వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విక్రమాదిత్యలో ప్రధాని మోడీ ప్రయాణం (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

పానాజీ: దేశంలోనే అత్యంత పెద్దదైన యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రయాణం చేశారు. ఆయన దాన్ని శనివారం జాతికి అంకితం చేశారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీ తొలిసారిగా ఈయ యుద్ధనౌకను సందర్శించారు.

గోవా తీరంలోని ఆరేబియా సముద్రంలో ఉన్న విక్రమాదిత్య యుద్ధనౌకపైకి మోడీ హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. ఈ సందర్భంగా నావికా దళం అధికారులు మోడీకి ఘనస్వాగతం పలికి గౌరవందనం సమర్పించారు. యుద్ధనౌకలో నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ ఆర్‌కె ధావన్ కూడా ఉన్నారు.

విక్రమాదిత్య యుద్ధనౌకపై ఉన్న మిగ్ 29కె యుద్ధ విమానం కాక్‌పిట్‌లో మోడీ కాసేపు కూర్చుని అందులోంచి అభివాదం చేశారు. తర్వాత అక్కడి సిబ్బందితో ముచ్చటించారు.

గోవాలో మోడీ

గోవాలో మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోనే అత్యంత పెద్దదైన యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో ప్రయాణించారు. అక్కడికి ఆయన హెలికాప్టర్‌లో చేరుకున్నారు.

గోవాలో మోడీ

గోవాలో మోడీ

మోడీ ఉద్వేగపూరితమైన తన భావనలను అక్కడివారితో పంచుకున్నారు. నావికా దళం అధికారుల వందన సమర్పణను స్వీకరించారు.

గోవాలో మోడీ

గోవాలో మోడీ

దేశీయ ఆయుధాల ప్రాముఖ్యతను మోడీ వివరించారు. దిగుమతుల నుంచి మనం బయటపడాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.

గోవాలో మోడీ

గోవాలో మోడీ

సవాళ్లను సాధారణంగా తీసుకోవద్దని ప్రధాని మోడీ అన్నారు. మన రక్షణ యంత్రాంగం ప్రపంచంలోనే ఉత్తమంగా ఉండాలని ఆయన అన్నారు.

గోవాలో మోడీ

గోవాలో మోడీ

ప్రధాని మోడీ నావికా దళాధికారులతో మాట్లాడారు. వారి కోసం చేపట్టే కార్యక్రమాలను వివరించారు.

English summary
It was not a regular day for the men in white uniforms on INS Vikramaditya with the Prime Minister of India Narendra Modi on board.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X