వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి ఆది ఎన్నిక‌ల జ్యోతిష్యం : ఆ ఓట‌ర్లంతా టిడిపికే వేసారు : గ్రామీణ ఓట‌ర్లు వైసిపి వైపే..!

|
Google Oneindia TeluguNews

ఏపిలో పోలింగ్ స‌ర‌ళి..ఎన్నిక‌ల ఫ‌లితాల పైన ఎవ‌రి అంచ‌నాలు వారికి ఉన్నాయి. టిడిపి..వైసిపి అధినేత‌లు గెలుపు పైన ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో ఎన్నిక‌ల జ్యోతిష్కులు తెర మీదుకు వ‌చ్చారు. తాజాగా క‌డ‌ప ఎంపీగా టిడిపి నుండి పోటీ చేసిన మంత్రి ఆది నారాయ‌ణ రెడ్డి ఎన్నిక‌ల పోలింగ్ స‌ర‌ళిని పార్టీ అధినేత‌కు వివ‌రించారు. అదే స‌మ‌యంలో ఎక్క‌డ..ఏ వ‌ర్గాలు ఎవ‌రికి ఓట్లు వేసార‌నే దాని పైనా విశ్లేష‌ణ చేసారు. టిడిపి విజ‌యం ఖాయ‌మ‌ని తేల్చి చెప్పారు. ఇక‌, స‌హ‌జ రీతిలో వైసిపి మీద విమ‌ర్శ‌లు చేసారు.

మ‌హిళ‌లంతా టిడిపి వైపే..
ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తాజాగా క‌డ‌ప జిల్లాకు వెళ్లారు. అక్క‌డ మంత్రి ఆదినారాయణ రెడ్డి తో పాటుగా జిల్లా టిడిపి నేత‌ల‌తో పోలింగ్ స‌ర‌ళి గురించి చ‌ర్చించారు. పోలింగ్ స‌ర‌ళి టిడిపికి అనుకూలంగా ఉంద‌ని వివ‌రించారు. తాము ప‌క్కా లెక్క‌లు..ఆధారాలు సేక‌రించామ‌ని చెప్పుకొచ్చారు. డ్వాక్రా మ‌హిళ‌లు పెద్ద ఎత్తున పోలింగ్ బూత్‌ల‌కు త‌ర‌లి వ‌చ్చార‌ని..వారు టిడిపికి పూర్తి స్థాయిలో మ‌ద్ద‌తుగా నిలిచార‌ని విశ్లేషించారు. పెన్షనర్లు మాత్రం పూర్తిస్థాయిలో టీడీపీకి మద్ధతుగా నిలిచారని విశ్లేషించారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్ల వల్ల కలిగిన లాభంతో వారు సైతం టిడిపి వైపే మొగ్గు చూపార‌ని చెప్పుకొచిన‌ట్లు తెలుస్తోంది. ఇక‌. క‌డ‌ప జిల్లాలో టిడిపి మూడు సీట్ల‌లో గెలిచే అవ‌కాశాలు ఉన్నాయ‌ని వివరించారు. టిడిపికి జ‌మ్మ‌ల‌మ‌డుగు, రైల్వే కోడూరు తో పాటుగా మ‌రో కీల‌క నియోజ‌క‌వ‌ర్గంలో పోలింగ్ స‌ర‌ళి అనుకూలంగా ఉందంటూ విశ్లేషించిన‌ట్లు స‌మాచారం.

Minister Adi Narayana confident on TDP Win : Rural voters supported YCP..

గ్రామీణ మ‌హిళ‌లు వైసిపి వైపే..
అయితే, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం మ‌హిళ‌లు సామాజిక వ‌ర్గాల వారీగా చీలి..ఒక వ‌ర్గం వారే టీడీపీ వైపు మొగ్గు చూపారాని వివ‌రించారు. గ‌త ఎన్నిక‌ల్లో ముస్లిం మైనార్టీలు ఎక్కువ‌గా వైసిపికి ప‌ట్టం క‌ట్ట‌గా..టిడిపి వైపు కేవ‌లం 20 శాతం మాత్ర‌మే ఉండ‌గా..ఈ సారి మాత్రం 50 శాతానికి పెరిగింద‌ని చెప్పుకొచ్చారు. మోదీ పైన చేస్తున్న పోరాటం సైతం మైనార్టీల‌ను టిడిపికి ద‌గ్గ‌ర చేసింద‌న్న‌ది టిడిపి నేత‌ల విశ్లేష‌ణ‌. ఇప్పుడు వైసిపి చేస్తున్న ప్ర‌చారం నిజం కాద‌ని ..2014లో ఇంత కంటే జోరుగా గెలుపు గురించి ప్ర‌చారం చేసుకున్నార‌ని ఆది నారాయ‌ణ రెడ్డి త‌న అభిప్రాయంగా ముఖ్య‌మంత్రికి వివ‌రించిన‌ట్లు తెలుస్తోంది. ఇక‌, ఇదే స‌మ‌యంలో మే 23న ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యే వ‌ర‌కూ వైసిపి నేత‌ల‌ను అదే విధంగా ఆశ‌ల్లో ఉండ‌నీయండంటూ ముఖ్య‌మంత్రి వ్యాఖ్యానించినట్లు స‌మాచారం. అయితే, ఇప్పుడు మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి చేసిన విశ్లేష‌ణ పై క‌డ‌ప తో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ మొద‌లైంది. క‌డ‌ప‌లో టిడిపి మూడు సీట్లు గెలిచే ప‌రిస్థితి ఉందా అనేది ఆ జిల్లా నేత‌ల సందేహం.

English summary
Elections Results Speculations going on in AP. TDP Leaders confident on party winning. Recently Minister Adi Narayana Reddy says Urban voters supported TDP and Rural voters with YCP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X