వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా ప్రాణాలకు, లోకేష్ ప్రాణాలకు రక్షణ లేదు ...మావోల నుండే కాదు వారి నుండి కూడా అంటున్న బాబు

|
Google Oneindia TeluguNews

Recommended Video

హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు || Chandrababu Naidu Aproaches High Court Of AP For His Security

ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడికి ఉన్న భద్రతా వ్యవస్థను ఏపి సిఎం వైయస్ జగన్ ఒక్కొక్కటిగా తగ్గించుకుంటూ వచ్చిన నేపధ్యంలో చంద్రబాబు హై కోర్టును ఆశ్రయించారు. తనకు, లోకేష్ ప్రాణాలకు రక్షణ లేదని ఆయన తన పిటీషన్ లో పేర్కొన్నారు. తనకు, తన కుటుంబానికి భద్రత పెంచాలని కోరుతూ మాజీ సిఎం చంద్రబాబు నాయుడు హైకోర్టు లో వేసిన పిటీషన్ పై ఆసక్తికర వాదనలు జరిగాయి. ఇక చంద్రబాబు తనకు రక్షణ కావాలని కోర్టును ఏయే అంశాల ప్రాతిపదికగా కోరారంటే

మరో సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం జగన్ ..అర్బన్ హౌసింగ్ స్కీమ్ పై సీఎం నజర్మరో సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం జగన్ ..అర్బన్ హౌసింగ్ స్కీమ్ పై సీఎం నజర్

మావోయిస్ట్ ల హిట్ లిస్టు లో తాను ,తన కుమారుడు లోకేష్ ఉన్నారని కోర్టుకు తెలిపిన బాబు. అలిపిరి ఘటన గుర్తు చేసిన బాబు

మావోయిస్ట్ ల హిట్ లిస్టు లో తాను ,తన కుమారుడు లోకేష్ ఉన్నారని కోర్టుకు తెలిపిన బాబు. అలిపిరి ఘటన గుర్తు చేసిన బాబు

కేంద్రం ఇచ్చిన ఎన్‌ఎస్‌జి (నేషనల్ సెక్యూరిటీ గార్డ్) కమాండోలతో పాటు తన భద్రతను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని చంద్రబాబు నాయుడు హైకోర్టును కోరారు. తన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని , తాను మావోయిస్టుల హిట్ లిస్టులో ఉన్నానని చంద్రబాబు నాయుడు పేర్కొన్నాడు. అక్టోబర్ 1, 2003 న అలిపిరిలో మావోయిస్టులు తనపై ఎలా దాడి చేశారో గుర్తుచేసుకున్న చంద్రబాబు, 2016 అక్టోబర్‌లో ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్ తర్వాత తాను, తన కుమారుడు లోకేష్ ను మావోలు టార్గెట్ చేశారని , మా ప్రాణానికి తీవ్ర ముప్పు ఉందని ఆయన కోర్టుకు నివేదించారు . తనకు మరియు తన కుమారుడి ప్రాణాలకు మావోయిస్టుల ముప్పు ఉందని నివేదించిన ఒక ఆంగ్ల దినపత్రిక యొక్క నివేదికను కూడా చంద్రబాబు నాయుడు కోర్టులో ఉదహరించారు. 2018 సెప్టెంబరులో అప్పటి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను దారుణంగా హత్య చేసిన విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు.

 తనకు మావోలతోనే కాదు ఎర్ర చందనం స్మగ్లర్లతో రాజకీయ ప్రత్యర్ధులతో కూడా ప్రాణ హాని ఉందన్న బాబు

తనకు మావోలతోనే కాదు ఎర్ర చందనం స్మగ్లర్లతో రాజకీయ ప్రత్యర్ధులతో కూడా ప్రాణ హాని ఉందన్న బాబు

ముందస్తు నోటీసు లేదా సమాచారం లేకుండా ఏపి రాష్ట్ర ప్రభుత్వం తన భద్రతను జూన్ 25 నుండి తగ్గించిందని చంద్రబాబు కోర్టుకు చెప్పారు. టూ ప్లస్ టూ భద్రత మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. 2014 నుండి 2019 వరకు అప్పటి ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్‌కు తమ ప్రభుత్వం 7 ప్లస్ 7 భద్రతను కల్పించిందని నాయుడు పేర్కొన్నారు. ఒక ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చిన భద్రత కూడా ఇవ్వటం లేదని కోర్టుకు తెలిపారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు తన పిటిషన్లో, మావోయిస్టులు, రెడ్ శాండల్ స్మగ్లర్లు మరియు మాఫియా నుండి మరియు తాను అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన తన రాజకీయ ప్రత్యర్థుల నుండి కూడా తనకు ముప్పు ఉందని విజ్ఞప్తి చేశారు. సిఎంగా ఉన్న కాలంలో ఎర్ర చందనం అక్రమ రవాణాపై తీవ్ర చర్యలు తీసుకున్నామని చెప్పారు.

తనకు తన కుటుంబానికి మునుపటి భద్రత కొనసాగించాలని కోర్టుకు విజ్ఞప్తి చేసిన బాబు

తనకు తన కుటుంబానికి మునుపటి భద్రత కొనసాగించాలని కోర్టుకు విజ్ఞప్తి చేసిన బాబు

తొమ్మిదేళ్లపాటు యునైటెడ్‌ ఏపికి సిఎంగా పనిచేసిన చంద్రబాబు , 2014 నుండి 2019 వరకు విభాజిత ఏపికి సిఎంగా కూడా పనిచేశారు. 2004 నుండి 2014 వరకు యునైటెడ్‌ ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశారు. తన మునుపటి అనుభవాలను, మావోయిస్టులు, స్మగ్లర్ల నుండి బెదిరింపులను కోర్టుకు తెలిపి తనకు మరియు తన కుటుంబానికి మునుపటి భద్రతను కొనసాగించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని చంద్రబాబు కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

English summary
Former CM Chandrababu Naidu has moved High Court seeking an increase of security to him and his family. Naidu has sought the High Court to direct the state government to increase his security in addition to the NSG (National Security Guard) commandos given by the Centre. Naidu claimed that his life is under risk and he is in the hit list of Maoists.Chandrababu, who is the leader of Opposition, in his petition, appealed that he has threat from Maoists, Red Sandal smugglers and mafia and also from his political opponents pertaining to the decisions he had taken when he was in power. He said he had taken serious measures against red sandal smuggling during his tenure as the CM.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X