వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ‌న్ భ‌జ‌న‌..వివాదంలో మంత్రి: క్ష‌మాప‌ణ‌కు మ‌జ్లిస్ పార్టీ డిమాండ్‌: వివ‌ర‌ణ ఇవ్వ‌క త‌ప్ప‌లేదు..!

|
Google Oneindia TeluguNews

ముఖ్య‌మంత్రి మెప్పు కోసం అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించిన ఏపీ మంత్రి వివాదంలో చిక్కుకున్నారు. అవ‌స‌రానికి మించి సీఎం జ‌గ‌న్ భ‌జ‌న చేసి ఇర‌కాటంలో ప‌డ్డారు. ఏపీ అసెంబ్లీలో బిల్లుల పైన చ‌ర్చ‌లో భాగంగా మంత్రి గుమ్మ‌నూరు జ‌య‌రాం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను ప్ర‌శంసించ‌టంలో అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను దేవుడిగా భావించాల‌ని వ్యాఖ్యానించారు. దీని పైన మ‌జ్లిస్ పార్టీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఇది ముస్లిం వ‌ర్గాల మ‌నోభావాల‌ను గాయ‌ప‌రిచేలా వ్యాఖ్యానించారంటూ అభ్యంత‌రం చెప్పింది. దీంతో..ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సూచ‌న మేర‌కు మంత్రి జ‌య‌రాం వివ‌ర‌ణ ఇచ్చారు. త‌న వ్యాఖ్య‌ల్లో త‌ప్పు ఉంటే క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నానంటూ వివాదానికి ముగింపు ప‌లికారు.

మంత్రి జ‌య‌రాం భ‌జ‌న‌..స‌మ‌స్య‌లు..
ఏపీ శాస‌న‌స‌భ‌లో ఈ నెల 24న అసెంబ్లీలో ప్ర‌వేశ పెట్టిన బిల్లుల పైన చ‌ర్చ స‌మ‌యంలో మంత్రి జ‌య‌రాం సీఎం జ‌గ‌న్‌ను ప్ర‌శంసించే క్ర‌మంలో అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించారు. స‌భా సాక్షిగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను దేవుళ్ల‌తో పోల్చారు . బీసీ..ఎస్సీ..ఎస్టీ..మైనార్టీ వర్గాల‌కు 50 శాతం నామినేటెడ్ ప‌ద‌వులు..ప‌నులు ఇవ్వ‌టం కోసం బిల్లును ప్ర‌వేశ పెట్టారు. ఆ స‌మ‌యంలో కార్మిక శాఖా మంత్రి జ‌య‌రాం మాట్లాడారు. ప‌రిశ్ర‌మ‌ల్లో స్థానికుల కోసం 75 శాతం ఉద్యోగాలు కేటాయిం చే బిల్లు పైనా చర్చ సాగింది. అందులో భాగంగా..స‌భ‌లోనే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను అన్ని వ‌ర్గాలు ఆరాధించే దేవుళ్ల పేర్ల‌ను వ‌రుస‌గా ప్ర‌స్తావించారు. ఆ స‌మ‌యంలో మంత్రి జ‌య‌రాం చేసిన వ్యాఖ్య‌ల స‌మ‌యంలో వైసీపీ స‌భ్యుల‌తో పాటుగా ముఖ్య‌మంత్రి జ‌గన్ సైతం స‌భ‌లోనే ఉన్నారు. సీఎం సైతం అలా వ‌ద్దు అంటూ సైగ‌ల‌తోనే వారించారు. అయితే మంత్రి మాత్రం త‌న భ‌జ‌న కొన‌సాగించారు. దీంతో.. ఏకంగా శాస‌న‌స‌భ‌లోనే కొన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు ఆరాధించే పేర్లు ప్ర‌స్తావించి..ముఖ్య‌మంత్రితో పోల్చ‌టం వివాదాస్ప‌దంగా మారింది.

MIM Serious on AP Minister Jayaram comments in Assembly compare CM Jagan with God.

మ‌జ్లిస్ పార్టీ ఆ్ర‌గ‌హం..మంత్రి వివ‌ర‌ణ‌
ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను తాము ఆరాధించే దైవంతో పోల్చ‌టం పైన మ‌జ్లిస్ పార్టీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. త‌మ ముస్లిం వ‌ర్గాల మ‌నోభావాల‌ను దెబ్బ తీయ‌ట‌మే అంటూ సీరియ‌స్ అయింది. దీని పైన మంత్రి వెంట‌నే క్ష‌మాప‌ణ‌లు చెప్పాల ని ..చేసిన వ్యాఖ్య‌లు ఉప‌సంహ‌రించుకోవాల‌ని డిమాండ్ చేసింది. దీంతో..మంత్రి జ‌య‌రాంకు తాను చేసిన భ‌జ‌న ఏ స్థాయిలో శృతి మించిందో అర్దం అయింది. వెంట‌నే త‌న వ్యాఖ్య‌ల‌కు వివ‌ర‌ణ ఇచ్చారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ తీసుకు న్న‌నిర్ణ‌యాల‌తో అన్ని వ‌ర్గాలకు మేలు జ‌రుగుతుంద‌నే సంతోషంతో..వాట‌న్నింటికీ చ‌ట్ట‌బ‌ద్ద‌త క‌ల్పిస్తుండ‌టంతో తాను ఉద్వేగానికి గుర‌య్యాయ‌న‌ని మంత్రి వివ‌రించారు. సీఎంకు కృత‌జ్ఞ‌త‌గా దేవుడి లాంటి వ్య‌క్తి అని చెప్ప‌టానికి ప్ర‌య‌త్నించాన‌ని చెప్పుకొచ్చారు. త‌న వ్యాఖ్య‌ల వెనుక ఎలాంటి దురుద్దేశం లేద‌ని.. అయినా త‌న వ్యాఖ్య‌ల్లో త‌ప్పు ఉంటే మ‌నస్పూర్తిగా క్ష‌మాప‌ణ చెబుతున్నాన‌ని పేర్కొన్నారు. దీంతో..ఈ వివాదం ముగిసింది.

English summary
MIM Serious on AP Minister Jayaram comments in Assembly compare CM Jagan with God. Immediately Minister jayaram given clarification and asked apology.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X