వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"మిద్దె తోట"...అందరికి మేలు బాట...ఎలాగంటే...

|
Google Oneindia TeluguNews

పచ్చని పంటపొలాలను చూసినా...ఆకుపచ్చని ఆకుకూరలతోటలు కనిపించినా...రంగురంగుల పండ్లవనాలు కంటబడినా...స్పందించని మనిషి ఉండడు...అలాంటి ఆకుపచ్చని వనాలను చూడగానే పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిలా వెంటుంటే భూలోకమె ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు అని పాడుకోవాలనిపించడం సహజం...

అయితే ఇదంతా పల్లెల్లోనే సాధ్యం అనేది నిన్నటి వరకూ వినబడే మాట. కానీ ఇప్పుడు పట్టణాల్లోని కొన్ని బాల్కనీల్లో పెరుగుతున్న మిద్దె తోటలను చూస్తే ఆ మాట కాదు అసలు నోటివెంబడి మాటేరాదు...ఎందుకంటే...ఇప్పుడు పట్టణాల్లోని అనేక రూఫ్ లు పచ్చని మొక్కలతో కళకళలాడుతున్నాయి. టెర్రస్ ఫార్మింగ్ పేరుతో ఇంటిమీదే అన్ని పంటల సాగు చేసేస్తున్నారు. అంతేనా రసాయనిక అవశేషాలు లేని ఆకుకూరలు, కాయలు, పండ్లు పండిస్తూ ఆరోగ్యంగా జీవించేస్తున్నారు. అలాంటి పట్టణ ప్రకృతి సేద్యకారుల్లో అగ్రగణ్యులు ప్రముఖ రచయిత
తుమ్మేటి రఘోత్తమరెడ్డి అని నిస్సందేహంగా చెప్పొచ్చు...ఎలాగంటారా?...

 మిద్దె తోట...ఆకుపచ్చని లోకం...

మిద్దె తోట...ఆకుపచ్చని లోకం...

ఒక్కో మెట్టు ఎక్కుతూ మొదటి అంతస్తులోకి చేరుకోగానే అక్కడ అకుపచ్చనిలోకం పలుకరించింది. అదొక చిట్టి వనం. రూఫ్‌ గార్డెన్‌! అందులోనే కూరగాయల పెరడు. పందిళ్లకు పాకిన రకరకాల పాదులు. అక్కడక్కడ పూల మొక్కలు. ఏపుగా పెరిగిన పళ్ల చెట్లు. మధ్యమధ్యలో ఆకుకూరల మడులు. ఒక్క మాటలో చెప్పాలంటే అదొక అందమైన పార్క్‌. చెట్ల మధ్య కూర్చోవడానికి వీలుగా చిన్న ఏర్పాటు. ఆకర్షణ కోసం పెట్టిన టెర్రకోట బొమ్మల కొలువులు. చూపు ఎటు తిప్పినా చిత్రవర్ణాల కూర్పులు!...ఘోత్తమరెడ్డిగారి రూఫ్‌గార్డెన్‌లో జామ, పంపరపనస, బొప్పాయి, సపోటా, సీతాఫలం, బత్తాయి, దానిమ్మ, నిమ్మ వంటి చెట్లను చూస్తే చకితులమైపోతాం. ఆకాశపు నిచ్చెనమెట్లు ఎక్కినట్టుగా కొన్ని చెట్లు నిటారుగా ఎదిగిపోయాయి. నేల విడిచి చేసే సాగులో ఇదెలా సాధ్యమని ప్రశ్నిస్తే ఆయన చిరునవ్వే సమాధానం...ఇది ప్రముఖ రచయిత...సేంద్రియ ‘మిద్దె తోట'ల నిపుణుడు తుమ్మేటి రఘోత్తమరెడ్డి...ఇంటిని ఆయన మిద్దె తోటని చూశాక మరో ప్రముఖ రచయిత ఒమ్మి రమేష్ బాబు స్పందన...

 మిద్దెతోట...ఆరోగ్య ప్రదాయని

మిద్దెతోట...ఆరోగ్య ప్రదాయని

163 గజాల ఇంటి పైకప్పు పైన ఈ ఏడేళ్లలో 25 క్వింటాళ్లకు పైగా కూరగాయల ఉత్పత్తిని సాధించారు తుమ్మేటి రఘోత్తమరెడ్డి...అంటే సగటున రోజుకి కిలో కూరగాయలన్నమాట. ఈ దిగుబడిలో ఇంకా పండ్ల లెక్క కలపలేదు. అన్నింటినీ మించి ఏడేళ్లుగా ఆయన మార్కెట్‌లో కూరగాయలు కొనలేదు. ఇంటికి కావాల్సిన 75 శాతంకు పైగా పండ్ల అవసరాలను మిద్దెతోట సాగుతోనే ఆయన సాధిస్తున్నారు. మిద్దెతోట వల్ల శరీరానికి వచ్చే వ్యాయామం, ఇంటికి చల్లదనం, పురుగు మందులు లేని ఆహారం, ఇరుగుపొరుగుతో ఇచ్చిపుచ్చుకోవడం, మనుషుల్లో పెరిగే సృజనాత్మకత వంటి అనేక ప్రయోజనాలున్నాయంటున్నారు రఘోత్తమ్‌.

ఇటీవలే మార్కెట్లోకి...

ఇటీవలే మార్కెట్లోకి..."మిద్దెతోట"

ఏడేళ్లుగా మిద్దెతోట పెంచుతూ అద్భుతాలు చేస్తున్నారు ప్రముఖ రచయిత తుమ్మేటి రఘోత్తమరెడ్డి. కూరగాయలు, ఆకుకూరలు, పూలు, పండ్ల మొక్కల మిద్దెతోట సేద్యం చేస్తూ 478 రోజుల పాటు తన ఫేస్‌బుక్‌పై ఏ రోజుకారోజు మిద్దెతోట సాగు, నిర్వహణల గురించి వివరంగా రాశారు రఘోత్తమ్‌. గత ఏడేళ్లలో వెయ్యి మందికి పైగా సందర్శకులు వచ్చి రఘోత్తమ్‌ మిద్దెతోటను చూసి ప్రేరణ పొందారు. ఆయన మిద్దెతోటను గురించిన దాదాపు 50 వీడియో ఫిల్మ్‌లు యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ అనుభవాల అన్నింటి కలబోతతో ఆయన రచించిన
‘మిద్దెతోట' పుస్తకం ఇటీవలే మార్కెట్‌లోకి వచ్చింది. తెలుగురాష్ట్రాల ప్రజల్లో మిద్దెతోటల పెంపకంపై నానాటికీ పెరుగుతున్నఆసక్తికి అనుగుణంగా వారి సందేహాలకు సమాధానంగా ఈ ‘మిద్దెతోట' ఎంతో ఉపకరిస్తుంది.

 ‘మిద్దెతోట'...ఎందుకంటే...

‘మిద్దెతోట'...ఎందుకంటే...

ఏ నగరంలోనైనా వేల ఎకరాల మిద్దె ఉంటుంది...ఈనాడు గ్రామాల్లో కూడా మిద్దె విస్తీర్ణం తక్కువేమీ కాదు. మరి ఈ మిద్దెలన్నీ పచ్చగా మారితే...ఇంటికి అవసరమైన...ఆరోగ్యకరమైన కూరగాయలు,పండ్లు ఉత్పత్తి చేస్తే...చాలా లాభమే కాదు నగర జీవితానికి సంబంధించిన అనేక సమస్యలను ఒత్తిళ్లను అధిగమించవచ్చు. ప్రతి ఒక్కరూ పూనుకోవాలే కానీ పెద్ద కష్టమేమీ కాదు. అందుకే రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లాకో మోడల్‌ రూఫ్‌ గార్డెన్‌ నిర్మిస్తే ఆసక్తి ఉన్నవారికి తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి సౌకర్యంగా ఉంటుందని ప్రతిపాదిస్తారు. అంతేకాదు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మిద్దెతోటల పెంపకాన్ని ఒక యజ్ఞంగా చేపడితే భవిష్యత్తు అవసరాలు తీరడంతో పాటు పర్యావరణ, సామాజిక పరంగా మేలు జరుగుతుంది. బతుకునిండా విష రసాయనాలను నింపుకుంటే శరీరం నిండా పలు వ్యాధులు వచ్చి చేరతాయి. ఈ ప్రమాదాలను గుర్తించాలి. వీటికి వ్యతిరేకంగా పోరాడాలి. చిన్న సంస్కరణ చేయాలంటే పెద్ద పోరాటమే చేయాల్సి ఉంటుంది. మనం పోరాటం ఆపినప్పుడు మన మరణం మొదలవుతుందని తన ‘మిద్దెతోట' పుస్తకంలో హెచ్చరిస్తారు రచయిత రఘోత్తమరెడ్డి‌.

English summary
"Midde thota"... This is success story of a successful writer Thummeti Raghottam Reddy who has created his own niche in rooftop farming. There is a close connection between writing and gardening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X