గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అది నచ్చడం లేదు, అందుకే పెయిడ్ ఆర్టిస్టులతో శిబిరాలు: చంద్రబాబుపై సుచరిత ఫైర్

|
Google Oneindia TeluguNews

అమరావతి: మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమ ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం ఎంతో ప్రశాంతంగా ఉందని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలేమీ లేవని ఆమె అన్నారు. రాజకీయ కేసులన్నీ జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో సమీక్ష చేస్తామని చెప్పారు.

జీవ వైవిధ్యాన్ని దెబ్బతీయొద్దు: వీహెచ్ తో కలిసి పవన్ కళ్యాణ్ ప్రెస్‌మీట్, ఏం చెప్పారంటే..?జీవ వైవిధ్యాన్ని దెబ్బతీయొద్దు: వీహెచ్ తో కలిసి పవన్ కళ్యాణ్ ప్రెస్‌మీట్, ఏం చెప్పారంటే..?

చంద్రబాబుకు నచ్చడం లేదు..

చంద్రబాబుకు నచ్చడం లేదు..

సచివాలయంలో డీజీపీ సవాంగ్‌తో కలిసి సుచరిత మీడియాతో మాట్లాడుతూ.. ఎస్పీ కార్యాలయంలో ప్రతీ సోమవారం స్పందన కార్యక్రమం జరుగుతుందని, ఫిర్యాదులకు 15 రోజుల్లో పరిష్కారం చూపించాలని సీఎం ఆదేశించారని చెప్పారు. ఎన్నికల అనంతరం 46మందిపై రౌడీషీట్లు, 36మందిపై సస్పెక్ట్ షీట్లు నమోదు చేశామని తెలిపిన సుచరిత.. రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించినట్లు చెప్పారు. రైతులు వ్యవసాయ పనుల్లో, నిరుద్యోగులు పోటీ పరీక్షలు రాస్తూ రాష్ట్రమంతా ప్రశాంతంగా ఉంటే.. చంద్రబాబుకు నచ్చడం లేదని మండిపడ్డారు. అందుకే పల్నాడులో పెయిడ్ ఆర్టిస్టులతో శిబిరాలు పెడుతూ ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నారని ధ్వజమెత్తారు. గ్రామాల్లో ఉండలేని పరిస్థితులు కల్పించారంటూ టీడీపీ నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారంటూ హోంమంత్రి ఆరోపించారు.

బాబు హయాంలో ఎన్నో దారుణాలు..

బాబు హయాంలో ఎన్నో దారుణాలు..


201-19 వరకు రాష్ట్రంలో రాక్షస పాలన జరిగిందని సుచరిత విమర్శించారు. టీడీపీ నేత యరపతినేని అక్రమ మైనింగ్ గురించి ఫిర్యాదు చేసినందుకు గురువాచారి అనే వ్యక్తిని టీడీపీ పాలనలో దారుణంగా హింసించారని అన్నారు. ఇలాంటి ఘటనలు టీడీపీ పాలనలో అనేకం జరిగాయన్నారు. పల్నాడు ప్రశాంతంగా ఉందని.. ఆ ప్రశాంతతను దెబ్బతీసేలా వ్యవహరించొద్దని రాజకీయ పార్టీల నేతలకు హోంమంత్రి సుచించారు.

చంద్రబాబు నేతలు ఇలానా?

చంద్రబాబు నేతలు ఇలానా?

చంద్రబాబు లాంటి సీనియర్ టీడీపీ నేతలు పోలీసు వ్యవస్థను చిన్నబుచ్చుకునేలా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేయడం తగదని సూచించారు. గురజాల చాలా ప్రశాంతంగా ఉందని, నిజమైన బాధితులకు అండగా ఉంటామని అన్నారు. టీడీపీ తలపెట్టిన ‘చలో ఆత్మకూరు' కార్యక్రమానికి పోలీసుల అనుమతి లేదని చెప్పిన హోమంత్రి.. అనుమతి ఇవ్వాలని కోరితే పరిశీలిస్తామని అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం ఎవరు కలిగించాన ఉపేక్షించవద్దని సీఎం జగన్ చెప్పారని తెలిపారు. పల్నాడులో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని, 144 సెక్షన్ విధించామని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు.

English summary
Andhra Pradesh Home minister Mekatoti Sucharitha digs at TDP president chandrababu's comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X