వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ గారూ థాంక్స్: టీటీడీ భూముల విక్రయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గడంపై నాగబాబు

|
Google Oneindia TeluguNews

తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి భూముల విక్రయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కి తగ్గడంపై అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. నిన్న
స్వామి పరిపూర్ణానంద.. ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇవాళ మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. టీటీడీ భూముల విక్రయం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడాన్ని అభినందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

టీటీడీ భూముల అమ్మకాన్ని నిలిపివేసిన సీఎం జగన్ గారికి ధన్యవాదాలు అని నాగబాబు ట్వీట్ చేశారు. దీంతోపాటు పింక్ డైమండ్ గరించి ఎంక్వైరీ చేయాలని కోరారు. నిజాలను నిగ్గుతేల్చాలని సీఎం జగన్‌ను కోరారు. థాంక్యూ సీఎం జగన్ గారూ అంటూ క్లుప్తంగా ట్వీట్ చేశారు. నాగబాబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.

mega brother nagababu thanks to cm jagan

ఇటీవల గాడ్సేపై నాగబాబు చేసిన ట్వీట్లు దుమారం రేపిన సంగతి తెలిసిందే. నాథురాం గాడ్సే జయంతి మే 19వ తేదీన నాగబాబు ట్వీట్ చేశారు. నిజమైన దేశభక్తుడు గాడ్సే అని.. గాంధీని చంపితే అపఖ్యాతి పాలవుతానని తెలుసునని.. అయినా తాను అనుకొన్న పనిచేశారని పేర్కొన్నారు. గాడ్సే దేశభక్తుడు అని నాగబాబు అనడంతో దుమారం రేగింది. అయితే తాను గాంధీని తక్కువ చేసి మాట్లాడలేదు అని, గాడ్సే గురించి నెగిటివ్‌గా మాత్రమే ప్రచారం జరుగుతోన్న విషయం మాత్రమే ప్రస్తావించానని నాగబాబు చెప్పడంతో ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పడింది.

English summary
mega brother nagababu thanks to andhra pradesh chief minister jagan mohan reddy on ttd land issue
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X