వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ సీఎం జగన్ కు జనసేన నేత మెగాబ్రదర్ నాగబాబు హితవు: ఏం చెప్పారంటే

|
Google Oneindia TeluguNews

జనసేన నాయకుడు, నటుడు, మెగా బ్రదర్ నాగబాబు తాజా సీఎం జగన్ మోహన్ రెడ్డిపై సెటైర్లు వేశారు . సోషల్ మీడియాలో ట్విట్టర్ వేదికగా నాగబాబు ఎన్నికలను పోస్ట్ పోన్ చెయ్యటంపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్లు పెట్టిన ఆయన ఎన్నికల కమీషన్ నిర్ణయానికి మద్దతుగా మాట్లాడారు. కరోనాతో ప్రపంచం భయపడుతుందని ముందు దానిమీద ఫోకస్ పెట్టాలని కోరారు.

ఎస్ఈఓ కి అంతుచిక్కని వైరస్ .. ఇదంతా చంద్రబాబు ఎఫెక్ట్ : మంత్రి సురేష్ ఫైర్ఎస్ఈఓ కి అంతుచిక్కని వైరస్ .. ఇదంతా చంద్రబాబు ఎఫెక్ట్ : మంత్రి సురేష్ ఫైర్

 ఎన్నికల వాయిదా తో జగన్ చేసిన కులాల ప్రస్తావనపై నాగబాబు సెటైర్లు

ఎన్నికల వాయిదా తో జగన్ చేసిన కులాల ప్రస్తావనపై నాగబాబు సెటైర్లు

ఇక ఆయన చేసిన ట్వీట్స్ లో ఎలక్షన్లు వాయిదా వెయ్యటానికి కులాల ప్రస్తావన ఎందుకు,కులాల మీద పగ ఎందుకు అంటూ ప్రశ్నించారు. ఒక పక్క ఇండియన్ గవర్నమెంట్ పబ్లిక్ హెల్త్ విషయం లో హై అలెర్ట్ ప్రకటించింది అంటే అర్థం విషయం చాలా తీవ్రంగా ఉందనే కదా . చాలా తీవ్రంగా ఉంటేనే అలా ప్రకటిస్తారు అన్న నాగబాబు తెలంగాణ లాంటి పక్క రాష్ట్రాల్లోనే కారోన స్ప్రెడ్ కాకుండా పబ్లిక్ మూవ్మెంట్స్ మీద పరిమితులు, ఆంక్షలు పెట్టారు.

మందుల్లేక ప్రపంచ దేశాలు ఏడుస్తుంటే పారాసిటామల్ వేసుకోమంటారా ?

మందుల్లేక ప్రపంచ దేశాలు ఏడుస్తుంటే పారాసిటామల్ వేసుకోమంటారా ?


అలాంటప్పుడు ఎలక్షన్స్ అనేవి పబ్లిక్ తో ముడిపడిన విషయం కాబట్టి ఇలా నిర్ణయం తీసుకోవచ్చు . ఆ మాత్రానికే కులాల ప్రస్తావన తెచ్చి మాట్లాడటం సమంజసం కాదని తన అభిప్రాయం వ్యక్తం చేశారు . ఎన్నికల సమయంలో పబ్లిక్ సమూహాలుగా తిరగటం వంటి సందర్భాలు ఉంటాయి.జనాల ఆరోగ్యంతో ఆడుకోవటం వైసీపీ ప్రభుత్వానికి కరెక్ట్ నా? మందుల్లేక ఏమిచెయ్యలో అన్ని దేశాలు ఏడుస్తుంటే పారాసిటామల్ వేసుకొంటే సరిపోతుందని చెప్పటం బాధ్యతరాహిత్యం కాదా అని మండిపడ్డారు.

వైసీపీ కన్నా మీరే ఎక్కువ బాధ పడుతున్నారని మీడియాపై ఫైర్

వైసీపీ కన్నా మీరే ఎక్కువ బాధ పడుతున్నారని మీడియాపై ఫైర్

ఇక అంతే కాదు కొంత మంది మీడియా వ్యక్తులు కూడా ఈ వాయిదాని వాళ్ల వెబ్ సైట్స్ లో విమర్శిస్తుంటే ఆశ్చర్యపోయాం అన్న నాగబాబు మీరు వైసీపీ ని సమర్ధిస్తే తప్పు లేదు కానీ వైసీపీ కన్నా మీరే ఎక్కువ బాధ పడుతుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు అని పేర్కొన్నారు . లైఫ్ కన్నా ఏది ఎక్కువ కాదు. బాధపడటం మాని తక్షణ చర్యల మీద ఫోకస్ పెట్టండి అని విమర్శలు గుప్పించారు.

Recommended Video

Kanna Lakshmi Narayana Comments On AP CM YS Jagan | Oneindia Telugu
కొన్నిసార్లు పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా రావు భరించాలన్న మెగా బ్రదర్

కొన్నిసార్లు పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా రావు భరించాలన్న మెగా బ్రదర్

ఇక మరో పోస్ట్ లో జనసేన నాయకుడు నాగబాబు సీఎం జగన్ ను ఉద్దేశించి కొన్నిసార్లు పరిస్థితులు అన్నీ మనకు అనుకూలంగా రావు. భరించాలి. ప్రజారోగ్యం ముఖ్యం అని పేర్కొన్నారు. ఫోకస్ ఆన్ ఇట్ అంటూ సలహా ఇచ్చారు . రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థలని విమర్శించటం మాని ప్రజారోగ్యము మీద దృష్టి పెట్టండి అని హితవు చెప్పారు . 151 మంది ఎంఎల్ఏలని ఇచ్చి అధికారం కట్టబెట్టిన ప్రజల సంక్షేమం ముఖ్యం కదా అని పేర్కొన్న ఆయన చివరగా థాంక్స్ సీఎం గారు అని నాగబాబు తనదైన స్టైల్ లో సీఎం జగన్ కు హితోపదేశం చేశారు.

English summary
Sometimes the circumstances are not in our favor, as Janasena leader Nagababu said to CM jagan about local body elections postponement. Mentioned that corona is spreading and the indian government announced high alert , so, public health is important. Focus on It advised nagababu. "We should not criticize constitutional systems," nagababu said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X