వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ‌న్ హామీ విస్మ‌ర‌ణ‌..నిర‌స‌న‌: రోడ్డెక్కిన మ‌హిళా కార్మికుల అరెస్టు: ఉద్య‌మం దిశ‌గా అడుగులు..!

|
Google Oneindia TeluguNews

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ తాను మాట ఇస్తే త‌ప్ప‌న‌ని చెబుతారు. కానీ, త‌మ‌కు ఇచ్చిన హామీని విస్మ‌రించారంటూ ఆందోళ‌న కు దిగారు మ‌ధ్నాహ్న భోజ‌న కార్మికులు. మధ్యహ్న భోజన పథకాన్ని స్వచ్ఛంద సంస్థలకు అప్పగించ వద్దంటూ మ హిళా కార్మికులు విజ‌య‌వాడ‌లో ఆందోళ‌న‌కు దిగారు. ఆ త‌రువాత ఛ‌లో అసెంబ్లీకి బ‌య‌ల్దేరారు. వారిని వెంట‌నే పోలీ సులు అరెస్ట్ చేసారు. నాలుగు నెలలుగా మధ్యాహ్న భోజన పథకం కార్మికుల ఇవ్వాల్సిన గౌరవ వేతనం ప్రభుత్వం ఇవ్వటం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసారు. ముఖ్య‌మంత్రి సానుకూలంగా స్పందించ‌కుంటే ఆందోళ‌న త‌ప్ప‌ద‌న్నారు.

Recommended Video

5 వేల కోట్ల సాయానికి వరల్డ్ బ్యాంకు రెడీ - బుగ్గన
Mid day meals workers protest in Vijayawada and call for Chalo Assembly on demanding to clear arrears

మ‌ధ్నాహ్న భోజ‌న కార్మికుల ఆందోళ‌న‌..
పాద‌యాత్ర స‌మ‌యంలో త‌మ‌కు ఇచ్చిన హామీకి భిన్నంగా ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆరోపిస్తూ మ‌ధ్యాహ్న భోజ‌న కార్మికులు ఆందోళ‌న బాట ప‌ట్టారు. తొలుత ఛ‌లో విజ‌య‌వాడకు పిలుపు ఇవ్వ‌టంతో పెద్ద ఎత్తున కార్మికులు విజ‌య‌వా డ కు చేరుకున్నారు. మ‌ధ్నాహ్న భోజ‌న ప‌ధ‌కాన్ని స్వ‌చ్చంద సంస్థ‌ల‌కు అప్ప‌గించ‌వ‌ద్దంటూ నినిదించారు. స‌దస్సు త‌రువాత ఛ‌లో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. దీంతో..పోలీసులు బ‌లంతంగా కార్మికుల‌ను అరెస్ట్ చేసారు. నాలుగు నెల లుగా మ‌ధ్నాహ్న భోజ‌న ప‌ధ‌కం కార్మికుల‌కు ఇవ్వాల్సిన గౌర‌వ వేత‌నం ఇవ్వ‌టం లేద‌ని కార్మికులు ఆవేద‌న వ్య‌క్తం చేసారు. ఇదే అంశం పైన ప్ర‌శ్నిస్తే అసెంబ్లీలో మంత్రి సైతం స‌రిగ్గా స‌మాధానం చెప్ప‌లేద‌ని విమ‌ర్శించారు. పెరిగిన ఛార్జీల‌కు అనుగుణంగా మెనూ ఛార్జీలు ఎప్ప‌టిక‌ప్పుడు పెంచాల‌ని డిమాండ్ చేసారు.

Mid day meals workers protest in Vijayawada and call for Chalo Assembly on demanding to clear arrears

అక్ష‌య పాత్ర నిర్ణ‌యాన్ని విర‌మించుకోవాలి..
ఏపీలో ప్ర‌భుత్వం మారిన త‌రువాత ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ధ్నాహ్న భోజ‌న కార్య‌క్ర‌మం అమ‌లు చేస్తున్న వారి స్థానంలో కొత్త గా అక్ష‌య పాత్ర ద్వారా ఈ ప‌ధ‌కాన్ఇన అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించారు. దీనికి వ్య‌తిరేంగా మ‌ధ్నాహ్న భోజ‌న కార్మిక సంఘాలు ఆందోళ‌న‌కు దిగాయి. అక్షయ పాత్ర ద్వారా మధ్యాహ్న భోజన పథకం పిల్లలకు ఇవ్వటాన్ని మత ప్రచారం గా భావించాల్సిన పరిస్థితి ఉందని ఆరోపించారు.

Mid day meals workers protest in Vijayawada and call for Chalo Assembly on demanding to clear arrears

పిల్లలు అక్షయ పాత్ర ద్వారా ఇస్తున్న భోజనాన్ని తినటం లేదని సంఘ నేత‌లు వివ‌రించారు.విద్యార్థుల అలవాట్లకు అనుగుణంగా అప్పటికప్పుడు వండి పెట్టే విధంగా ఈ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేసారు.లేదంటే ఉధ్యమాన్ని మరింత తివ్రతరం చేస్తామ‌ని హెచ్చ‌రించారు.

English summary
Mid day meals workers protest in Vijayawada and call for Chalo Assembly on demanding to clear arrears and to continue the in this scheme. Police arrest and sent back.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X