వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇద్దరు మంత్రులు రాజీనామా..! తీర్మానం ఆమోదం పొందగానే :సీఎం జగన్ వారికిచ్చే పదవులివే..!

|
Google Oneindia TeluguNews

ఏపీలో శాసనమండలి రద్దుకు ఏపీ కేబినెట్ నిర్ణయించింది. ఇక, కాసేపట్లో అసెంబ్లీలోనూ తీర్మానం ఆమోదం పొందటం లాంఛనమే. ఇదే సమయంలో మండలి నుండి జగన్ కేబినెట్ లో మంత్రులుగా ఉన్న ఇద్దరి రాజకీయ భవితవ్యం పైన ఇప్పుడు చర్చ మొదలైంది. ఈ రోజు మండలి రద్దు తీర్మానం ఆమోదం పొందినా..కేంద్రం ఆమోదించి..రాష్ట్రపతి తుది నోటిఫికేషన్ ఇచ్చే వరకూ శాసన మండలి..సభ్యులు కొన సాగే అవకాశం ఉంది.

కానీ, నైతికత పేరుతో ఈ ఇద్దరు మంత్రులు పదవుల్లో కొనసాగటానికి సుముఖంగా లేరని విశ్వసనీయ సమాచారం. వారిద్దరూ కేబినెట్ సమావేశంలో సైతం ముఖ్యమంత్రి నిర్ణయానికి తమ మద్దతు ప్రకటించారు. సీఎం సైతం వారిద్దరి రాజకీయ భవిష్యత్ తాను చూసుకుంటానని స్పష్టమైన హామీ ఇచ్చారు. దీంతో..సాయంత్రానికి శాసనసభలో తీర్మానం ఆమోదం పొందగానే ఆ మంత్రులిద్దరూ రాజీనా మా చేస్తారని ప్రచారం సాగుతోంది. అయితే, దీని పైన ముఖ్యమంత్రి సూచనల మేరకు వారిద్దరూ నడుచుకొనే అవకాశం ఉంది.

 ఇద్దరు మంత్రుల అడుగులు ఎటు..!

ఇద్దరు మంత్రుల అడుగులు ఎటు..!

ఏపీలో శాసనమండలి రద్దు చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. ప్రస్తుతం సభలో ఇదే అంశం పైన ముఖ్యమంత్రి ప్రతిపాదించిన మండలి రద్దు తీర్మానం చర్చ సాగుతోంది. ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో మండలి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రుల కు సంబంధించి ప్రత్యేకంగా ప్రస్తావనకు వచ్చింది.

ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్.. మోపిదేవి వెంకట రమణ మండలి రద్దు కారణంగా పదవులు కోల్పోయినా..వారికి రాజకీయంగా తాను బాధ్యత తీసుకుంటానంటూ ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. గురువారం సభలో ఇదే అంశం పైన చర్చ జరిగిన సమయంలోనూ మాట్లాడిన ఇద్దరు మంత్రులు..ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలోనూ ముఖ్యమంత్రి నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేసారు. దీంతో..ఇప్పుడు వీరిద్దరూ ఏం చేయబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

రాజీనామాకు సిద్దమైన మంత్రులు..!

రాజీనామాకు సిద్దమైన మంత్రులు..!

కేబినెట్ లో నిర్ణయం అయిన వెంటనే మంత్రులిద్దరూ తమ అభిప్రాయాలను సహచర మంత్రులతో పంచుకున్నారు. మండలి రద్దు చేస్తూ ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవటంతో..తాము ఇక మంత్రులుగా కొనసా గటం సరైనది కాదనే అభిప్రాయం వారిద్దరూ వ్యక్తం చేసారు. కేంద్రం ఆమోదించే వరకూ సభ కొనసాగుతుందని..అప్పటి వరకు రాజీనామా అవసరం లేదనే అభిప్రాయం ఇతర మంత్రులు ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది.

అయితే, బోస్..మోపిదేవి మాత్రం ఈ రోజు సభలో జరిగే చర్చలో ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా మాట్లాడనున్నారు. ఆ తరువాత సభలో తీర్మానం ఆమోదం పొంది..కేంద్రానికి పంపాలనే నిర్ణయం సభలో జరిగిన వెంటనే ఆ మంత్రులిద్దరూ రాజీనామా చేయటానికి సిద్దంా ఉన్నట్లు సమాచారం. ఈ సాయంత్రం వారిద్దరూ తమ పదవులకు రాజీనామా చేస్తారని వైసీపీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

Recommended Video

Abolish Of AP Legislative Council Resolution In Assembly After AP Cabinet Passes || Oneindia Telugu
ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.. ఏం దక్కే అవకాశం ఉంది

ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.. ఏం దక్కే అవకాశం ఉంది

అసెంబ్లీలో శాసనమండలి రద్దు తీర్మానం ఆమోదం పొందిన అనంతరం ఈ ఇద్దరూ మంత్రి పదవులకు రాజీనామా చేసే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. అయితే, పిల్లి సుభాష్ చంద్రబోస్ జగన్ కోసం నాడు రోశయ్య కేబినెట్ లో తన మంత్రి పదవికి రాజీనామా చేసారు. కాంగ్రెస్ వీడి వైసీపీలో చేరారు. ఇక, మోపిదేవి పైతం వైయస్సార్ ప్రభుత్వంలో మౌలిక వసతుల శాఖా మంత్రిగా పని చేసారు.

వ్యాన్ పిక్ పైన సీబీఐ కేసుల్లో ఆయన జగన్ తో పాటుగా జైలు జీవితం అనుభవించారు. 2019 ఎన్నికల్లో పిల్లి బోసు తూర్పు గోదావరి జిల్లా మండపేట నుండి పోటీ చేసి..మోపిదేవి గుంటూరు జిల్లా రేపల్లె నుండి పోటీ చేసి ఓడిోయారు. వారి సేవలను గుర్తించిన జగన్ మంత్రి పదవులు కట్టెబెట్టారు. ఇక, ఇప్పుడు మండలి రద్దు చేస్తుండటంతో..వచ్చే ఏప్రిల్ లో ఖాళీ అయ్యే నాలుగు రాజ్యసభ స్థానాల్లో బీసీ వర్గానికి చెందిన పిల్లి బోస్ కు రాజ్యసభ కు అవకాశం కల్పిస్తారని విశ్వసనీయ సమాచారం. ఇక మోపిదేవికిప్రాంతీయ మండలి ఛైర్మన్ గా నియమిస్తారని తెలుస్తోంది.

English summary
Two ministers in jagan cabient represnting from Council is ready for resignation. After resolution passes in Assembly both ministers may resign. Cm jagan assured them on political future.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X