వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మ‌మ‌త బాట‌లోనే మాయావ‌తి: చ‌ంద్ర‌బాబు చ‌క్రానికి బ్రేకులు..! వాట్ నెక్స్ట్‌..!

|
Google Oneindia TeluguNews

జాతీయ రాజకీయాల్లో టిడిపి అధినేత చంద్ర‌బాబు చ‌క్రానికి బ్రేకులు ప‌డుతున్నాయి. బిజెపీయేతర పార్టీల‌ కూట‌మి ద్వారా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా మోదీ ప్ర‌ధాని కాకుండా అడ్డుకోవాల‌ని చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇందు కోసం కాంగ్రెస్ అధినేత వ‌ద్ద‌కే స్వ‌యంగా వెళ్లారు. కాంగ్రెస్ తో ఏర్పాటు చేస్తున్న కూట‌మికి మ‌ద్ద‌తిచ్చేందుకు కీల‌క పార్టీలు వ్య‌తిరేకిస్తున్నాయి. బిజెపి- కాంగ్రెసేత‌ర పార్టీల కూట‌మికి ప్రాధాన్య‌త ఇస్తున్నాయి. మ‌రి..ఇప్పుడు చంద్ర‌బాబు ఏం చేస్తారు..ఎలా ముందుకెళ్తారు..

Mayavathi in route of Mamatha : non Bjp- non Congress Alliance..

మొన్న మ‌మ‌త‌.. నేడు మాయావ‌తి..

కాంగ్రెస్ తో క‌లిసి బిజెపీయ‌త‌ర కూటిమి ఏర్పాటుకు మొద‌ట్లో స‌రే అన్ని మ‌మ‌తా బెనర్జీ ఇప్పుడు స‌సేమిరా అంటు న్నారు. త‌మ విధానం కాంగ్రెస్ -బిజెపి వ్య‌తిరేక కూటిమ‌నే అంటూ స్ప‌ష్టం చేసారు. చెన్నై లో జ‌రిగిన క‌రుణానిధి విగ్ర‌హ ఆవిష్క‌ర‌ణ స‌భ‌లో డిఎంకె అధినేత స్టాలిన్ కాంగ్రెస్ అధినేత రాహుల్ ను ప్ర‌ధాని అభ్య‌ర్ధి గా అభివర్ణించ‌టం పై తృణ‌మూల్ అధినేత్రి ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. ముందుగానే ప్ర‌ధాని అభ్య‌ర్ధిని ఎలా ప్ర‌కిటిస్తార‌ని ప్ర‌శ్నించారు. ఇదే విధంగా స‌మాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ సైతం ప్ర‌స్తావించారు. రాహుల్ ను ముందుగానే ప్ర‌ధాని అభ్య‌ర్ధిగా ప్ర‌క‌టించ‌టం స‌రి కాద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేసారు. ఇదే స‌మ‌యంలో.. ఉత్త‌ర ప్ర‌దేశ్ రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు మారు తున్నాయి. దేశంలోనే పెద్ద రాష్ట్రమైన ఉత్త‌ర ప్ర‌దేశ్ లో అత్య‌ధిక ఎంపి సీట్లు ఉన్నాయి. అక్క‌డ బిజెపిని దెబ్బ తీస్తే మెజార్టీ రాద‌నే అంచ‌నాలో ఎస్పీ- బిఎస్పీ ఉన్నాయి. దీంతో..ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో సీట్లు పంచుకొని బిజెపిని దెబ్బ తీయ‌టానికి మ‌హా కూట‌మి ఏర్పాటు చేయాల‌ని బిఎస్పీ అధినేత్రి మాయావ‌తి డిసైడ్ అయ్యారు. జ‌వ‌నరి 15న త‌న పుట్టిన రోజు నాడు ఈ ప్ర‌క‌ట‌న చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ఆ కూట‌మిలో కాంగ్రెస్ కు అవ‌కాశం లేద‌ని తేల్చేసారు.

అది మోదీకి స‌హ‌క‌రించ‌ట‌మే : ఉప‌యోగం లేదు..

కాంగ్రెస్ మ‌ద్ద‌తు లేకుండా ఏర్ప‌డే మూడో కూట‌మి వ‌ల‌న ఎటువంటి ఉప‌యోగం లేద‌ని టిడిపి అధినేత చంద్ర‌బాబు చెబుతున్నారు. ఆ కూట‌మి ప‌రోక్షంగా మోదీకి స‌హ‌క‌రించ‌ట‌మేన‌ని వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్ప‌టికే కాంగ్రెస్ లేని కూట మి త‌మద‌ని మ‌మ‌తా..మాయావ‌తి..అఖిలేష్ చెబుతున్నారు. అదే స‌మ‌యంలో టిఆర్‌య‌స్ అధినేత కెసిఆర్ సైతం ఇదే ఆలోచ‌న‌తో ఉన్నారు. కాంగ్రెస్‌- బిజెపీయ‌త‌ర పార్టీలతో ఫెడ‌రల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామ‌ని ఇప్ప‌టికే కెసిఆర్ ప్ర‌క టించారు. ఇక‌, వైసిపి, బిజెడి, జెడి(యు) వంటి పార్టీలు సైతం ఇదే ఫార్ములా తో క‌లిసే అవ‌కాశం క‌నిపిస్తోంది. మరి.. మోదీ పై యుద్దం ప్ర‌క‌టించి..రాహుల్ తో చేతులు క‌లిపి..ఎలాగైనా బిజెపిని వ‌చ్చే ఎన్నిక‌ల్లో అడ్డుకోవాల‌ని చూస్తున్న చంద్ర‌బాబు వ్యూహాలు వీరి కార‌ణంగా బెడిసి కొట్టే ప్ర‌మాదం లేక పోలేదు. మ‌రి.. చంద్ర‌బాబు రానున్న రోజుల్లో కాంగ్రెస్ తో క‌లిసి ఎటువంటి అడుగులు వేస్తారో చూడాలి.

English summary
Mayavati following Mamata. Both are decided to not support BJP and also Congress. They want to play key role in National Politics. In U.P BSP and SP ready to share seats as Maha kutami. Now seems to be breaks for anti BJP alliance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X