కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌కు అవమానమే, మార్చకుంటే: వర్మకు ఆది హెచ్చరిక, 'బాబు వైసీపీ వ్యూహం పసిగట్టాడు'

|
Google Oneindia TeluguNews

కడప: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు కడప జిల్లా తెలుగుదేశం పార్టీ నేత, మంత్రి ఆదినారాయణ రెడ్డి బుధవారం హెచ్చరికలు జారీ చేశారు. ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప పేరుతో ఆయన వెబ్ సిరీస్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

చదవండి: మమ్మల్ని లెక్క చేయరు, చేతులు ఎత్తాలి: మోడీపై జేసీ దివాకర్ రెడ్డి

దీనిపై ఆదినారాయణ తీవ్రంగా మండిపడ్డారు. కడప పేరుతో ఇలా తెరకెక్కించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. బెజవాడ సినిమాలో మాదిరిగానే కడప సినిమాలోను మార్పులు చేయాలని హితవు పలికారు.

చదవండి: రజనీకాంత్-పవన్ కళ్యాణ్: అక్కడే ఇద్దరి మధ్య తేడా! దానికి జనసేనాని ఫుల్‌స్టాప్

లేదంటే తగిన బుద్ధి చెబుతారు

లేదంటే తగిన బుద్ధి చెబుతారు

కడప చిత్రంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మార్పులు చేయకుండే జిల్లాకు చెందిన ప్రజలు ఆయనకు తగిన బుద్ధి చెబుతారని ఆదినారాయణ రెడ్డి హెచ్చరించారు. దీనిపై ఆర్జీవి తగ్గాలని సూచించారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు.

అది జగన్‌కు అవమానకరం, సత్తా చూపించేవాళ్లం

అది జగన్‌కు అవమానకరం, సత్తా చూపించేవాళ్లం

అదే సమయంలో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పైన కూడా ఆదినారాయణ రెడ్డి విమర్శలు గుప్పించారు. కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ పోటీ నుంచి తప్పుకోవడం ఆ పార్టీకి, ఆ పార్టీ అధ్యక్షులు జగన్‌కు అవమానకరం అని విమర్శించారు. వైసీపీ పోటీ చేస్తే మా సత్తా చూపించేవాళ్లమన్నారు. జగన్ సీఎం పదవి కోసం కాకుండా ప్రజల గురించి ఆలోచించాలన్నారు.

వైసీపీ దిగజారింది, వ్యూహలను అంచనా వేసి కేఈ ఎంపిక

వైసీపీ దిగజారింది, వ్యూహలను అంచనా వేసి కేఈ ఎంపిక

ఎమ్మెల్సీ ఎన్నికలను ఎదుర్కోలేకే వైసీపీ బరి నుంచి తప్పుకుందని అంతకుముందు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఎద్దేవా చేశారు. వైసీపీ పోటీ చేయలేని స్థితికి దిగజారిపోయిందన్నారు. పోటీ చేయకపోవడం వారి దివాళాకోరుతనం రాజకీయాలకు నిదర్శనం అన్నారు. సీఎం చంద్రబాబు అనుభవజ్ఞడు కావడంతో రెండు రోజుల పాటు సమావేశాలు నిర్వహించి వైసీపీ వ్యూహాలను అంచనా వేసి వారికి చెక్ చెప్పే విధంగా సరైన అభ్యర్థిని ఎంపిక చేశారన్నారు.

14 నియోజకవర్గాల్లో ప్రతిబింబిస్తుంది

14 నియోజకవర్గాల్లో ప్రతిబింబిస్తుంది

ఎన్నికల్లో తమ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తారని కేఈ కృష్ణమూర్తి ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నిక రానున్న సాధారణ ఎన్నికల్లో జిల్లాలోని 14 నియోజకవర్గ గెలుపును ప్రతిబింబిస్తుందన్నారు. కొందరు స్వతంత్ర అభ్యర్థులు ఓటర్లను మభ్యపెట్టి సంతకాలు చేయించినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటి మోసపూరిత చేష్టలపై చర్యలు తప్పవన్నారు.

English summary
Telugu Desam Party leader and Minister Adinarayana Reddy has warned director Ram Gopal Varma over Kadapa web series.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X