వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇది ట్రయిలర్ మాత్రమే ఇంకా చాలా సినిమా ఉంది .. రివర్స్ టెండరింగ్ పై మంత్రి అనీల్

|
Google Oneindia TeluguNews

పోలవరం రివర్స్ టెండర్ల ద్వారా 58 కోట్ల రూపాయల ఆదా అయ్యిందని, ఇక రివర్స్ టెండరింగ్ ప్రక్రియను కొనసాగిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఇది ట్రైలర్ మాత్రమే నని ముందు ముందు సినిమా చాలా ఉందని ఆయన పేర్కొన్నారు. 58 కోట్ల ఆదా ఆరంభమే అన్న ఆయన పారదర్శకంగా ముందుకు వెళ్తామని పేర్కొన్నారు.

బోటు ప్రమాదంపై సమీక్షతో సరిపోతుందా ? ఆ ఫోటోలు ఎందుకు బయటపెట్టలేదని హర్షకుమార్ సంచలనంబోటు ప్రమాదంపై సమీక్షతో సరిపోతుందా ? ఆ ఫోటోలు ఎందుకు బయటపెట్టలేదని హర్షకుమార్ సంచలనం

ఇక పోలవరం ప్రాజెక్టు విషయంలో టీడీపీ అవినీతి బయట పడిందన్న మంత్రి అనిల్ కుమార్ కేవలం మూడు వందల కోట్ల రూపాయల పనుల్లో ప్రస్తుతం 58 కోట్ల మిగిల్చి నట్లుగా పేర్కొన్నారు. రివర్స్ టెండరింగ్ పై టిడిపి అసత్య ప్రచారం చేసిందని మండి పడిన మంత్రి సీఎం జగన్ తనకు అనుకూలమైన వారికి తొలి టెండర్ పనులు కట్టబెట్టారని టీడీపీ నేతలు చెప్పడం దారుణమని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా టిడిపి నేతలు అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు.

minister anil kumar yadav comments on reverse tenders in polavaram project works

మంచి ఆలోచనతో జగన్ ముందుకు వెళుతుంటే, పారదర్శకంగా పాలన సాగిస్తుంటే, రాష్ట్రానికి ప్రయోజనకరంగా ఉండే నిర్ణయాలు తీసుకుంటే టీడీపీకి కళ్ల మంట గా ఉందని ఆయన ఆరోపించారు. చంద్రబాబు గతంలో 4.77 శాతం ఎక్కువ ఇచ్చారని పేర్కొన్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జగన్ ప్రభుత్వం మాత్రం 15.6 శాతం చాలా తక్కువ కు టెండర్ ఇచ్చిందని వెల్లడించారు. ఇంకా విషయంలో 36 వేల కోట్ల పనులు చేయాల్సి ఉందని చెప్పిన మంత్రి గత టిడిపి సర్కార్ పోలవరం దాదాపుగా పూర్తయిందని చెప్పు కుందని మండిపడ్డారు. గతంలో ఎక్సెస్ టెండర్ వేసిన సంస్థ ఇప్పుడు లెస్ గా టెండర్ వేసింది అని పేర్కొన్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రివర్స్ టెండరింగ్ పారదర్శక విధానంతోనే ముందుకు వెళతామని తేల్చి చెప్పారు.

English summary
Anil Kumar Yadav, Minister of State for Water Resources, said that Rs 58 crore has been saved through reverse tenders of Polavaram and the reverse tendering process will be continued. He noted that there was a film before it was only a trailer. He said that the start of the Rs 58 crore saving is a sample of transparent rule .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X