ఆళ్లగడ్డ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చికెన్ రుచి చూసిన మంత్రి, అధికారులకు హెచ్చరిక: అఖిలప్రియ హల్‌చల్

బొర్రా గుహల సందర్శనకు వచ్చే పర్యాటకులకు అసౌకర్యం కలిగితే సహించేది లేదని మంత్రి అఖిలప్రియ అధికారులకు స్పష్టం చేశారు.

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: బొర్రా గుహల సందర్శనకు వచ్చే పర్యాటకులకు అసౌకర్యం కలిగితే సహించేది లేదని మంత్రి అఖిలప్రియ అధికారులకు స్పష్టం చేశారు. పర్యటక ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు.

ఆళ్లగడ్డలొ అఖిలప్రియకు ఝలక్: జగన్‌కు ఊహించని మద్దతు, 'ఆమెను చూసి బాధపడ్డా'ఆళ్లగడ్డలొ అఖిలప్రియకు ఝలక్: జగన్‌కు ఊహించని మద్దతు, 'ఆమెను చూసి బాధపడ్డా'

బొర్రా గుహలు, అనంతగిరి కాఫీ తోటలను ఆమె సందర్శించారు. బొర్రా గుహల్లో పర్యటకులతో మాట్లాడారు. ఎంట్రీ ఫీజు, సదుపాయాలు, సిబ్బంది తీరు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. పర్యాటకులు కొన్ని ఫిర్యాదులు చేసారు. దీంతో ఆ సమస్యలు తీర్చాలని అధికారులను ఆదేశించారు.

పడవ ప్రమాదంపై వారెలా బాధ్యులు: అఖిల వైపు వేళ్లు! ఆ కీలక వ్యక్తిని కాపాడుతున్నారా?పడవ ప్రమాదంపై వారెలా బాధ్యులు: అఖిల వైపు వేళ్లు! ఆ కీలక వ్యక్తిని కాపాడుతున్నారా?

 సహించేది లేదు

సహించేది లేదు

గుహల సందర్శనకు వచ్చే పర్యటకులకు అసౌకర్యం కలిగితే సహించేది లేదని అఖిలప్రియ చెప్పారు. అనంతరం పర్యటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెస్టారెంట్‌ను సందర్శించారు.

 రెస్టారెంటులోకి వెళ్లి తనిఖీ

రెస్టారెంటులోకి వెళ్లి తనిఖీ

పరిసరాల శుభ్రతను పరిశీలించారు. వంట గదిలోకి వెళ్లి వంట సామగ్రి, ఆహార పదార్థాలను తనిఖీ చేశారు. రెస్టారెంటులో తింటున్న వారిని ఆహారం గురించి అడిగి తెలుసుకున్నారు. ఫర్వాలేదని వారు చెప్పడంతో నాణ్యత బాగుంటే పర్యాటకులు ఎక్కువగా వస్తారని అఖిల సూచించారు.

 కేంద్రం ఇస్తే మరింత అభివృద్ధి

కేంద్రం ఇస్తే మరింత అభివృద్ధి

అరకు లోయ సర్క్యూట్‌ పరిధిలోని పర్యటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు కేంద్రం రూ.100 కోట్లు మంజూరు చేయాలని కోరినట్లు అఖిల తెలిపారు. నిధులు మంజూరైతే అరకులోయ, అనంతగిరి యూనిట్లను మరింత అభివృద్ధి చేస్తామన్నారు.

 వర్షం పడితే ఇబ్బంది

వర్షం పడితే ఇబ్బంది

బొర్రా గుహల లోపలకు వెళ్లే మెట్లు వర్షం పడితే నడిచేందుకు ఇబ్బందిగా ఉంటుందని పర్యటకులు చెప్పారని, వాటిని సరిచేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తామని అఖిలప్రియ అన్నారు. కేకే లైనులో కిరండూల్‌ రైలు నిలిచిపోవడంతో ఆ ప్రభావం పర్యటకంపై పడిందని, త్వరగతిన రైలు మార్గాన్ని పునరుద్ధరించాలని రైల్వే అధికారులకు చెప్పామన్నారు.

 అద్దాల రైలుకు ఆదరణ

అద్దాల రైలుకు ఆదరణ

అద్దాల రైలుకు ఆదరణ బాగుందని, త్వరలోనే మరో బోగి ఏర్పాటు చేసే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. కాగా, బొర్రా గుహల వద్ద స్థానిక యువత విక్రయిస్తున్న బొంగు చికెన్‌ను ఆమె రుచి చూశారు.

English summary
Andhra Pradesh Minister Bhuma Akhila Priya visited Borra Caves on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X