అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు అంగీకారం: ఏపీలో ‘మియర్ బర్గర్’ పెట్టుబడులు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీలో సోలార్ ప్యానెల్ తయారీ సంస్ధను ఏర్పాటు చేసేందుకు మియర్ బర్గర్ కంపెనీ ముందుకొచ్చింది. స్విట్జర్లాండ్‌లోని జ్యురిచ్‌లో ఇన్వెస్టర్ మీట్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా మియర్ బర్గర్ సంస్ధ ప్రతినిధులతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బృందం భేటీ అయింది.

ఈ భేటీలో ఎగుమతి ఆధారిత పరిశ్రమల వైపు మియర్ బర్గర్ ఆసక్తి కనబర్చింది. ఇందులో భాగంగా ఏపీలోని విశాఖపట్నం, రాజమహేంద్రవరం పట్టణాల్లో పెట్టుబడులకు ఆ కంపెనీ ప్రతినిధులు సంసిద్ధత వ్యక్తం చేశారు. తమ ఉత్పత్తుల్లో 50శాతం ఎగుమతి చేసి మిగిలిన 50శాతం ఉత్పత్తులను దేశీయంగా విక్రయిస్తామని కంపెనీ ప్రతిపాదించింది.

Meyar burger power plant in Andhra Pradesh

ఈ ప్రతిపాదనకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అంగీకరించారు. సంస్ధ ఏర్పాటుకు అన్ని విధాలా సహకరిస్తామని మియర్ బర్గర్ కంపెనీ ప్రతినిధులకు చంద్రబాబు భరోసా ఇచ్చారు. కాగా దావోస్‌లో రేపటి (జనవరి 20) నుంచి 23 వరకూ ప్రపంచ ఆర్థిక వేదిక 46వ సదస్సులో చంద్రబాబు బృందం పాల్గొనున్న సంగతి తెలిసిందే.

ఇందు కోసం ఇప్పటికే చంద్రబాబు బృందం స్విట్జర్లాండ్‌కు చేరుకుంది. నాల్గవ పారిశ్రామిక విప్లవం అనే నినాదంతో జరిగే ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల మంత్రులు, దిగ్గజ సంస్థల అధిపతులు హాజరుకానున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురామరాజన్‌తోపాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ సదస్సులో పాల్గొంటున్నారు.

సీఐఐ సదస్సులో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడంతో దావోస్‌ వేదికగా ఆంధ్రప్రదేశ్‌కు మరిన్ని సంస్థలను ఆహ్వానించే దిశగా, బ్రాండ్‌ ఏపీని విశ్వవ్యాప్తం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆయన కీలక ఉపన్యాసం చేయనున్నారు.

English summary
Meyar burger power plant in Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X