చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆన్‌లైన్‌లో చంద్రబాబు ఇంటి కొలతలు: ఎందుకంటే?

నారావారిపల్లెలోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇంటి కొలతలను గురువారం ఆన్‌లైన్‌లో పొందుపరిచారు.

|
Google Oneindia TeluguNews

చిత్తూరు/చంద్రగిరి: నారావారిపల్లెలోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇంటి కొలతలను గురువారం ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. పంచాయతీ డిజిటలైజేషన్‌లో భాగంగా సీఎం సొంత పంచాయతీ కందులవారిపల్లెను కుప్పం నియోజకవర్గంలోని మరో పంచాయతీని పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు ఇంటి కొలతలను కూడా ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లు డీఎల్‌పీవో సురేష్‌నాయుడు తెలిపారు. రాజధాని అమరావతి నుంచి వచ్చిన ఇద్దరు మాస్టర్‌ ట్రైనర్లు సురేష్‌, సతీష్‌లు నారావారిపల్లెలో సర్వే నిర్వహించి, ఈవోపీఆర్డీ, పంచాయతీ కార్యదర్శులు, బిల్లు కలెక్టర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లకు అవగాహన కల్పించారన్నారు.

Measurements of chandrababu naidu house is online

జోరుగా సాగుతున్న డిజిటలైజేషన్‌ ప్రక్రియ పూర్తయితే నీటి, ఆస్తు పన్నులతో పాటు జనన, మరణ ధ్రువీకర పత్రాలు, తదితరాలన్నీ ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తాయని డీఎల్‌పీఓ సురేష్ నాయుడు వివరించారు.

English summary
It is said that Measurements of Andhra Pradesh CM Chandrababu Naidu's house in Naravaripalle is online.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X