మెగాస్టార్ చిరంజీవికి ఆ కేసులో హైకోర్టులో ఊరట
ఎప్పుడూ కాంట్రవర్సీలకు పోకుండా తనపని తానూ చేసుకుపోయే మెగాస్టార్ చిరంజీవికి ఆ కేసు తలనొప్పి నుండి కాస్త ఉపశమనం లభించింది. ఇంతకీ ఏ కేసు అంటారా ? గత ఎన్నికల ప్రచారంలో కోడ్ ఉల్లంఘించిన కేసులో ఆయనపై పెట్టిన కేసు తప్పు అని కోర్టు కొట్టేసింది. దీంతో ఆయనకు ఊరట లభించింది. ఎన్నికల నియమావళి ప్రకారం సమయం పూర్తైనా ప్రచారం చేస్తున్నారని నమోదైన కేసును రద్దు చేస్తూ జడ్జీ తీర్పిచ్చారు.

2014 ఏప్రిల్ 27న రాత్రి 10గంటలు దాటిన తరువాత కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం చేశారంటూ గతంలో గుంటూరు అరండల్‌పేటలో కేసు నమోదు కాగా ఆ కేసులో చిరంజీవికి ఊరట లభించింది. ఈ విషయంలో పోలీసులు నమోదు చేసిన కేసుని కిందికోర్టు పరిగణనలోకి తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ చిరంజీవి ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
రాహుల్ గాంధీకి పదవి దక్కే అవకాశం లేదా: జ్యోతిష్య పండితులు ఏం చెబుతున్నారంటే?
కాగా దీనిపై న్యాయమూర్తి జస్టిస్ టి.రజని విచారణ జరిపి, చిరంజీవి ప్రచారం ముగించుకుని తిరిగి వస్తుండగా సమయం దాటినా తర్వాత ప్రచారం చేస్తున్నారని అక్రమంగా కేసు బనాయించారంటూ చిరంజీవి తరుపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి కేసును రద్దు చేస్తూ తీర్పును ఇచ్చారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!