వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎలుకతోలు తెచ్చి 400రోజులు ఉతికినా.. నాయకులు కాలేరు: లోకేష్, పవన్‌లపై మంత్రి అంబటి రాంబాబు

లోకేష్ పాదయాత్ర పై, నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రసంగంపై మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియా వేదికగా తనదైన శైలిలో టార్గెట్ చేశారు. పాదయాత్రలు చేసినా నాయకులు కాలేరన్నారు. తం

|
Google Oneindia TeluguNews

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు ప్రజా సమస్యలపై సమర శంఖం పూరించిన విషయం తెలిసిందే. యువగళం పాదయాత్ర ద్వారా ప్రజల కోసం రాష్ట్ర ప్రగతి కోసం పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటానని, ప్రజల సమస్యల పరిష్కారానికి పనిచేస్తానని చెప్తున్న నారా లోకేష్ 40 ఏళ్ల వయసులో 400 రోజులు పాటు నాలుగు వేల కిలోమీటర్ల మేర పాదయాత్రను కొనసాగించనున్నారు. ఇక ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ లోకేష్ యువగళం పాదయాత్రకు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. యువగళం వినిపించడానికి యువదళమై కదలిరండి.. నారా లోకేష్ తో కలిసి కదంతొక్కండి అంటూ పిలుపునిస్తుంది.

యువగళం పాదయాత్ర మొదలెట్టిన నారా లోకేష్

యువగళం పాదయాత్ర మొదలెట్టిన నారా లోకేష్

4000 కిలోమీటర్లు... 400 రోజులు... 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలకు ప్రతీకగా, అరాచక పాలనపై యువశక్తి పూరిస్తున్న సమరశంఖారావం... నారా లోకేష్ నిర్వహిస్తున్న 'యువగళం' పాదయాత్ర అని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్న టిడిపి, ఈ పాదయాత్రలో పాల్గొనండి. మీ గళం వినిపించండి. మీ లక్ష్యాన్ని నిర్దేశించండి. 'యువగళం' పాదయాత్రను చారిత్రాత్మకం చేయండి అంటూ విజ్ఞప్తి చేస్తుంది.

లోకేష్, పవన్ కళ్యాణ్ లను టార్గెట్ చేసిన మంత్రి అంబటి రాంబాబు

లోకేష్, పవన్ కళ్యాణ్ లను టార్గెట్ చేసిన మంత్రి అంబటి రాంబాబు


చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని లక్ష్మీపురం లో ఉన్న శ్రీ వరదరాజ స్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి 11 గంటలకు లోకేష్ తన పాదయాత్రను ప్రారంభించారు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కాలినడకన తిరిగి క్షేత్రస్థాయిలో పరిస్థితులను, ప్రజల సమస్యలను లోకేష్ తెలుసుకోనున్నారు. ఇక ఈ క్రమంలో లోకేష్ పాదయాత్ర పై, నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రసంగంపై మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియా వేదికగా తనదైన శైలిలో టార్గెట్ చేశారు.

ఎలుక తోలు తెచ్చి 400 రోజులు ఉతికినా నలుపు నలుపే గానీ తెలుపు రాదు

లోకేష్ 400 రోజులు ప్రజా క్షేత్రంలో పాదయాత్ర చేసినా నాయకుడు కాలేడని మంత్రి అంబటి రాంబాబు సెటైర్ వేశారు. ఎలుక తోలు తెచ్చి 400 రోజులు ఉతికినా నలుపు నలుపే గానీ తెలుపు రాదు ! గావంచ కట్టినోడల్లా గాంధీ కాలేడు.. పాదయాత్ర చేసినోడల్లా నాయకుడూ కాలేడు ! అంటూ నారా లోకేష్ ను ఉద్దేశించి ట్విట్టర్ వేదికగా ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన అంబటి రాంబాబు రిపబ్లిక్ డే సందర్భంగా నిన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను టార్గెట్ చేశారు.

స్వర్గంలో ఉన్న తండ్రినే అవమానపరిచే పుత్రుడు పవన్ కళ్యాణ్

మా నాన్న నాస్తికుడు అంటూ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లపై మంత్రి అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు. రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ తాను చేసిన ప్రసంగంలో తన తండ్రి నాస్తికుడని నాయనమ్మ దీపారాధన చేస్తే సిగరెట్ వెలిగించుకుని దేవుడు లేడు దయ్యం లేడు అనేవాడని కానీ ఆ తర్వాత కాలంలో తన ఏదో తప్పు చేశానని ప్రతిరోజు బాధపడేవాడని పేర్కొన్నారు. ఇక పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో పవిత్రమైన దీపారాధనతో సిగరెట్టు ముట్టించుకునేవాడని స్వర్గంలో ఉన్న తండ్రినే అవమానపరిచే పుత్రుడు సమాజానికి అవసరమా అంటూ జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలను సంధించారు మంత్రి అంబటి రాంబాబు.

English summary
Minister Ambati Rambabu in his own style satirized Lokesh and Pawan kalyan saying that even if they bring rat skin and wash it for 400 days, that will never change and lokesh and pawan did padayatras they will never be leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X