వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిజిటల్ ఇండియా: సత్య నాదెళ్ల ఏమన్నారు?, డిజిటల్ ఇండియా ప్రధాన లక్ష్యం? (వీడియో)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ ఇండియా ప్రాజెక్టుపై మైక్రోసాప్ట్ సీఈఓ సత్య నాదెళ్ల హర్షం వ్యక్తం చేశారు. డిజిటల్ ఇండియా ప్రాజెక్టులో మైక్రోసాప్ట్ భాగమైనందుకు సంతోషంగా ఉందన్నారు.

Microsoft CEO Satya Nadella on Digital India

టెక్నాలజీలోని కొత్త ఆవిష్కరణల ద్వారా దేశాన్ని సమూలంగా మార్చే సత్తా డిజిటల్ ఇండియా ప్రాజెక్టు ఉందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భూమిపై ఉన్న ప్రతి ఒక్కరికీ, ప్రతి సంస్ధకు టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలన్నదే మైక్రోసాప్ట్ లక్ష్యమని ఆయన తెలిపారు.

రూరల్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, దేశంలో ప్రతిఒక్కరికీ అందుబాటులోకి డిజిటల్ క్లౌడ్ సర్వీసుల వంటి కార్యక్రమాలకు మైక్రోసాప్ట్ మద్దతు ఉంటుందని సత్య నాదెళ్ల తన ప్రకటనలో పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా ప్రాజెక్టు సందర్భంగా ప్రధాని మోడీ, ఐటీ శాఖ మంత్రితో పాటు దేశంలోని పౌరులకు తన శుభాకాంక్షలు తెలియజేశారు.

Satya Nadella on the launch of Digital India

Watch Microsoft CEO Satya Nadella talk about the launch of Digital India & how Microsoft plans to help #empower & #accelerate India #DigitalIndiaDiaries

Posted by Microsoft on Wednesday, July 1, 2015

డిజిటల్ ఇండియా అంటే ఏమిటి?

భారతదేశంలోని పౌరులందరికీ ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్‌ రంగాల్లోని విప్లవాన్ని ప్రజలకు చేరువచేయడం, ప్రభుత్వ పాలనను డిజిటల్‌ ఇన్‌ఫ్రాను ద్వారా ప్రజలు వినియోగించుకునే వెసులుబాటు కల్పించడమే డిజిటల్ ఇండియా ప్రధాన లక్ష్యం. ఇలా చేయడం వల్ల మొత్తం ప్రభుత్వ వ్యవహారాలన్నీ పారదర్శకతతో జరుగుతాయి.

Digital India

దీంతో పాటు బ్రాడ్‌బాండ్‌, హైవేస్‌ అభివృద్ధి, అందరికీ మొబైల్‌ కనెక్టివిటీ అందుబాటులోకి తీసుకురావడం, పబ్లిక్‌ ఇంటర్నెట్‌ యాక్సెస్‌ ప్రోగ్రామ్‌, టెక్నాలజీని వినియోగించి పాలనా రంగాన్ని ప్రక్షాళన చేయడం ద్వారా ప్రజలకు అందుబాటులోకి తేవడం లాంటివి.

English summary
Microsoft is proud to be a part of Digital India launch and believe that technology can uniquely support the government's initiatives in key areas including: rural internet connectivity, digital cloud services for all it's citizens, and communications and productivity services for the Government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X