India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుకు మంత్రి అనిల్ సవాల్: పోలవరాన్ని ముందే పూర్తి చేస్తాం..టీడీపీని మూసేస్తారా?

|
Google Oneindia TeluguNews

దేశ చరిత్రలో రివర్స్ టెండరింగ్ ఓ సాహసోపేత నిర్ణయమని..దీనిని చూసి టీడీపీ నేతలు భయపడిపోతన్నారని ఇరిగేషన్ శాఖా మంత్రి అనిల్ విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రివర్స్ టెండరింగ్ ద్వారా 800 కోట్లు ఆదా అయిందని చెప్పుకొచ్చారు. తమ హయాంలో జరిగిన అవినీతి బయటపడుతుండటంతో చంద్రబాబు ముఖ్యమంత్రి పైన దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును టీడీపీ నేతలు చెప్పిన దాని కంటే ముందే పూర్తి చేస్తే..టీడీపీని పూర్తిగా మూసివేస్తారా అని మంత్రి అనిల్ సవాల్ చేసారు. పోలవరమే కాదు వెలిగొండకు కూడా రివర్స్‌ టెండరింగ్‌ కు వెళ్తామని స్పష్టం చేసారు. పోలవరం ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

నషాలాన్నంటుతున్న ఉల్లి ధరలు.. ఉల్లి వ్యాపారులపై కేంద్రం ఏం చేయబోతోంది?నషాలాన్నంటుతున్న ఉల్లి ధరలు.. ఉల్లి వ్యాపారులపై కేంద్రం ఏం చేయబోతోంది?

టీడీపీని మూసేస్తారా అంటూ సవాల్..

టీడీపీని మూసేస్తారా అంటూ సవాల్..

మంత్రి అనిల్ కుమార్ టీడీపీ అధినేత చంద్రబాబు..ఆ పార్టీ నేతల మీద ఫైర్ అయ్యారు. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రాష్ట్రానికి వేల కోట్లు ఆదా చేస్తూ పారదర్శకంగా వెళ్తుంటే తమ దోపిడీ బండారం బయట పడిపోతుంది అని టిడిపి నేతలు బయపడుతున్నారని విమర్శించారు. 4,987 కోట్ల రూపాయలు ఉండే టెండర్‌ 4,359 కోట్లకు వచ్చిందని వివరించారు. పోలవరం హెడ్‌ వర్క్స్‌ కు సంబంధించి రివర్స్‌ టెండరింగ్‌ లో 800 కోట్ల ప్రజాధనం ఆదా అయిందని వివరించారు. అందుకే ముఖ్యమంత్రి జగన్ పైన చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మేఘా 12.6 శాతం తక్కువకు పనులు చేస్తామని ముందుకు వస్తే దానిపై కూడా నానా యాగి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇదే మేఘా సంస్దకు మీ హయాంలో 20 వేల కోట్లమేర కాంట్రాక్ట్‌ లు ఇచ్చారని...నాణ్యతపై విమర్శలు చేస్తున్నారన్నారు. ఇంత ప్రముఖ సంస్ద నాణ్యత పాటించదని చెప్పడం సరికాదని మంత్రి వ్యాఖ్యానించారు. పోలవరం పైన రకరకాలుగా ప్రచారం చేస్తున్నారని.. ప్రాజెక్టును టీడీపీ నేతలు చెప్పినదాని కంటే ముందుగా తాము పూర్తి చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారా..టీడీపీని పూర్తిగా మూసేస్తారా అంటూ మంత్రి అనిల్ సవాల్ చేసారు.

దోపిడీ సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్లింది...

దోపిడీ సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్లింది...

పోలవరమే కాకుండా.. వెలిగొండకు కూడా రివర్స్‌ టెండరింగ్‌ కు వెళ్తామని మంత్రి స్పష్టం చేసారు. టీడీపీ ఇచ్చిన ప్రతి పని గురించి రివర్స్‌ టెండరింగ్‌ కు వెళ్తామన్నారు.వేల కోట్ల రూపాయలు ఆదా దిశగా ముందుకు వెళ్తామని స్పష్టం చేసారు. టీడీపీ ప్రభుత్వం ఎక్సెస్‌ ఇచ్చిన టెండర్ల ద్వారా దోపిడీ చేసిన మొత్తం పెదబాబు లేదా చినబాబు జేబులోకి వెళ్లాయా లేక మరెవరిజేబుల్లోకి వెళ్లాయని మంత్రి ప్రశ్నించారు.
ప్రభుత్వానికి అవసరమైనవారికి కట్టబెట్టారని విమర్శిస్తున్నారని..10 నుంచి 20 శాతం వరకు లెస్‌ కు టెండర్‌ వేస్తే వాటిని కట్టబెట్టడం అంటారా అని నిలదీసారు. మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రెస్‌ మీట్‌ పెట్టి మాట్లాడుతున్న స్దలం కూడా సంవత్సరానికి వేయి రూపాయలకు లీజుకు తీసుకున్నారని..ఇంకా మీరు నీతి నిజాయితీ అని మాట్లాడతారా అని ప్రశ్నించారు. ఆయనకు సిగ్గుంటే ఆ స్దలాన్ని ఖాళీ చేసి మాట్లాడండి అంటూ సూచించారు. ఇరిగేషన్‌ డిపార్ట్‌ మెంట్‌ పై జగన్‌ మోహన్‌ రెడ్డి దాడి చేస్తున్నారంటారా అని ఆగ్రహం వ్యక్తం చేసారు.

పోలవరం ఎత్తు తగ్గించేదే లేదు..

పోలవరం ఎత్తు తగ్గించేదే లేదు..

టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చిన ఎక్సెస్ కు ఇచ్చారని..వైసీపీ ప్రభుత్వం లెస్ కు టెండర్లు ఇస్తోందని అనిల్ చెప్పుకొచ్చారు. రివర్స్ టెండరింగ్ వలన 830 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం మిగిలందని ..రివర్స్‌ టెండరింగ్‌ కు వెళ్లకపోతే ఇన్ని కోట్ల రూపాయలు చంద్రబాబు ఆయన వందిమాగధుల చేతిలోకి వెళ్లిఉండేవని వ్యాఖ్యానించారు. నవయుగవాళ్లు కావాలనుకుంట బిడ్‌ లో పాల్గొనవచ్చుకదా అని చెప్పుకొచ్చిన మంత్రి తాము వారిని వద్దనలేదన్నారు. వాళ్లు నామినేషన్‌ లో అయితే ముందుకు వస్తారు కానీ.. బిడ్డింగ్‌ లో అయితే పాల్గొనరని చెప్పారు. రెండు సంవత్సరాలలో పోలవరం నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి అనిల్ స్పష్టం చేసారు. చంద్రబాబు,టిడిపి ఎల్లోమీడియా విషప్రచారాలను నమ్మవద్దని.. టెండరింగ్‌ లో పారదర్శకతే తమ ప్రభుత్వం లక్ష్యమని తేల్చి చెప్పారు.

English summary
AP Minister Anil Kumar challenged TDP leaders that Govt will complete Polavaram project in coming two years. HE says Cm Jagan trying to save the public money in projects. minister clarified that Polavaram height will be not reduced.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X