అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అర్ద్రరాత్రి అమరావతిలో హైడ్రామా:టీడీపీ నేతలు వర్సెస్ పోలీసులు: చంద్రబాబును దారి మళ్లించి..!

|
Google Oneindia TeluguNews

అమరావతిలో అర్ద్రరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. శానసభలో మూడు రాజధానుల బిల్లు పైన చర్చించే సమయంలో..తనకు పూర్తిగా మాట్లాడే అవకాశం ఇవ్వకపోవటం పైన ప్రతిపక్ష నేత చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేసారు. దీనికి నిరసనగా సభలో టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి ప్రసంగానికి అడ్డు తగలటంతో టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుండి సస్పెండ్ చేసారు. మార్షల్స్ వారిని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. ఆ తరువాత లాబీల్లో చంద్రబాబు తో సహా టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు. ఆ తరువాత ముఖ్యమంత్రి వెళ్లే మార్గంలో ఆందోళనకు సిద్దం కాగా..వారిని అరెస్ట్ చేసి అక్కడి నుండి తరలించారు. దీంతో.. చంద్రబాబుతో సహా పార్టీ నేతలు లాఠీఛార్జ్ లో గాయపడిన వారిని మందడం గ్రామంలో పరామర్శిం చేందుకు సిద్దమయ్యారు. వారు అసెంబ్లీ నుండి పాదయాత్రగా మందడానికి బయల్దేరారు. దీంతో..ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

పాదయాత్రగా మందడం గ్రామానికి..
ప్రతిపక్ష నేత చంద్రబాబుతో సహా టీడీపీ ఎమ్మెల్యేలు పాదయాత్రగా మందడం గ్రామానికి బయల్దేరారు. దీంతో..పోలీసులు వారిని అడ్డుకున్నారు. వారందరినీ పోలీసు వాహనంలో ఎక్కించారు. విషయం తెలుసు కున్న టీడీపీ కార్యకర్తలు..స్థానిక గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. దీంతో..ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు వాహనం దిగి రోడ్డు పైనే బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. దీంతో..పోలీసులు టీడీపీ నేతలను అదుపులోకి తీసుకొని మంగళగిరి పోలీసు స్టేషన్ కు తరలించారు. అయితే, ఈ సమయంలో బస్సు దిగి చంద్రబాబు తో సహా ఎమ్మెల్యేలు తిరిగి మందడం వరకు పాదయాత్రకు సిద్దమయ్యారు. ఆ సమయంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు అక్కడకు చేరుకోవటంతో..పోలీసులు సైతం భారీగా మొహరించారు. రైతుల పైన లాఠీఛార్జ్ కు నిరసనగా ఈ రోజు అమరావతి గ్రామాల్లో బంద్ కు పిలుపునిచ్చారు.

చంద్రబాబును దారి మళ్లించి..
పోలీసు వాహనంలో చంద్రబాబు ను తరలించిన పోలీసులు ఆయన్ను ఇంటి సమీపం వద్దకు తీసుకెళ్లి..సమీపంలోకి రాగానే దారి మళ్లించారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఆయన్ను యాక్సిస్ రోడ్డు.. కరకట్ట.. డొంక మీదుగా దాదాపు మూడు కిలో మీటర్లు తిప్పారని పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. చంద్రబాబును ఉద్దేశ పూర్వకంగానే అర్ద్రరాత్రి సమయంలో డొంక రోడ్లలో తిప్పి ఇబ్బంది పెట్టారని ఆరోపిస్తున్నారు. ఆ తరువాత చంద్రబాబును ఆయన నివాసానికి తరలించారు. ఇక, అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందినా తమ నిరసనలు ఆగవని రాజధాని రైతులు స్పష్టం చేస్తున్నారు, అమరావి జేఏసీ పిలుపు మేరకు బంద్ నిర్వహిస్తున్నారు. హైకోర్టు తమ అభిప్రాయాలను చెప్పేందుకు ఇచ్చిన సమయం ముగియకుండానే ఏ విధంగా అసెంబ్లీలో బిల్లు పెడతారని ప్రశ్నిస్తున్నారు. అమరావతి గ్రామాల్లో ఇప్పటికే విద్యా సంస్థలు..దుకాణాలు మూసి వేసారు. తాము న్యాయ పోరాటం కొనసాస్

English summary
Three rockets hit near the US embassy in the Iraqi capital Baghdad's high-security Green Zone early Tuesday, a news agency cited security sources as saying.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X