వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి అవంతికి కోపమొచ్చింది .. ఆ ఆస్పత్రి లో చంద్రబాబు ఫోటోలే అసలు కారణమట

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ పాలనలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా కొనసాగుతున్న నాయకులు, వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏ మాత్రం చిన్న అవకాశం దొరికినా విరుచుకుపడుతున్నారు. ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని సాధించి టిడిపిని చావు దెబ్బ కొట్టింది. ఇక ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ముఖ్యమంత్రిగా జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన రెండు నెలలలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో తన మార్క్ చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని బయట పెట్టాలని కంకణం కట్టుకున్న వైసిపి టీడీపీ అధినేత చంద్రబాబును, టిడిపి నేతలను టార్గెట్ చేసుకుంటూ ముందుకు వెళుతున్న క్రమంలో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

టీడీపీ నుండి వైసీపీలో చేరిన అవంతి శ్రీనివాస్ .. చంద్రబాబు టార్గెట్ గా అవంతి హడావిడి

టీడీపీ నుండి వైసీపీలో చేరిన అవంతి శ్రీనివాస్ .. చంద్రబాబు టార్గెట్ గా అవంతి హడావిడి

ఎన్నికలకు ముందు టిడిపిని వీడి వైసిపి తీర్థం పుచ్చుకుని ఎమ్మెల్యేగా గెలిచి జగన్ మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్నారు అవంతి శ్రీనివాస్. ఒక లెక్క లో చెప్పాలి అంటే జగన్ మంత్రివర్గంలో ఉన్న చాలా మంది నేతలు ఒకప్పుడు టీడీపీలో ఉన్నవారే. ఇక రాజకీయాలలో బాగా యాక్టివ్‌గా ఉంటూ, తనదైన శైలిలో ప్రతిపక్షాలపై విరుచుకుపడే అవంతి శ్రీనివాస్ ఇక తాజాగా చంద్రబాబు ఫోటో విషయంలో పెద్ద హడావుడే చేసేసారు. మొన్నటికి మొన్న గంటా బీజేపీలో చేరతారని, చంద్రబాబే వీళ్ళందరినీ బీజేపీలోకి పంపిస్తున్నారని సంచలన ఆరోపణలు చేసిన అవంతి ఇప్పుడు తాజాగా ఓ ఆస్పత్రిలో హల్చల్ చేశారు. ఇంతకీ అవంతి శ్రీనివాస్ చేసిన హడావిడి గురించి తెలుసుకుంటే అవాక్కవడం మాత్రం ఖాయం.

విశాఖలోని విక్టోరియా ఘోషా ప్రభుత్వ ఆస్పత్రిలో భోజనం సరిగా అందటం లేదని గరంగరం అయిన మంత్రి

విశాఖలోని విక్టోరియా ఘోషా ప్రభుత్వ ఆస్పత్రిలో భోజనం సరిగా అందటం లేదని గరంగరం అయిన మంత్రి

విశాఖలోని విక్టోరియా ఘోషా ప్రభుత్వ ఆస్పత్రిలో ద్రోణంరాజు శ్రీనివాస్‌తో కలిసి ఆకస్మిక తనిఖీ నిర్వహించిన అవంతి శ్రీనివాస్ ఆసుపత్రిలోని చంద్రబాబు ఫోటోలపై పెద్ద ఎత్తున ఆసుపత్రి సిబ్బంది పై మండిపడ్డారు. ప్రభుత్వం మారినప్పటికి కూడా కొత్త ముఖ్యమంత్రి ఫోటో, వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఫోటో పెట్టలేదనే విషయం తెలియడంతో ఆ ఆసుపత్రికి ఆకస్మిక తనిఖీ కోసం వెళ్లారు అవంతి శ్రీనివాస్.

ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు బాగానే ఉండడంతో గర్భిణిల వార్డుకు వెళ్ళిన ఆయన భోజనాన్ని రుచి చూడాలని నిర్ణయించుకున్నారు. అయితే ప్లేట్‌లో భోజనం పెట్టించుకుని ఒక ముద్ద తిన్నాడో లేదో ఇక అక్కడ అధికారులపై అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఆహారం ఏమి బాగాలేదని, గర్భిణీలకు ఎటువంటి ఆహారం పెడుతున్నారు అంటూ సూపరిండెంట్ పై నిప్పులు చెరిగారు.

చంద్రబాబు ఫోటోలు తీసెయ్యాలని సూపరిండెంట్ కు వార్నింగ్ .. ఆకస్మిక తనిఖీ అందుకేనని రాజకీయ వర్గాల్లో చర్చ

చంద్రబాబు ఫోటోలు తీసెయ్యాలని సూపరిండెంట్ కు వార్నింగ్ .. ఆకస్మిక తనిఖీ అందుకేనని రాజకీయ వర్గాల్లో చర్చ

ఇక అప్పటికే ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తున్న సూపరిండెంట్ కు, విషయం అర్థమయ్యేలా చెప్పేశారు అవంతి శ్రీనివాస్.

ఇది చంద్రబాబు ప్రభుత్వం కాదని, కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కావస్తున్న ఇంకా పాత ముఖ్యమంత్రి , వైద్య మంత్రి ఫోటోలు ఎందుకు మార్చలేదు అని సూపరిండెంట్ పై మండిపడ్డారు. అప్పటికి కానీ సూపరిండెంట్ కు విషయం బోధ పడలేదు .వెంటనే అసలు విషయం అర్ధం చేసుకున్న సూపరిండెంట్ సిబ్బందికి చెప్పి ఫోటోలను మార్చవలసిందిగా ఆదేశించారు. ఆస్పత్రికి వచ్చి హడావుడి చేసిన అవంతి శ్రీనివాస్ అసలు ఆసుపత్రి తనిఖీకి వచ్చింది చంద్రబాబు ఫోటో లను ఉద్దేశించి అని అక్కడ ఉన్న రోగులందరూ గుసగుసలాడుకున్నారు. నిన్న మొన్నటి దాకా టీడీపీలో ఉండి చంద్రబాబును ఎస్ బాస్ అన్న అవంతి శ్రీనివాస్ ఇప్పుడు వైసీపీ మంత్రిగా చంద్రబాబు ఫోటోలు సైతం సహించలేక పోతున్నాడని విశాఖ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

English summary
Avanti Srinivas, who conducted an abrupt checkup with Dronaraju Srinivas at Victoria Ghosha Government Hospital in Vishakha, was furious over the photos of Chandrababu at the hospital. Avanti Srinivas went to the hospital for a sudden check, knowing that the new Chief Minister's photo and the Chief Minister of Health did not keep a photo even after the government changed. He fired on the hospital superintendent about the former cm chandrababu's photos .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X