వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఎంసీ బిల్లుపై భగ్గుమన్న వైద్య సిబ్బంది ...ఎమర్జెన్సీ మినహా వైద్య సేవలు బంద్

|
Google Oneindia TeluguNews

కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) బిల్లు లోక్ సభలో ఆమోదం పొందింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఒక రోజు వైద్య సేవలు నిలిపివేస్తున్నట్టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది. ఇక దీంతో ఏపీ, తెలంగాణా రాష్ట్రాల్లో అత్యవసర సేవలు మినహా మిగతా వైద్య సేవలన్నీ బంద్ అయ్యాయి . పేదలకు వైద్య విద్యను దూరం చేసే విధంగా నూతన చట్టం ఉండే అవకాశం ఉందని ఐఎంఏ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది . అంతే కాదు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఏ) మనుగడే ప్రశ్నార్థకం అయ్యేట్లు నూతన చట్టం ఉందని ఐఎంఏ తేల్చి చెప్తుంది.

ఏపీలో ఆగస్ట్ 1నుండి రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు .. కిటకిటలాడుతున్న రిజిస్ట్రేషన్ ఆఫీసులుఏపీలో ఆగస్ట్ 1నుండి రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు .. కిటకిటలాడుతున్న రిజిస్ట్రేషన్ ఆఫీసులు

 ఎన్ఎంసీ బిల్లుపై ఆందోళనకు ఐఎంఏ పిలుపు .. 24 గంటల పాటు వైద్య సేవలు బంద్

ఎన్ఎంసీ బిల్లుపై ఆందోళనకు ఐఎంఏ పిలుపు .. 24 గంటల పాటు వైద్య సేవలు బంద్

కేంద్ర సర్కార్ తాజాగా ప్రవేశపెట్టి లోక్ సభ ఆమోదం పొందిన బిల్లు వల్ల రాజ్యాంగ నిర్మాతలు దేశ ప్రజల ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఏర్పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ను ప్రశ్నార్ధకం చేయ్యనున్నారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆరోపిస్తుంది. ఇక ఈ బిల్లుతో పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం కావడంతో పేదలకు వైద్యం కూడా దూరం అయ్యే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు. ఎన్‌ఎంసీ బిల్లుతో వైద్యుల కంటే రోగులకే మరింత ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని కూడా పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు . ఈ క్రమంలోనే ఐఎంఏ పిలుపు మేరకు 24 గంటల పాటు వైద్య సేవలను నిలిపివేస్తున్నట్టు వైద్యులు ప్రకటించారు. ఇక వైద్య విద్యార్థులు సైతం వైద్య సిబ్బందికి మద్దతుగా బంద్ లో పాల్గొంటున్నారు.

తెలుగురాష్ట్రాల్లో కొనసాగుతున్న వైద్యుల ఆందోళన ... ఎమర్జన్సీ సేవల కొనసాగింపు

తెలుగురాష్ట్రాల్లో కొనసాగుతున్న వైద్యుల ఆందోళన ... ఎమర్జన్సీ సేవల కొనసాగింపు

నేడు 31 జులై 2019 న ఉదయం 6గంటల నుంచి రేపు 01 ఆగస్ట్ 2019 ఉదయం 6 గంటల వరకు వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు వైద్యులు ప్రకటించారు. ‘జాతీయ వైద్య మండలి బిల్లు'ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వైద్యసిబ్బంది ప్రభుత్వానికి హెచ్చరికగా ఈ ఒకరోజు నిరసనకు దిగారు. రెండు రాష్ట్రాల్లోని ప్రధాన ఆసుపత్రుల్లోని వైద్యులు, సిబ్బంది కూడా నిరసనలో పాల్గొనడంతో రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర వైద్యసేలు తప్ప మిగిలినవి ఎక్కడికక్కడ నిలిచిపోయాయి . ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు అత్యవసర చికిత్సలను మాత్రం అందిస్తామని వైద్య సిబ్బంది చెప్పారు.

 బిల్లుపై ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిక

బిల్లుపై ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిక

ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఈ బిల్లుపైన ఆందోళన కొనసాగుతుంది. ఇక తెలుగు రాష్ట్రాలలోని వైద్య సిబ్బంది కూడా ఆందోళనలో పాల్గొంటున్నారు. హైదరాబాద్‌ నగరంలోని వైద్యులు నాంపల్లిలోని నీలోఫర్‌ ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు. అలాగే, గుంటూరు, విశాఖపట్నం, విజయవాడ తదితర ప్రాంతాల్లోనూ వైద్యులు, సిబ్బంది విధులను బహిష్కరించి తమ నిరసన తెలియజేస్తున్నారు. గుంటూరు జీజీహెచ్‌ ఎదుట ఐఎంఏ, ప్రభుత్వ వైద్యులు, జూనియర్‌ డాక్టర్లు ధర్నా నిర్వహించారు. తమ ఆందోళనపై ప్రభుత్వం స్పందించకుంటే నిరసన మరింత తీవ్రం చేస్తామని వైద్య సిబ్బంది హెచ్చరిస్తున్నారు.

English summary
Doctors have announced that they will discontinue medical services from 6 am on 31 July 2019 to 6 am tomorrow. The National Medical Council has protested this one day as a warning to the government that the government is vehemently opposed to the bill. Doctors and staff at major hospitals in both states are protesting. Doctors and staff at major hospitals in the two states are also taking part in the protest. Except for emergency medical services, there is nowhere to be found. Emergency treatments will only be provided to patients with life-threatening conditions, medical staff said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X