

సాక్షి మీడియా ఇలా లాజిక్ లాగింది. చంద్రబాబు తన హయాంలో రహేజా కంపెనీకి నగరం నడిబొడ్డున 250 ఎకరాలు కేటాయించారు. దాని మీద ఎవరైనా కేసు పెట్టి సిబిఐ విచారణ జరిగి ఆ భూములు కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుంటే వాళ్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించరా? ఇలా నోటీసులు రావా?

English summary
Sakshi media published supporting YSR Congress party president YS Jagan in Indu Tech case, in which Indian government recieved notice from Maritius.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X