• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

యాక్షన్ లోకి తెలుగుచిత్ర పరశ్రమ..!తలసానితో 'మెగా' సమావేశం..!షూటింగ్ అనుమతే ఎజెండా..!

|

హైదరాబాద్ : షూటింగ్ ల పునఃప్రారంభంపై తెలుగుసినీ పరిశ్రమ సమాలోచనలు చేస్తోంది. దాదాపు రెండు నెలలుగా మూతబడ్డ సినీ కార్యకలాపాలను తిరిగి గాడిలో పెట్టేందుకు సినీ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. షూటింగ్ లు లేక అనేక మంది సీని కార్మికులు, ఆర్టిస్టులు జీవనోపాది కోల్పోయి అగమ్యగోచర పరిస్థితిలో కాలం వెళ్ల దీస్తున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా రోజూవారి షూటింగ్ లను నమ్ముకుని జీవనం వెళ్ల దీస్తున్న జూనియర్ ఆర్టిస్టుల పరిస్థితి మాత్రం దయనీయంగా తయారైనట్టు తెలుస్తోంది. అలాంటి సమస్యల అధిగమించాలంటే మళ్లీ సినిమా షూటింగ్ లు ప్రారంభం కావాలి. అందుకోసం సినీ పరిశ్రమలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో సినిమాటో గ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ను సంప్రదించారు సీనిమా ప్రముఖులు.

 మంత్రి తలసానితో ముగిసిన సినీ ప్రముఖుల సమావేశం.. సీఎంతో చర్చించి సమస్య పరిష్కరిస్తానన్న తలసాని..

మంత్రి తలసానితో ముగిసిన సినీ ప్రముఖుల సమావేశం.. సీఎంతో చర్చించి సమస్య పరిష్కరిస్తానన్న తలసాని..

కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాలను నిర్వీర్యం చేసింది. జనజీవన స్రవంతిని పూర్తిగా స్తంభిపజేసింది. లక్షల మంది ప్రజలు జీవనోపాది కోల్పయి దిక్కుతోచని పరిస్థితులను నెట్టుకొచ్చారు. ప్రధానంగా చాలా మంది పేద ప్రజులు అకస్మాత్తుగా ప్రకటించిన లాక్‌డౌన్ వల్ల అనేక ఇబ్బందులో పడిపోయినట్టు తెలుస్తోంది. ఇక సినిమా పరిశ్రమలో పని చేసే వేలాది మంది కార్మికులు జీవనోపాగి కోల్సోయారని, షూటింగ్ లకు అనుమతులిస్తే చాల మందికి జీవనోపాది మెరుగవుతుందని తెలుస్తోంది. అంతే కాకుండా సినిమా హాళ్లతో పాటు మల్టీప్రెక్స్ లు తెరిచే అంశం కూడా సినీ పెద్దలు తలసాని శ్రీనివాస యాదవ్ తో దృష్టికి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.

 లాక్‌డౌన్‌ అమలుతో కుదేలైన పరిశ్రమ.. సమస్యల వలయాల్లో సిని కార్మికులు..

లాక్‌డౌన్‌ అమలుతో కుదేలైన పరిశ్రమ.. సమస్యల వలయాల్లో సిని కార్మికులు..

ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో పోరాటం చేస్తోన్న తరుణంలో కుదేలైన రంగాలన్నీ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న సందర్బాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వైరస్ కట్టడిలో భాగంగా భారత ప్రభుత్వం కూడా కొన్ని సడలింపులతో లాక్‌డౌన్‌ అమలు పరుస్తోంది. ఇప్పటికే నాలుగు పర్యాయాలు లాక్‌డౌన్ పొడిగించింది కేంద్రం. ఈ లాక్‌డౌన్ కారణంగా గత రెండు నెలలుగా సినీ పరిశ్రమలో అన్ని రకాల షూటింగ్స్ ఆగిపోయాయి. ఈ మధ్యనే కొన్ని మార్గదర్శకాల ప్రకారం కొన్నింటికి మినహాయింపులు ఇచ్చింది కేంద్రం. ఐతే కరోనా వైరస్ కారణంగా పలు పరిశ్రమలు తీవ్రంగా నష్టపోయాయి. అందులో చిత్ర పరిశ్రమ కూడా ఉంది. మెగాస్టార్ చిరంజీవి జోక్యంతో జీవనోపాది కోల్పోయిన సినీ కార్మికులకు ఏ కష్టం రాకుండా చూసుకున్నారు. ఇప్పుడు షూటింగ్ లు, పోస్ట్ ప్రొడక్షన్ ప్రారంభమైతే మరికొన్ని కష్టాలు తప్పినట్టే ననే చర్చ జరుగుతోంది.

 షూటింగులకు అనుమతివ్వండి.. తలసానికి విజ్ఞప్తి చేసిన చిరంజీవి బృందం..

షూటింగులకు అనుమతివ్వండి.. తలసానికి విజ్ఞప్తి చేసిన చిరంజీవి బృందం..

తెలుగు సినీ ఇండస్ట్రీపై ఆధారపడి ఎన్నో లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ఇప్పటికే కరోనా కారణంగా థియేటర్స్ అన్నీ మూతపడ్డాయి. మరో రెండు, మూడు నెలల వరకూ తెరుచుకునేందుకు కూడా అవకాశాలు కనిపించడంల లేదు. ఈలోగా చిత్ర పరిశ్రమ కోలుకునేలా షూటింగ్స్ ఎలా ప్రారంభించాలి? థియేటర్స్‌ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? అనే అంశాలపై ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో సినిమా పరిశ్రమ ప్రముఖులు సమావేశమయ్యారు. కరోనా వల్ల సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించే కాకుండా షూటింగ్ లు, సినిమా థియేటర్లు, పోస్ట్ ప్రొడక్షన్ వంటి అంశాల పై సుధీర్ఘ చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

సీఎంతో అన్ని విషయాలు చర్చిస్తా.. సమస్య పరిష్కరిస్తానని తలసాని హామీ..

ఇక సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తో జరిగిన సుధీర్ఘ భేటీలో అనేక అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. షూటింగ్ లు మినహా, సినిమాకు సంబంధించిన పోస్టు ప్రొడక్షన్ వంటి కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు మౌఖింకంగా అనుమతించినట్టు మంత్రి తెలిపారు. షూటింగ్ లు, సినిమా థియేటర్లు, మల్టీ ప్లెక్స్ ల పునఃప్రారంభం అంశం మాత్రం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును సంప్రదించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని మంత్రి తలసాని తెలిపినట్టు తెలుస్తోంది. షూటింగ్ లు లేక, జీవనోపాది కోల్పోయిన సిని కార్మికులు, నటీ నటుల పట్ల మెగాస్టార్ చిరంజీవి చూపిస్తున్న కృతనిశ్చయానికి సినిపెద్దలు హర్షం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.

English summary
How to start shooting for recovery of film industry? What about the theaters? Cinema industry important members along with megastar Chiranjeevi met Minister Talasani Srinivas Yadav today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X