వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపికి ప్రభాస్ బాసట: పవన్ కళ్యాణ్‌కు తోడా, చెక్కా?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తన పెదనాన్న కృష్ణం రాజుతో కలిసి ప్రధాని మోడీని కలిసిన తెలుగు సినీ హీరో ప్రభాస్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారా అనే చర్చ సాగుతోంది. ప్రభాస్ కారణంగా ఆంధ్రప్రదేశ్ బిజెపిలో కృష్ణం రాజు ప్రాధాన్యం పెరుగుతుందా, ప్రభాస్ నేరుగా బిజెపికి మద్దతుగా ముందుకు వస్తారా అనే ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి.

ప్రభాస్ బాహుబలి చిత్రంతో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ స్తితిలో బిజెపి అగ్రనేతలు ఎల్‌కె అద్వానీ, హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ బాహుబలి చిత్రాన్ని చూసి శభాష్ అన్నారు. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ కూడా ప్రభాస్‌ను కొనియాడారు. ఈ క్రమంలో ప్రభాస్ భారత ప్రధాని నరేంద్ర మోడీని కూడా సినిమా చూడాలని కోరారు. చిత్రాన్ని చూస్తానని చెప్పిన మోడీ ప్రభాస్ నటన గురించి కొందరు నాయకులు చెప్పగా విని అభినందించారు.

Read More: ప్రధాని మోదీ తో 'బాహుబలి'‌: ఆయనేం అన్నారు(ఫొటోలతో)

Meeting with Modi: Prabhas may help BJP in AP

కృష్ణంరాజు ప్రాధాన్యం ప్రభాస్ కారణంగా ఆంధ్రప్రదేశ్ బిజెపిలో పెరిగే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. అయితే, ప్రభాస్ వచ్చే ఎన్నికల నాటికి బిజెపికి మద్దతుగా ముందుకు వస్తారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఇప్పటికే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మోడీకి మద్దతు పలుకుతున్నారు. అయితే, పవన్ కళ్యాణ్‌కు బిజెపికి మద్దతు ఇవ్వడంలో ప్రభాస్ తోడువుతారా అనేది కూడా చర్చనీయాంశంగానే మారింది.

జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగడానికి సిద్ధపడితే పవన్ కళ్యాణ్‌కు కొంత మేరకైనా ప్రభాస్ చెక్ పెడుతారా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగానే మారింది. ప్రభాస్ తన పెదనాన్న కృష్ణంరాజు కోసం పనిచేసే క్రమంలో బిజెపికి కూడా ఉపయోగపడే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

English summary
Baahubali hero Prabhas may help to strengthen BJP in Andhra Pradesh supporting Krishnam Raju.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X