గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మెగాస్టార్ చిరంజీవికి ఆ కేసులో హైకోర్టులో ఊరట

|
Google Oneindia TeluguNews

ఎప్పుడూ కాంట్రవర్సీలకు పోకుండా తనపని తానూ చేసుకుపోయే మెగాస్టార్ చిరంజీవికి ఆ కేసు తలనొప్పి నుండి కాస్త ఉపశమనం లభించింది. ఇంతకీ ఏ కేసు అంటారా ? గత ఎన్నికల ప్రచారంలో కోడ్ ఉల్లంఘించిన కేసులో ఆయనపై పెట్టిన కేసు తప్పు అని కోర్టు కొట్టేసింది. దీంతో ఆయనకు ఊరట లభించింది. ఎన్నికల నియమావళి ప్రకారం సమయం పూర్తైనా ప్రచారం చేస్తున్నారని నమోదైన కేసును రద్దు చేస్తూ జడ్జీ తీర్పిచ్చారు.

Megastar Chiranjeevi was relieved by the high court in the case

2014 ఏప్రిల్‌ 27న రాత్రి 10గంటలు దాటిన తరువాత కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం చేశారంటూ గతంలో గుంటూరు అరండల్‌పేటలో కేసు నమోదు కాగా ఆ కేసులో చిరంజీవికి ఊరట లభించింది. ఈ విషయంలో పోలీసులు నమోదు చేసిన కేసుని కిందికోర్టు పరిగణనలోకి తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ చిరంజీవి ఉమ్మడి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

రాహుల్ గాంధీకి పదవి దక్కే అవకాశం లేదా: జ్యోతిష్య పండితులు ఏం చెబుతున్నారంటే? రాహుల్ గాంధీకి పదవి దక్కే అవకాశం లేదా: జ్యోతిష్య పండితులు ఏం చెబుతున్నారంటే?

కాగా దీనిపై న్యాయమూర్తి జస్టిస్‌ టి.రజని విచారణ జరిపి, చిరంజీవి ప్రచారం ముగించుకుని తిరిగి వస్తుండగా సమయం దాటినా తర్వాత ప్రచారం చేస్తున్నారని అక్రమంగా కేసు బనాయించారంటూ చిరంజీవి తరుపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి కేసును రద్దు చేస్తూ తీర్పును ఇచ్చారు.

English summary
Chiranjeevi gets relief in the voilation of election code case in high court . Chiranjeevi's advocate appealed to the court saying that the campaign was conducted after completion of the election campaign they filed the case. basing on the arguement The judge, who was prosecuted, dismissed the case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X