India
  • search
  • Live TV
రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు కమీషన్లు కొట్టేశారు - కేంద్రం ప్రశంసించింది : పోలవరం పూర్తి చేస్తాం- అంబటి..!!

|
Google Oneindia TeluguNews

ఏపీ జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు మంత్రి హోదాలో టీడీపీ అధినేత చంద్రబాబు పైన ఫైర్ అయ్యారు. పోలవరం ప్రాజక్టు గురించి వస్తున్న కథనాల పైన ఆయన స్పందించారు.పోలవరం పునరావాసం రెండు ముక్కలు, రాజధాని మూడు ముక్కలు అంటూ ఏదో జరిగిపోయినట్లు ప్రజల్లో విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వాస్తవాలు బయటకు రానీయకుండా..చంద్రాబుకు మద్దతుగా వ్యవహరిస్తున్నారంటూ ఒక వర్గం మీడియా పైన విమర్శలు చేసారు. వాస్తవాలు ఏంటో తెలుసుకుంటే మంచిదని సూచించారు.

మళ్లీ కట్లాల్సి వచ్చిందని వెల్లడి

మళ్లీ కట్లాల్సి వచ్చిందని వెల్లడి


ప్రపంచంలో ఏ ప్రాజెక్టు కట్టినా ఒకేసారి నీళ్లతో నింపరని, కాబట్టి దశలవారీగా చేస్తారని చెప్పుకొచ్చారు. పోలవరం జాతీయ ప్రాజెక్టని..దీనిని కేంద్రం నిర్మించే ప్రాజెక్టుగా చెప్పారు. పొరుగున ఉన్న రాష్ట్రాలను సైతం సమన్వయం చేసుకుంటూ వెళ్లాల్సి ఉందన్నారు. రూ 800 కోట్లు మళ్లీ ఖర్చు పెట్టటానికి ఎవరు కారణమో చెప్పలేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. చంద్రబాబు స్పిల్‌వే కట్టకుండా కాపర్ డ్యాం కట్టి డబ్బులు కొట్టేశారని ఆరోపించారు. వరదలకు అది కొట్టుకుపోయిందని.. డయాఫ్రం వాల్ సైతం కొట్టుకుపోవటంతో..మళ్లీ కట్టాల్సి వచ్చిందని అంబటి వివరించారు. ఇలాంటి పరిస్థితి ప్రపంచంలోనే మొదటిసారిగా జరిగిందని చెప్పారు.

చంద్రబాబు కమీషన్లు కొట్టేశారంటూ

చంద్రబాబు కమీషన్లు కొట్టేశారంటూ

త్వరగా అయిపోయే పనులు చేసి చంద్రబాబు కమీషన్లు కొట్టేశారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత చిత్తశుద్దిలో పోలవరం పనులు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. సీఎం జగన్, కేంద్ర మంత్రి పోలవరం పరిశీలించిన విషయం గుర్తు చేసారు. పునరావాస కాలనీలు కూడా బాగా జరుగుతున్నాయని కేంద్రమంత్రే ప్రకటించారని చెప్పుకొచ్చారు. బాధితులకు నేరుగా వారి ఖాతాలోనే డబ్బు వేసేలా చర్యలు చేపట్టారని అంబటి రాంబాబు చెప్పారు. తమ హయాంలోనే పోలవరం పూర్తి చేస్తామని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేసారు. వాస్తవానికి ప్రాజెక్టుకు సంబంధించి చాలా ఇబ్బందులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాలి, ఇంకా సీడబ్ల్యూసీ క్లియరెన్స్‌ ఇవ్వాలని వివరించారు.

జగన్ స్పష్టమైన వైఖరితో ఉన్నారు

జగన్ స్పష్టమైన వైఖరితో ఉన్నారు


ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి అయిన పోలవరంపై బురదచల్లే ప్రయత్నాలు చేయవద్దని, వాటిని మానండని ముఖ్యమంత్రి ఇటీవల శాసనసభలో కూడా చాలా స్పష్టంగా చెప్పారని గుర్తు చేసారు. పోరస్‌ అగ్నిప్రమాద ఘటనలో ప్రభుత్వం ఎంత వేగంగా స్పందించిందో, ఎంత వేగంగా చర్యలు చేపట్టింది అన్నది ఎవరైనా చూడాలన్నారు. గతంలో విశాఖలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ ఘటన తీవ్రతను బట్టి, బాధిత కుటుంబాలకు కోటి రూపాయిలు పరిహారం అందించాం. టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇలా చేశారా అంటూ మంత్రి రాంబాబు ప్రశ్నించారు.

English summary
AP Irrigation minister Mbati Rambabu given clarity on polavaram consturction and rehabitation. He says Chandra Babu wors for commission in his regime.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X