• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

విశాఖ వైసీపీలో మేయర్ పదవి చిచ్చు .. వైసీపీ నగర అధ్యక్ష పదవికి వంశీకృష్ణ రాజీనామా ?

|

విశాఖ కార్పొరేషన్ మేయర్ పదవి విశాఖ నగరం వై.సి.పి.లో చిచ్చు రేపింది. తనకు మేయర్ పదవి ఇవ్వనందుకు వైసిపి నగర అధ్యక్ష పదవికి వంశీకృష్ణ శ్రీనివాస్ రాజీనామా చేయాలని నిర్ణయించినట్లు గా తెలుస్తుంది. జిహెచ్ఎంసి మేయర్ పదవి తనకు వస్తుందని భావించిన వంశీకృష్ణకు వైసిపి అధిష్టానం ఆ పదవిని హరి వెంకట కుమారికి ఇవ్వడం తీవ్ర అసహనానికి గురి చేసింది. దీంతో బాహాటంగానే విశాఖ వైసీపీలో రచ్చ కొనసాగింది .

జగన్ ఇలాకాలో వైసీపీలో ముసలం .. జమ్మలమడుగు వైసీపీ కౌన్సిలర్ రాజీనామా, ఎమ్మెల్యేపై ఆరోపణలుజగన్ ఇలాకాలో వైసీపీలో ముసలం .. జమ్మలమడుగు వైసీపీ కౌన్సిలర్ రాజీనామా, ఎమ్మెల్యేపై ఆరోపణలు

 వైసీపీ మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల పూర్తి జాబితా ఇదే: బ్యాక్‌వర్డ్ కాదు..బ్యాక్‌బోన్: సజ్జల వైసీపీ మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల పూర్తి జాబితా ఇదే: బ్యాక్‌వర్డ్ కాదు..బ్యాక్‌బోన్: సజ్జల

 మేయర్ పదవి ఇస్తామని చెప్పి ఇవ్వకుండా వంశీకృష్ణను మోసం చేశారని ఆరోపణ

మేయర్ పదవి ఇస్తామని చెప్పి ఇవ్వకుండా వంశీకృష్ణను మోసం చేశారని ఆరోపణ

మేయర్ పదవి ఇస్తామని చెప్పి వంశీకృష్ణ తో కార్పొరేటర్ గా పోటీ చేయించారని ,పార్టీ అత్యధిక స్థానాలలో గెలిచిన తర్వాత ఆయనను మోసం చేశారని వంశీకృష్ణ వర్గం ఆరోపిస్తోంది. పార్టీ కోసం ఎంతో కష్టపడి పని చేసినా గుర్తింపు లేదని వంశీ కృష్ణ వర్గం అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇక వంశీకి మేయర్ పదవి దక్కకపోవడం పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన వర్గీయులు జీవీఎంసీ గేట్ వద్ద ఆందోళనకు దిగారు. కొందరయితే వంశీకృష్ణ కోసం కన్నీరు పెట్టుకున్నారు. ఎంపీ విజయసాయి రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదంతా ఆయనే చేశారని వంశీకృష్ణ వర్గీయులు ఆరోపిస్తున్నారు.

రాజకీయాల్లో తాను దురదృష్టవంతుడనన్న వంశీకృష్ణ

రాజకీయాల్లో తాను దురదృష్టవంతుడనన్న వంశీకృష్ణ

ఇదిలా ఉంటే మీడియాతో మాట్లాడిన వంశీకృష్ణ రాజకీయాల్లో తాను దురదృష్టవంతుడు అని వ్యాఖ్యానించారు. కొన్ని శక్తులు తనను అడ్డుకుంటున్నాయని వాళ్లకి దేవుడే సమాధానం చెబుతాడని ఆయన పేర్కొన్నారు. త్వరలో సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలుస్తాను అన్న వంశీకృష్ణ శ్రీనివాస్, సీఎంను కలిసి మాట్లాడిన తర్వాత కార్పొరేటర్ గా కొనసాగాలా వద్దా నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. తనకు జరిగిన అన్యాయంపై, ఈ వ్యవహారంపై సమగ్ర లేఖ రాసి విడుదల చేస్తానని పేర్కొన్నారు.

 మేయర్ పదవి విషయంలో విశాఖ వైసీపీలో రచ్చ .. అసంతృప్తి జ్వాలలు

మేయర్ పదవి విషయంలో విశాఖ వైసీపీలో రచ్చ .. అసంతృప్తి జ్వాలలు

మేయర్ పదవి పై చాలా ఆశలు పెట్టుకున్న ఆ పదవి తనకు దక్కకపోవడంతో వైసిపి నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ తీవ్ర అసహనంతో ఉన్నారు. నగర అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తుంది.
విశాఖ మేయర్ గా విశాఖ తూర్పు లోని 11వ వార్డు కు చెందిన గొలగాని వెంకట హరి కుమారికి అవకాశం కల్పించడంపై పార్టీ సీనియర్లలో తీవ్ర అసహనం వ్యక్తం అవుతుంది. ఏ ప్రాతిపదికన ఆమెకు అవకాశం ఇచ్చారో అని పార్టీలో అంతర్గత చర్చ జరుగుతోంది. విశాఖలో పార్టీని బలోపేతం చేయడానికి పనిచేసిన నాయకులకు కాకుండా ఆమెకు మేయర్ గా అవకాశం ఇవ్వడంపై రగులుతున్న అసంతృప్తి జ్వాలలు చల్లారతాయా లేదా అనేది వేచి చూడాలి.

English summary
The post of mayor of Visakhapatnam Corporation has caused a stir in the city of Visakhapatnam YCP. It is learned that Vamsi Krishna Srinivas has decided to resign as YCP city president for not giving him the mayoral post. Vamsikrishna, who thought he would get the GVMC mayoral post, was deeply impatient with the YCP supremacy giving the post to Hari Venkata Kumari. With this, the inetrnal clash in Visakhapatnam YCP continued.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X