వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌తో సై, వైయస్ రాజశేఖర రెడ్డి అన్యాయం: మంత్రి అచ్చెన్నాయుడు

ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో చర్చకు సిద్ధమని మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం నాడు అన్నారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో చర్చకు సిద్ధమని మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం నాడు అన్నారు. జగన్‌తో ఎలాంటి చర్చకైనా తాము సిద్ధమని చెప్పారు.

రాయలసీమకు అన్యాయం చేసింది దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి, ప్రస్తుత వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని మండిపడ్డారు. ప్రాజెక్టుల పైన అవగాహన లేని జగన్ విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. జగన్ ప్రతిపక్ష నేత అంటే నమ్మశక్యంగా లేదన్నారు.

పవన్ కళ్యాణ్ టు నాగబాబు..: మరో ఛాన్స్ లేదు.. చిరంజీవిని లాగుతున్నారు!

కాగా, చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేనని వైసీపీ అధ్యక్షులు జగన్‌ ఆరోపించారు. ఎన్నికల్లో అమలు చేయలేని హామీలిచ్చి రైతాంగానికి నరకం చూపుతున్నారని విమర్శించారు. కర్నూలు జిల్లా బండిఆత్మకూరు మండలం చిన్నదేవళాపురం, నారాయణాపురం, సంతజూటూరు, లింగాపురం, జీసీ పాలెం, సోమయాజులపల్లె, ఓంకారం, ఈర్నపాడు తదితర గ్రామాల్లో ఆదివారం ఆయన రైతు భరోసా యాత్ర నిర్వహించారు.

Minister atchannaidu challenges YS Jagan on development.

శ్రీశైలం వైసీపీ ఇంచార్జి బుడ్డా శేషారెడ్డి ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లో జరిగిన రోడ్డు షో, బహిరంగ సభల్లో జగన్‌ ప్రసంగించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో ఇప్పటి వరకు ఏ ఒక్క దాన్నీ 100 శాతం నెరవేర్చలేదని, అది చంద్రబాబు చేతకానితనమని అన్నారు. బుద్ధీ, జ్ఞానం, సిగ్గు ఏమాత్రం ఉన్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు.

ఎమ్మెల్సీ అన్నం సతీష్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019లో బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే సీటు తనదేనని, తనను అడ్డుకునే శక్తి ఎవరికీ లేదన్నారు. సోమవారం బాపట్లో టీడీపీ కార్యకర్తలు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న సతీష్ ఉద్వేగంగా మాట్లాడారు.

కొందరు కావాలనే తనపై కేసు పెట్టించి రాద్దాంతం చేశారన్నారు. చంద్రబాబు కోసం ప్రాణాత్యాగానికైనా సిద్ధమన్నారు. టీడీపీ గెలుపు కోసం ఎంతదూరమైనా వెళ్తానన్నారు. బాపట్ల టూరిజం సిబ్బందిని కొట్టినట్లు కేసు నమోదైన నేపథ్యంలో సతీష్ ఈ వ్యాఖ్యలు చేశారు.

English summary
Minister atchannaidu challenges YS Jagan on development.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X