వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహాశివరాత్రి అని గుడికి వెళ్తే..: అమ్మాయిపై ప్రేమోన్మాది ఘాతుకం

|
Google Oneindia TeluguNews

కాకినాడ: మంగళవారం మహాశివరాత్రిని పురస్కరించుకుని గుడికెళ్లిన ఓ యువతిపై ప్రేమోన్మాది దాడికి తెగబడ్డాడు. కాకినాడలో జరిగిన ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. ప్రేమ పేరుతో వేధిస్తున్న ప్రసాద్ అనే యువకుడు.. మద్యం మత్తులో ఈ దాడికి ఒడిగట్టినట్టు గుర్తించారు. జరిగిన సంఘటనతో యువతి తీవ్ర భయాందోళనకు లోనైంది.

ప్రేమించమని..:

ప్రేమించమని..:

కాకినాడలోని సాంబమూర్తినగర్‌కు చెందిన యువతి(23)స్థానికంగా ఎంబీఏ చదువుతోంది. కాకినాడ పోర్టులో క్రేన్ ఆపరేటర్‌గా పనిచేసే ఆకుల ప్రసాద్ అనే యువకుడు ఆమెను కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు.

పీకలదాకా తాగొచ్చి..:

పీకలదాకా తాగొచ్చి..:


డెయిరీఫామ్ సమీపంలోని రాజీవ్‌ గృహకల్పలో నివాసముండే ప్రసాద్.. తనను ప్రేమించాల్సిందిగా యువతిపై పదేపదే ఒత్తిడి తెస్తున్నాడు. తన వెంట పడవద్దని యువతి ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు. ఈ క్రమంలోనే మహాశివరాత్రి రోజు ఫూటుగా మద్యం సేవించి వచ్చి ఆమెపై దాడికి పాల్పడ్డాడు.

గుడి వద్దే కత్తితో దాడి..:

గుడి వద్దే కత్తితో దాడి..:

మంగళవారం మహాశివరాత్రి కావడంతో యువతి తమ ఇంటికి సమీపంలోని గుడికి వెళ్లింది. అక్కడికి వచ్చి తనను ప్రేమించాలని నానా గొడవ చేశాడు ప్రసాద్. తన వెంట పడవద్దని యువతి ఖరాఖండిగా చెప్పడంతో.. వెంట తీసుకొచ్చిన కత్తితో ఆమెపై దాడి చేశాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన మరో ముగ్గురిపై కూడా ప్రసాద్ కత్తితో దాడి చేశాడు.

స్థానికులు అడ్డుకోవడంతో..:

స్థానికులు అడ్డుకోవడంతో..:

గుడి వద్దే ఉన్న స్థానికులు కుడిపూడి సత్యనారాయణ, పితాని శ్రీనివాసరావు, మేడిశెట్టి సదాసాంబశివరావులు అడ్డుకోవడంతో యువతి ప్రాణాలతో బయటపడింది.

అయితే ప్రసాద్ దాడిలో ఆమె మెడ భాగం కింద స్వల్ప గాయాలయ్యాయి. అలాగే అడ్డుకోవడానికి ప్రయత్నించినవారికి కూడా గాయాలయ్యాయి. ఓ వ్యక్తికి చెవిభాగంలో తీవ్ర గాయమైనట్టు తెలుస్తోంది. యువతి ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

English summary
A crane operator allegedly attacked an MBA student with a knife in Andhra Pradesh's Kakinada, after she refused to accept his love proposal on Tuesday, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X