వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూటర్న్ అంకుల్! ఆధారాలున్నాయా?: చంద్రబాబు విశాఖ పర్యటనపై మంత్రి, ఎంపీ సెటైర్లు

|
Google Oneindia TeluguNews

అమరావతి: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు విశాఖపట్నం పర్యటనపై హోంమంత్రి మేకతోటి సుచరిత, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. చంద్రబాబు విశాఖలో పర్యటిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సుచరిత అన్నారు. విశాఖ వెళ్ళి అక్కడ ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించేందుకు ఏపీ డీజీపీకి లేఖ రాసిన నేపథ్యంలో హోంమంత్రి సుచరిత స్పందించారు.

తగిన ఆధారాలుంటే చంద్రబాబు పర్యటనకు ఓకే..

తగిన ఆధారాలుంటే చంద్రబాబు పర్యటనకు ఓకే..

చంద్రబాబు ఏపీ డీజీపీకి ఎప్పుడు లేఖ రాశారు? డీజీపీకి దరఖాస్తు చేస్తే తగిన ఆధారాలు చూపించాలని సుచరిత అన్నారు. ఏపీలో దరఖాస్తు చేయకుండా చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారని గుర్తు చేశారు. చంద్రబాబు దరఖాస్తు చేస్తే అనుమతి ఇస్తాం.. ఇందులో ఎలాంటి వివాదం లేదని మంత్రి స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు శైలజానాథ్‌లు విశాఖ బాధితులను పరామర్శించారని, వారిని ఎవరూ అడ్డుకోలేదని తెలిపారు.

చంద్రబాబూ.. అప్పుడలా? ఇప్పుడిలానా?

చంద్రబాబూ.. అప్పుడలా? ఇప్పుడిలానా?

ఈ సందర్భంగా చంద్రబాబుపై మంత్రి సుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నిరర్ధక ఆస్తుల విక్రయం జీవోను 2016లోనే తీసుకొచ్చారని, ఏ సంస్థ నిరర్ధక ఆస్తులను ఆ సంస్థ అభివృద్ధికే వినియోగించడంలో తప్పేంటి? అని ప్రశ్నించారు. వనజాక్షి, పుష్కరాల తొక్కిసలాట, రిషితేశ్వరి ఘటనలపై సీబీఐ విచారణ ఎందుకు జరిపించలేదని నిలదీశారు. సీబీఐ రాష్ట్రానికి రాకుండా అడ్డుకుంది ఎవరు? అని సుచరిత ప్రశ్నించారు. ఇప్పుడు ప్రతిదానికి సీబీఐ విచారణ అడుగుతున్నారు. డాక్టర్ సుధాకర్ కేసును సీబీఐతో విచారణ జరిపేందుకు ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. తమ ప్రభుత్వమే అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుందని మంత్రి సుచరిత తెలిపారు.

చిత్తుగా ఓడాకా ఫ్రస్ట్రేషన్...

చిత్తుగా ఓడాకా ఫ్రస్ట్రేషన్...


‘చిత్తుగా ఓడాక ఫ్రస్ట్రేషన్ పెరిగి మెంటల్ కండిషన్ సీరియస్ అయి ఉండొచ్చుకాని రెండు మూడేళ్ల క్రితమే పిచ్చి ముదిరింది. అప్పటి మాటలు అలాగే ఉన్నాయి. బావుల అనుసంధానం చేస్తానని అంటే, ఎల్లో మీడియా ‘విజనరీ' వాక్కులకు ఒక రేంజిలో ఎలివేషన్ ఇచ్చి అచ్చేసింది' అంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు.

Recommended Video

Electricity Department Clarification On Current Bill Issue
యూటర్న్ అంకుల్! అంటూ..

యూటర్న్ అంకుల్! అంటూ..


అంతేగాక, ‘యూ టర్న్ అంకుల్... విశాఖకు పర్మిషన్ కేంద్రాన్ని అడిగారు కదా.. వారేమన్నారో చెప్పండి..మీబోటి అంతర్జాతీయ నాయకులు అంతలోనే యూ టర్న్ తీసుకుని మా రాష్ట్ర డీజీపీని పర్మిషన్ అడగటం ఏమిటి చెప్పండి?' అంటూ విజయసాయి రెడ్డి చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

English summary
ap home minister mekathoti sucharitha and MP vijaya sai response on chandrababu to visit vizag.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X