AP Panchayat elections AP Panchayat elections 2021 anil kumar yadav chandrababu tdp ycp victory andhra pradesh ys jagan amaravati vijayawada ap local body elections local body elections nimmagadda ramesh kumar ramesh kumar high court chandrababu naidu ap government అనిల్ కుమార్ యాదవ్ చంద్రబాబు టిడిపి వైసిపి విజయం ఆంధ్రప్రదేశ్ వైయస్ జగన్ అమరావతి విజయవాడ స్థానిక సంస్థల ఎన్నికలు హైకోర్టు చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వం politics
ప్రపంచంలోనే ఓడిపోయినా సంబరాలు జరుపుకునే పార్టీ ఒక్క టీడీపీనే .. మంత్రి అనిల్ సెటైర్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ఫలితాలపై అధికార వైసిపి, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. పంచాయతీ ఎన్నికలలో వైసిపి అక్రమాలకు పాల్పడి గెలిచిందని టిడిపి నేతలు విమర్శలు గుప్పిస్తుంటే, వైసీపీ మంత్రులు ఏపీలో టీడీపీ అడ్రస్ లేకుండా పోతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ భారతదేశ చరిత్రలోనే ఓడిపోతే సంబరాలు చేసుకునే పార్టీ ఒక్క టిడిపి మాత్రమేనని అన్నారు.
చంద్రబాబును పిచ్చాసుపత్రిలో చేర్పించండి ..లేకుంటే కష్టమే..సలహా ఇచ్చిన కొడాలి నాని

కేవలం 16 శాతం విజయం సాధించిన టీడీపీ సంబరాలు ఏమిటో
కేవలం 16 శాతం మద్దతుదారులు విజయం సాధించిన టీడీపీ సంబరాలు జరుపుకోవడం ఏమిటని ప్రశ్నించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 81 శాతం సీట్లు సాధిస్తే అదేమీ లేదని చెప్పడం, 41 శాతం స్థానాల్లో టిడిపి మద్దతుదారులు గెలిచారని అబద్దాలు చెప్పడానికి చంద్రబాబుకు సిగ్గు ఉండాలి అని విమర్శించారు. సొంత నియోజకవర్గంలో టిడిపి డిపాజిట్లు కూడా తెచ్చుకోలేక పోవడం చంద్రబాబు దౌర్భాగ్యం అంటూ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు.

సర్పంచ్ ఎన్నికలకు 25 మీడియా సమావేశాలు పెట్టింది ఒక్క టీడీపీనే
ప్రపంచంలో ఓడిపోయిన పార్టీ సంబరాలు జరుపుకోవడం ఒక టిడిపిలో తప్ప ఎక్కడ జరిగి ఉండదు అంటూ సెటైర్లు వేసిన మంత్రి, సర్పంచ్ ఎన్నికలకు 25 మీడియా సమావేశాలు నిర్వహించడం ప్రపంచంలో ఎక్కడా జరిగి ఉండదని పేర్కొన్నారు. టిడిపి కి వచ్చిన 16 శాతం కూడా వైయస్సార్ సిపి రెబెల్స్ వల్ల వచ్చిందని లేదంటే సింగిల్ డిజిట్ కే టిడిపి పరిమితమయ్యేదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. నువ్వు పెట్టిన నిమ్మగడ్డ అంతా బాగా జరిగింది అంటే నువ్వేమో రావణకాష్టం అంటావా అంటూ చంద్రబాబు పై విరుచుకుపడ్డారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్.

టీడీపీ అంపశయ్యపై నుండి చితిలో పడింది
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయని టిడిపి అంపశయ్యపై నుంచి చితిలో పడిపోయిందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.
మాట్లాడడానికి ఏమీ లేక స్వామీజీల మీద ఆరోపణలు చేస్తున్నారని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చంద్రబాబుకు పవర్ కట్ అయిందని అందరికీ కట్ అవుతుంది అనుకుంటే ఎలా అంటూ సెటైర్లు వేశారు.

మిడిసిపడితేనే ప్రజలు చంద్రబాబు నడుం విరగ్గొట్టారు
చంద్రబాబు మిడిసిపడ్డాడు కాబట్టి ప్రజలు నడుం విరిగ్గొట్టారని, వైయస్ జగన్ పాలన నచ్చింది కాబట్టి గెలిపించారని పేర్కొన్నారు. వెన్నుపోటు, క్షుద్రపూజల పేటెంట్ హక్కులు ఉంది చంద్రబాబుకేనని విమర్శించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రాష్ట్రంలో గెలవలేమని తెలిసే చంద్రబాబు మకాంను హైదరాబాద్ కు మార్చారు అంటూ ఎద్దేవా చేశారు .