• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మీడియా వార్తల పట్ల చిరు చికాకు..! ఏమీ లేకున్న ఏంటిది అంటున్న మెగాస్టార్..!

|

హైదరాబాద్ : మెగా స్టార్ చిరంజీవి మీద ఇటీవల మీడియాలో వస్తున్న వార్తలు ఆయన పట్ల ఇబ్బందిగా పరిణమించినట్టు తెలుస్తోంది. రాజకీయాలకు అతీతంగా ఎక్కడనుంచి ఎదిగారో మళ్లీ అక్కడికే వెళ్లి తన పని తాను చేసుకుంటున్నప్పటికి వార్తా చానళ్లు, సోషల్ మీడియిలో తారా స్తాయిలో ప్రచారం రావడాన్ని మెగాస్టార్ ఖండించకపోయినా ఆయనను ఇరుకున పెట్టే అంశాలుగా మారాయి. ఏమీ లేకున్నా తాను బీజేపిలోకి వెళ్తున్నట్టు, బీజేపి అదిష్టానం తనను ఆహ్వానిస్తున్నట్టు వార్తలు షికార్లు చేయడం చిరంజీవిని అసహనానికి గురిచేస్తున్నట్టు సమాచారం. దీంతో సైరా షూటింగ్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఇలాంటి వార్తలకు చెప్పే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

  ఎన్నికల్లో ఓటమి తో బాబు పతనం ప్రారంభం
  రాజకీయాలు దూరం..! మీడియా కధనాల పట్ల చిరు చిరాకు..!!

  రాజకీయాలు దూరం..! మీడియా కధనాల పట్ల చిరు చిరాకు..!!

  రాజ‌కీయాల‌కు దూర‌మ‌య్యాడు.. వివాదాల‌కు అతీతంగా ఉంటున్నాడు. తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి దాస‌రి మ‌ర‌ణం త‌రువాత పెద్ద‌త‌ల‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎవ‌రికే అవ‌స‌రం వ‌చ్చినా స్పందిస్తున్నారు. చిన్న సినిమాల ఫంక్ష‌న్ల‌కు ఆహ్వానం అంద‌గానే వెళ్లి ప్రోత్స‌హిస్తున్నారు. అయినా.. ఆయ‌న చుట్టూ నిత్యం వివాదాలు. ఎన్ని దానాలు.. గుప్త‌దానాలు చేసినా స్పందించ‌ని మీడియా కూడా చిరు పై చిన్న‌పాటి ఆరోప‌ణ‌లు రాగానే దాన్ని భూతద్దంలో చూపుతున్నాయంటూ మెగా అభిమానులు ఆవేద‌న చెందుతున్నారు.

  సినిమాలతో బిజీ గా ఉన్న మెగాస్టార్..! రాబోవు రెండేళ్లూ అంతే బిజీ..!!

  సినిమాలతో బిజీ గా ఉన్న మెగాస్టార్..! రాబోవు రెండేళ్లూ అంతే బిజీ..!!

  పీఆర్‌పీ ని కాంగ్రెస్‌లో విలీనం చేయ‌టం. త‌రువాత కేంద్ర మంత్రిగా మూడేళ్లు ప‌నిచేయ‌టం ఇవ‌న్నీ ఆయ‌న ప‌రిణితిని చాటినా పార్టీని తాక‌ట్టుపెట్టార‌నే అప‌వాదును త‌ప్పించ‌లేక‌పోయాయి. అదే స‌మ‌యంలో జ‌న‌సేన‌తో ప‌వ‌న్‌పై కూడా దాని ప్ర‌భావం ప‌డింది. దాని ఫ‌లిత‌మే.. మొన్న‌టి ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం అంటూ విశ్లేష‌ణ‌లు వచ్చాయి. ఈ నేప‌థ్యంలోనే చిరు బీజేపీలోకి చేర‌తారంటూ ప్ర‌చారం జ‌రిగింది. సైరా సినిమా త‌రువాత కొర‌టాలతో చిరు 152వ సినిమాకు రెడీ అవుతున్నారు. దానికోసం ఈ మ‌ధ్య క‌స‌ర‌త్తులు చేసి కాస్త స్లిమ్ అయ్యారు కూడా.

  రాజకీయాలకు సమయం లేదు..!రెచ్చగొడితే రెచ్చిపోయేది లేదంటున్న అన్నయ్య..!!

  రాజకీయాలకు సమయం లేదు..!రెచ్చగొడితే రెచ్చిపోయేది లేదంటున్న అన్నయ్య..!!

  తాజాగా సైరా న‌ర‌సింహారెడ్డి బంధువులు.. మెగా ఆఫీసు వ‌ద్ద ఆందోళ‌న చేయ‌టం మెగాస్టార్‌కు కోపం తెప్పించింద‌ట‌. మేనేజ‌ర్‌పై ఆరోప‌ణ‌లు చేస్తూ.. త‌మ‌కు ఎటువంటి న్యాయం చేయ‌కుండానే త‌మ క‌థ‌ను వాడుకుంటున్నారంటూ ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి బంధువుల ఆవేద‌న‌. దీనితో చిరు, చ‌ర‌ణ్‌ల‌కు ప్ర‌మేయం లేదంటూనే.. త‌మ‌ను మోసం చేశారంటూ వారు ఆరోపించారు. సైరా ప్రారంభం నాటి నుంచి చిరు చాలాసార్లు చికాకులు చ‌విచూస్తూనే ఉన్నార‌ట‌.

  కష్టాలు తెస్తున్న సైరా..! అదిగమిస్తామంటున్న చిరంజీవి..!!

  కష్టాలు తెస్తున్న సైరా..! అదిగమిస్తామంటున్న చిరంజీవి..!!

  శేరిలింగ‌ప‌ల్లిలో సెట్ వేశాక అధికారులు వ‌చ్చి అనుమ‌తి లేదంటూ ఖాళీ చేయించారు. మ‌రోసారి సెట్‌లో అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. మ‌రో సారి సినిమాలో సీన్‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయంటూ పుకార్లు.. చివ‌ర్లో.. అమితాబ్‌, అనుష్క‌ల‌ను అలిగారంటూ పుకార్లు.. వెర‌సి.. సినిమా విడుద‌ల‌కు ముందు ఏకంగా బంధుగ‌ణం ధ‌ర్నాలు.. వెర‌సి చిరు ఇష్ట‌మైన ఉయ్యాల‌వాడ జీవితాన్ని తెర‌కెక్కించే స‌మ‌యంలో ఇవ‌న్నీ ఆయ‌న‌ను మ‌రింత క‌ల‌త‌కు గురిచేస్తున్నాయ‌ట‌. త‌ప్పెవ‌రు చేసినా.. పేరు మాత్రం మెగాస్టార్‌కే రావ‌టం ఫ్యాన్స్‌ను కాస్త ఇబ్బందికి గురిచేస్తోంద‌ట‌. దీన్ని ఎలాగైనా సొమ్ము చేసుకునేందుకు సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌ర్థులు విష‌ప్ర‌చారం చేస్తున్నారు.

  English summary
  The recent media coverage of the mega star Chiranjeevi seems to be embarrassing to him. The news channels and the publicity on social media have been the subject of irony even though Megastar does not condemn the publicity of his work as he is doing his job again and again.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X