• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జగన్-మెగాస్టార్ కీలక భేటీ: సీఎం అప్పగించిన బాధ్యతలతో..సినీ - పాలిటిక్స్‌లో కొత్త ఈక్వేషన్స్..!

|

ఆంధ్రప్రదేశ్‌లో మరో పెద్ద భేటీకి వేదిక కానుంది. కరోనావైరస్ నేతృత్వంలో ఏపీ ఆర్థి వ్యవస్థ కుదేలైన నేపథ్యంలో ఇక దాన్ని గాడిలో పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే చాలా మంది ప్రముఖలతో పారిశ్రామిక వేత్తలతో సీఎం జగన్ భేటీ అవుతున్నారు. వారి దగ్గర నుంచి సలహాలు సూచనలు స్వీకరిస్తున్నారు. ఇక త్వరలో అమరావతి కేంద్రంగా మరో ఉన్నతమైన సమావేశం జరగనుంది. ఇంతకీ ఆ సమావేశం ఏంటి..? సీఎం జగన్‌ను ఎవరు కలవనున్నారు..?

జగన్‌తో భేటీ కానున్న మెగాస్టార్

జగన్‌తో భేటీ కానున్న మెగాస్టార్

కరోనావైరస్ ఒక్కసారిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేసింది. దీంతో ఆర్థికకార్యకలాపాలు లేక రాష్ట్ర ప్రభుత్వానికి రెవిన్యూ రాక చాలా నష్టపోయింది. ఇక లాక్‌డౌన్‌ను పొడిగిస్తూనే చాలా వరకు సడలింపులిస్తూ జగన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అన్ని దుకాణాలు పరిశ్రమలు తిరిగి తెరుచుకునేందుకు అనుమతి ఇస్తూనే నిబంధనలు అన్నీ పాటించాలని కచ్చితంగా చెప్పింది.

అదే సమయంలో కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను పాటిస్తూ సినిమా షూటింగులకు కూడా జగన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చే యోచన చేస్తున్నట్లు సమాచారం. ఇక సినిమా ఇండస్ట్రీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని సీఎం జగన్ గతంలోనే హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే మెగస్టార్ చిరంజీవి గతేడాది సీఎం జగన్‌ను తాడేపల్లి క్యాంపు కార్యాలయంకు వెళ్లి కలవడం జరిగింది.

రాజకీయ భేటీగా అప్పట్లో టాక్

రాజకీయ భేటీగా అప్పట్లో టాక్

అయితే వైసీపీ చిరంజీవికి రాజ్యసభ సీటు ఆఫర్ చేసిందని అందుకే సీఎం జగన్‌ను మెగాస్టార్ కలవడం జరిగిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ దీనిపై చిరంజీవి కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. సినిమా ఇండస్ట్రీపై చర్చిండం జరిగిందని స్పష్టం చేశారు మెగాస్టార్. ఇక అసలు విషయానికొస్తే త్వరలో చిరంజీవి మరోసారి సీఎం జగన్‌ను కలవనున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఆయనతో పాటు పలువురు సినీ ఇండస్ట్రీ పెద్దలు కూడా జగన్‌తో సమావేశమవుతారని సమాచారం. ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పలు అంశాలను సీఎం జగన్‌తో చర్చిస్తారని ఫిలింనగర్ వర్గాల టాక్.

సీఎం జగన్ భేటీతో చర్చకు రానున్న అంశాలు..

ఇక చిరంజీవి నివాసంలో తెలంగాణ మంత్రి తలసానితో సినీ పెద్దల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలోనే సీఎం జగన్‌తో భేటీ అవనున్నట్లు చెప్పినట్లు సమాచారం. సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ మరోసారి ఆసక్తికరంగా మారనుంది. సీఎం జగన్‌తో చిరంజీవితో పాటు పలువురు సినీ పెద్దలు ఈ వారంలోనే భేటీ కానున్నట్లు సమాచారం.

ఈ సందర్భంగా వారంతా షూటింగ్‌కు అనుమతులు ఇవ్వాలంటే జగన్‌కు విజ్ఞప్తి చేయనున్నారు. అదే సమయంలో పెండింగ్‌లో ఉన్న నంది అవార్డుల విషయం కూడా సీఎం దృష్టికి తీసుకురానున్నట్లు సమాచారం. సినిమా హాళ్ల ఓపెనింగ్, సినీ కార్మికులు, పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సాహకాలపై చర్చించనుట్లు సమాచారం. దీనిపై గతంలో ఒకసారి గుర్తుచేయగా చిరంజీవినే ఆ బాధ్యత తీసుకోవాలని జగన్ సూచించారు. ఇక ఈ వారంలో జరగబోయే తాజా భేటీపై ఇటు సినీ అభిమానులు అటు మెగా అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

 టాలీవుడ్‌లో బయటపడ్డ విబేధాలు

టాలీవుడ్‌లో బయటపడ్డ విబేధాలు

ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో వర్గపోరు ప్రారంభమైంది. కొన్ని నెలల క్రితం ఓ హోటల్ వేదికగా జరిగిన సినీ ఇండస్ట్రీ కార్యక్రమంలో హీరో రాజశేఖర్ అందరూ వేదికపైన ఉండగానే అసంతృప్తి వ్యక్తం చేస్తూ బయటకు వెళ్లిపోవడం జరిగింది. అయితే ఆ సమయంలో చిరంజీవి కూడా రాజశేఖర్ తీరుపై అసహనం వ్యక్తం చేయడం జరిగింది. ఇక అప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలో విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయంటూ సాధారణ సినీ ప్రేక్షకుల్లో ఒక అభిప్రాయం నెలకొంది. సీన్ కట్ చేస్తే సీఎం జగన్‌తో చిరంజీవితో పాటు పలువురు సినీ పెద్దలు ఈ వారంలోనే భేటీ కానున్నట్లు సమాచారం.

English summary
Megastar Chiranjeevi to meet CM Jagan this week if sources are to be believed. Chiranjeevi along with others will meet CM Jagan to discuss industry problems.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X