వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు ఆదేశం: టీలో మెట్రో ఎక్కిన శ్రీధరన్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మెట్రో గరువుగా పిలవబడే ఢిల్లీ మెట్రో మాజీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఇ శ్రీధరన్ సోమవారం హైదరాబాద్ మెట్రో రైలెక్కారు.

గతంలో హైదరాబాద్ మెట్రోరైలుపై ఎన్నో అభ్యంతరాలను వ్యక్తం చేసిన ఆయన సోమవారం నగరంలోని ఉప్పల్ యార్డు ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న మెట్రో పనులను పరిశీలించినానంతరం మెట్రో మేనేజింగ్ డైరెక్టర్ డా ఎన్వీఎస్‌రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు.

అంతేగాక, ఇప్పటికే టెస్ట్ రన్ కోసం నాగోల్, ఉప్పల్‌ల మధ్య పరుగులు తీస్తున్న మెట్రో కోచ్ ఎక్కిన ఆయన మెట్రో కోచ్ లోపల ప్రయాణికులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు.

 మెట్రో రైలు

మెట్రో రైలు

శ్రీధరన్ సమక్షంలో మరోసారి నాగోల్ నుంచి సర్వే ఆఫ్ ఇండియా స్టేషన్ వరకు అధికారులు టెస్ట్న్ నిర్వహించారు. ముఖ్యంగా పనుల్లో నాణ్యత, డిజైనింగ్‌లను ప్రత్యేకంగా ఆయన పరిశీలించారు.

 మెట్రో రైలు

మెట్రో రైలు

ఎంతో ఉన్నతమైన, అంతర్జాతీయ ప్రమాణాలతో ఉప్పల్ యార్డును నిర్మించినట్లు మెట్రో ఎండి ఎన్వీఎస్‌ రెడ్డి ఆయనకు ఈ సందర్భంగా వివరించారు.

 మెట్రో రైలు

మెట్రో రైలు

మెట్రో స్టేషన్ల డిజైనింగ్‌లో కూడా ఇంజనీర్ల ప్రతిభ అసాధారణమైందని ప్రశంసించారు. ఈ సందర్భంగా శ్రీధరన్ పాల్గొన్నందుకు ఎన్వీఎస్‌రెడ్డి ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

 మెట్రో రైలు

మెట్రో రైలు

కాగా, ఆంధ్రప్రదేశ్‌లో రెండు మెట్రో రైళ్ల ప్రాజెక్టులను రాబోయే మూడున్నర ఏళ్లలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

 మెట్రో రైలు

మెట్రో రైలు

విశాఖ, వీజీటీఎం పరిధిలో చేపట్టిన ఈ రెండు మెట్రో రైలు ప్రాజెక్టుల నిర్మాణాల బాద్యతలను ఢిల్లీ మెట్రో రైలు కార్పోరేషన్‌కు అప్పగించారు.

 మెట్రో రైలు

మెట్రో రైలు

సోమవారం అసెంబ్లీలోని తన కార్యాలయంలో సీఎం చంద్రబాబు ఢిల్లీ మెట్రో రూపశిల్పి శ్రీధరన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో మెట్రో రైలు ప్రాజెక్టుల నిర్మాణానికి సలహాదారుగా ఉండాల్సిందిగా శ్రీధరన్‌ను కోరగ.. ఆయన దానికి అంగీకరించారు.

 మెట్రో రైలు

మెట్రో రైలు

మెట్రో ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి వెంటనే కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని శ్రీధరన్‌ను సీఎం కోరారు. మూడున్నర ఏళ్లలో రెండు మెట్రో ప్రాజెక్టులను పూర్తి చేసే అంశంపై ఇరువురు చర్చించారు. ఢిల్లీ మెట్రో తరహాలోనే ఏపీ మెట్రో రైలు ప్రాజెక్టులను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పూర్తి చేయాలని సీఎం ఆకాంక్షించారు.

 మెట్రో రైలు

మెట్రో రైలు

రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలను అందిస్తామన్నారు. విశాఖ, విజయవాడలతో పాటు తిరుపతి నగరంలో కూడా మెట్రో రైలు ప్రాజెక్టు రూపకల్పన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

English summary
The Andhra Pradesh government has assigned the construction of the two Metro Rail projects at Visakhapatnam and Vijayawada-Guntur, Tenali-Mangalagiri to Delhi Metro Rail Corporation. The DMRC principal advisor E. Sreedharan has been appointed as the adviser to AP government on the Metro Rail projects.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X