వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమ్ముడూ ఈ సారి లేదు కుమ్ముడు.. తేల్చేసిన మెగా బ్రదర్

|
Google Oneindia TeluguNews

Recommended Video

Lok Sabha Election 2019 : చిరంజీవి ఎన్నికల ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన మెగా ఫ్యామిలీ | Oneindia Telugu

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవి ప్రచారంలో పాల్గొంటారా లేదా అన్నదానిపై చిరంజీవి కుటుంబం క్లారిటీ ఇచ్చేసింది . ఈ సారి ఎక్కడా విమర్శలకు తావివ్వకుండా చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉండాలనిభావించి ఏ పార్టీ తరపున ప్రచారం చెయ్యనని చెప్పారని అందరికీ తెలుసు. అయినా చిరంజీవి తెలంగాణా లోని చేవెళ్ళ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రావు కోసం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారాని ప్రచారం జోరుగా సాగింది .

ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న చిరంజీవి .. ఎవరి కోసమో తెలుసా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న చిరంజీవి .. ఎవరి కోసమో తెలుసా

తాండూరు ఎమ్మెల్యే ప్రకటనతో చిరు ప్రచారంపై వార్తలు

తాండూరు ఎమ్మెల్యే ప్రకటనతో చిరు ప్రచారంపై వార్తలు

ఇక చిరంజీవి తెలంగాణలో ప్రచారం చేస్తారనే విషయాన్ని తాండూరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 8న కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు చిరంజీవి వికారాబాద్‌ రానున్నారని తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి తెలిపారు. వీరిరువురూ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి తరఫున ప్రచారం చేస్తారని ఆయన పేర్కొనటం ఒకరకంగా రాజకీయ దుమారం రేపింది.

ఏపీ నుండి కాకుండా తెలంగాణా నుండి ప్రచార నిర్ణయం .. చిరంజీవి తీసుకోలేదు

ఏపీ నుండి కాకుండా తెలంగాణా నుండి ప్రచార నిర్ణయం .. చిరంజీవి తీసుకోలేదు

ఎందుకంటే ఏపీ నుండి గెలిచిన, కేంద్ర మంత్రి హోదాలో పని చేసిన చిరంజీవి ఏపీ ముఖం కూడా చూడకుండా , తెలంగాణలో ప్రచారం చెయ్యటం అటు కాంగ్రెస్ నాయకులకు, మరో పక్క సోదరుడి సహకారం ఉంటుంది అని భావించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు షాక్ అని చెప్పాలి . అసలు ఏపీని వదిలేసి తెలంగాణా లో ప్రచారం చెయ్యటం చిరంజీవి తీసుకున్న నిర్ణయం కాదని తెలుస్తుంది.

సైరా సినిమాతో బిజీగా ఉన్నారు .. ప్రచారం చెయ్యరు .. మెగా ఫ్యామిలీ

సైరా సినిమాతో బిజీగా ఉన్నారు .. ప్రచారం చెయ్యరు .. మెగా ఫ్యామిలీ

మెగాస్టార్ చిరంజీవి రానున్న ఎన్నికలకు సంబంధించి, చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కి మద్దతుగా ప్రచారంలో పాల్గొంటాడని, గత కొద్దీ రోజులుగా ప్రచారం జరుగుతున్న ఈ విషయంపై మెగా కుటుంబం ఎట్టకేలకు ఒక క్లారిటీ ఇచ్చేసింది. చిరు ప్రచారంలో పాల్గొంటాడు అని వస్తున్నటువంటి వార్తలన్ని అవాస్తవమని, చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహ రెడ్డి షూటింగ్ లో బిజీగా ఉన్నారని, ఎన్నికలకు మరియు ప్రచారానికి దూరంగా ఉంటారని తెలియజేసింది.

English summary
Former Union Minister and Megastar Chiranjeevi will not campaign for this election . Chiranjeevi will not participate in Telangana in Chevella constituency Congress Konda Visveswarar Reddy's campaign the mega family finalised . and they said that Chiranjeevi busy with Saira movie shooting and he don't want to campaign for any party .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X